తూర్పుతల్లి గర్భాన్నిచీల్చుకువచ్చిస
ప్రభాత భానునిలాంటి పసికందు
ఆతల్లిపేగునుండి విడివడి తుళ్ళిపడి లేచి
రక్తపుగడ్డలా౦టి ముఖంతో రాగం లంకించుకుని.
రాజభోగాలనుభవిస్తూ పురిటిశిశువు
రాజసంగా మనసుదోస్తూంటే
వంతులవారిగాసేవాలు చెస్తూ
ఒకరినిమించోకరు వాత్సల్యం కురిపిస్తుంటారు .
ఆనందార్ణవంలో ఓలలాడే అందాల అరవిందంలాంటి పసికందు
ఆ నింగిలోని జాబిల్లి
నేలపైన సిరిమల్లి
ఆమ్మానాన్నల కంటిపాప
ఇంటివెలుగు కలలపంట.
చిన్నారి సూర్యునికిమల్లె
చిట్టిచేతులు విప్పిన చిన్నారి
అరచేతి స్పర్సే అమర సుఖం
అందంగానవ్వితే ఇంద్రలోక దర్శనం
ప్రభాత భానునిలాంటి పసికందు
ఆతల్లిపేగునుండి విడివడి తుళ్ళిపడి లేచి
రక్తపుగడ్డలా౦టి ముఖంతో రాగం లంకించుకుని.
రాజభోగాలనుభవిస్తూ పురిటిశిశువు
రాజసంగా మనసుదోస్తూంటే
వంతులవారిగాసేవాలు చెస్తూ
ఒకరినిమించోకరు వాత్సల్యం కురిపిస్తుంటారు .
ఆనందార్ణవంలో ఓలలాడే అందాల అరవిందంలాంటి పసికందు
ఆ నింగిలోని జాబిల్లి
నేలపైన సిరిమల్లి
ఆమ్మానాన్నల కంటిపాప
ఇంటివెలుగు కలలపంట.
చిన్నారి సూర్యునికిమల్లె
చిట్టిచేతులు విప్పిన చిన్నారి
అరచేతి స్పర్సే అమర సుఖం
అందంగానవ్వితే ఇంద్రలోక దర్శనం ఏదిఏమైనా పసికందు ను పాలకుండను చూడడం
పరమానందం ప్రమోద దాయక0 దామరాజు విశాలాక్షీ ఏదిఏమైనా పసికందు ను పాలకుండను చూడడం
పరమానందం ప్రమోద దాయక0 దామరాజు విశాలాక్షీ
No comments:
Post a Comment