అంతా అస్తవ్యస్త౦గాఉంది ఆలోచి౦చే కొలది అయోమయంగాఉంది నిన్నటి వరకూ నిర్మానుష్యంగా ఉన్నరోడ్లు
నేడు నిశ్చేష్ట పరుస్తూ ,నిర్వేదాన్ని మిగులుస్తూ
ప్రాణ భయంతో పరుగులుతీసే వారితో ,
అవసరార్ధం అటుఇటుతిరుగుతున్నవారితో
అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆందోళనతో అనుక్షణం భయపడే వారితో ,ఆందోళనదారులతో ,
అవకాశవాదులతో
నేరం చేసినవాడు నిస్సిగ్గుగా నవ్వుతూ , ఏమితెలియనివాడు ఎరకు బలై ఏడుస్తూ .
ఏమవుతోందో తెలియని స్థితి ఎవరినడగాలో అర్ధం కాని పరిస్థితి.
హంతకునకు వెంటనే బెయులు
నిర్దోషికి జీవితఖైదు నైరాశ్యంలో కొందరు
నెట్టుకు వెళ్ళలేకకొందరు
నిశ్చ్ ష్టులై ,నిర్వేదం లో కొందరు .కారణభూతమైనవాడు, కనిపించక పరారైతే
చుట్టంలాచూడవచ్చినవాడు , దెయ్య౦లా పీడిస్తుంటే
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన అగ్రరాజ్యాల్లో సమస్యకైనా
ఊళ్ళళ్ళో బాంబులు పేలతాయి .,వాతావరణాన్ని ఉదృక్త పరుస్తాయి ..
అనుక్షణం భయంతో ,ఆందోళనతో ,ఆవేదనతో, ఉద్యమాల ఊబుల్లో, రాజకీయరొచ్చుల్లో
ముందుజనం, ,వెనుకమనం అనే నాయకుల నేతృత్వం లో , ప్రజలు , నడకనడత మరచి
అరఛి ,అరచి అలసిసొలసి , సందుల్లో గొందుల్లో
మందుతాగి ,చిందులేసి , నమ్మినోల్లనందరిని నట్టేట ముంచేసి నరకమువైపు నడుస్తున్నారు .నరకయాతన పడుతున్నారు
నమ్మినవాడునట్టేట ముంచి పొతే ఏదుస్తూ , నెట్టేసిననేరాన్ని నెత్తినుండి ది౦పలేక నిస్సహాయుడై’నెత్తినొరూ మొత్తుకుంటూ గోలపెడుతూ న్యాయ స్థానం వైపు నడుస్తూ ,,పరుగులెడుతు చెయ్యని నేరానికి చెఱశాలలో మ్రగ్గి పోతూ శూన్యం లోకి చూస్తూ ,సాయాన్ని అర్ధిస్తూ ప్రాణభయం మానభయం బ్రతుకంటే భయంభయం
No comments:
Post a Comment