Saturday 20 June 2020


బాలలకథలు


                                 ఉపాయం
ముగ్గురు వర్తకులవర్తకం కోసం వేరే ప్రాంతం  వెళ్ళి వేరేచోట
అమ్ముకోవడానికి  సరుకులు పడవల్లో తెచ్చుకుంటున్నారు .
 అకస్మాత్తుగా గాలి వానరావడం వలన దగ్గరగా ఉన్న తీరంలో గల
ఊరిలో  ఆగుదామని పడవలు  లంగరు వేద్దామనుకుంటుండగానే
పెద్ద పెనుగాలి వచ్చి పడవలు తిరగబడి పోయాయి .
 ఉప్పుమూటలు .పప్పు మూటలు. నీటిలో కరిగి కొట్టుకుపోయాయి .
ఉప్పువాడు ఏడుస్తున్నాడు , పప్పు వాడూ ఏడుస్తున్నాడు.కొబ్బరి
 బొండాల వాడు  దొర్లి దొర్లి. ఏడుస్తున్నాడు .
మిగిలినఇద్దరూ అన్నారు .మేము గోల పెట్టి ఏడ్చామంటేఅర్ధంఉంది.
నువ్వెందుకలా  గోలపెడుతున్నావ్ ? మా సరుకంతఎక్కువ ఖరీదు సరుకూకాదు
విలువైనది కాదు నీసరుకు అన్నారు అక్కసుగా .
కొబ్బరి బొండాలవాడన్నాడువిలువైనదయినా కాకపోయినా మీసరుకుపోయింది.
 అది తడిసి పాడయి కొట్టుకు పోయింది .  
నేనంతలా ఏడవబట్టే కదా త్రోవన పోయే వారందరూ
వచ్చి పోగా. మిగిలిన బొండాలు  నాకు పోగు జేసి ఇచ్చారు .
తెలివిగా అన్నాడు మిగిలిన ఇద్దరూ వాడి  తెలివికాశ్చర్య పోయారు .






sreemaata

 మహాగణాధిపతయే నమ: ,శ్రీ. మాత్రే నమ:.  శ్రీ రామా !
 శ్రీచక్రమధ్యాన. స్థిరముగా. వెలసుండి
 సృష్టి స్థితి లయలు జరుపుచుండు
సింహాసనేశ్వరిని. శ్రీమాత  లలితను
చిత్తమున నిలువమని మ్రొక్కుచుంటి .

Saturday 4 January 2020

praaptam

                                                    విన్నపం 

అఖిలవిద్యలకెల్ల  ఆధారభూతమై  అలరారు  గణపతి  శరణు కోరి 

అక్షరరూపమగు ఆనందరూపులు  ఆది దంపతులను శరణు వేడి 

విజ్ణాన రూపుడై వెల్గొందువేలుపు విష్ణుదేవునికి మొక్కీ శరణుకోరి

చదువులతల్లి ఆసరస్వతీదేవిని  చేతులు జోడించి శరణు వేడి

  కోరుకుందును కొత్తవత్సరమునందు 

 కమ్మని కవిత్వమునందించు జ్ణానమొసగి

పద్యరచనలో మంచి పట్టునిచ్చి   
                                                                                                                                          సవ్యమగుమార్గములో నడిపించి  బ్రోవమనుచు .   .