కరంచందుగాంధి కన్నకలలఫలము
పుతలీభాయి యొక్క పూజఫలము
పుట్టినాడు గాంధి పుణ్యఫలముగ నాడు
గుజరాతులోని పోర్బందరందు.
అక్టోబరు రెండు అద్భుతము తమ ఇంట.
ఉదయించునని ఊహించలేదు
అర్భకుడా బాలు నత్యంత శ్రద్ధతో
పెంచినారు మంచి సంస్కారమిచ్చి.
సత్యసంధతయును ఋజువర్తనమును
ప్రేమ శాంతి దయను ప్రజ్ఞ నేర్పి
పెంచినారతనిని పద్దతులు నేర్పుచు
లోకహితముకొరకు తల్లిదండ్రి .
బాల్యముననేగాంధి బాహ్యాడంబరములు తగవుఅనుచు తల్లి అనిన మాట తలదాల్చిపాలించి కడవరకుపాటింఛి కర్మయోగిగమారె ఘనతనొంది .
శ్రీరాముని చరిత తల్లిద్వారా వినుచు హరిశ్చంద్రుని నాటకమును గనుచు
బాల్యమునుండియే బహుసంస్కారములు ఒంటబట్టిoచుకొనెను ఒదిగె గాంధి .
మాoసముతినినచో మంచి దృడముగల్గి స్వాతంత్ర్యమును తప్పక తెత్తురనెడి మిత్రుని మాటవిని మేకమాంసముతినెను నిజము కాదని తెలిసి తన నైజమును మార్చె.
తల్లి దండ్రులు గురువు దైవసమమని తలచి
శాంతి శోధనలో సాధనమునుజేసి
సత్యాన్వేషణలో సాగిపోయెను గాంధి
సంకల్పబలముతో శ్రద్ధగల్గి.
అన్నయు స్నేహితుడు అప్పులు తీర్చగా బంగారు కడియము నిమ్మనడుగ తండ్రికి చెప్పక తనచేతి కడియములొ
ముక్కతీసి ఇచ్చి మోసపోయె.
తప్పును తెలుసుకొని తండ్రి కుత్తరము వ్రాసి నిజముచెప్పి దండిoప మనుచు వేడ
కోపపడక తండ్రి కన్నీళ్లు పెట్టగ చూసి కుమిలి గాంధి ఒట్టు వేసె.
మీ పాదముల ఆన తప్పు చేయ నెపుడు మన్నిoపుడని వేడ మౌన ముద్ర తోడ చిన్న నవ్వు నవ్వుతండ్రి మోము జూసి తప్పుడు పనులనుమానుకొనెను గాంధి.
భావనగరు నందు బాల్యవిద్యలు నేర్చి కళాశాలవిద్యకు బొoబాయికెళ్ళి బారిష్టరు చదువ లండనెల్లెదననిన వెళ్ళవద్దని తల్లి పట్టుబట్టె.
మాధ్యమును త్రాగను .మగువలను చేరను. మాంసమును తిననని ఒట్లువేయ , అమ్మయు , అన్నయు అనుమతి నీయగ
ఆనందముతో వెళ్లి విద్య గరపె.
తలతెగిపోయినా తల్లికిచ్చినమాట
వీడకుండగాంది విధులు నెరిపి
వెళ్ళిన పనిపైన పూర్తి శ్రద్ధ జూపి విజయవంతముగ తిరిగి ఊరికొచ్చె.
బారిష్టరు చదివి స్వదేశమునకువచ్చి న్యాయవాద వృత్తి చేతబట్టి
వృత్తిలోన మంచి వృద్ధి సాధించుటకు దక్షిణాఫ్రికాకు పయనమయ్యె.
దక్షిణాఫ్రికాలో తెల్లవారి చేత నల్లవారు పడు వెతలు జూసి
స్వానుభావముతోడ సంఘటితశక్తులే సమస్యలను ఎదుర్కొనుననుచు ఎరిగె .
నల్లవారికి “అండదండగా “నిలబడి సాధించి హక్కులు తెలియజేసి
దక్షిణాఫ్రికాలో స్వేఛ్చ కలుగజేసి మాతృభూమికి వచ్చి జూసి వగచె .
చంపారణ్యములోన సామాన్యుల బ్రతుకు దుర్భరమగుటను చూసి గాంధి సత్యాగ్రహమును శాంతియుతముగాజూపి పోరాటమును జరిపె పట్టు దలగ.
ఆనాడు కల్గిన అద్భుత భావన స్వాతంత్ర్య కాంక్షను పెంపుజేయ పారతంత్ర్యముబాప పట్టుదలతో గాంధి ఉద్యమిoపసాగె ఉరకలేసి .
అసమానతలు జూపి అవమానములుజేసి అధికార. మదముతో తెల్లవారు పన్నుపై పన్నేసి ప్రజలను పీడింప పద్ధతిగాదని. సర్దిజెప్పె.
మంచి జెప్పినవినక మనలను పీడింఛి మదముతో బాధించు తెల్లవారి మనసు మార్చి మనకుమంచి జేయగనెంచి స్వదేశీ ఉద్యమము చేపట్టె గాంధి .
ప్రజల మధ్యనతిరిగి వారిబాధలు జూసి పెద్దలను. పిన్నలను ప్రోదిజేసి శాంతియుతమైన సంగ్రామములు జరిపి జనమును జాగృతపరచె గాంధి .
ఉప్పు సత్యాగ్రహము ,స్వదేశీఉద్యమము ఉనికినిచాటి ఉత్సాహమును నింప వేలాదియువకులు విద్యావంతులు స్త్రీలు గాంధీజీ మార్గములో కదలినారు .
ధనమును ప్రాణమును తృణప్రాయముగా నెంచి స్వచ్చందముగకదలి వచ్చుచున్న
జనులకు ముందుండి సత్యముతో నడిపించె
సత్య ధర్మ శాంతి సాధనముగ.
జైల్లలోపెట్టినా తీవ్రముగా కొట్టినా,
ధన మాన ప్రాణములు బలిగ గొనిన శత్రువులో మార్పు శాంతి తోడనె తెచ్చి
తరిమి వేయుదమనెను సహనశీలి .
జలియను వాలాబాగు సంఘటన హృదయములొ అగ్ని పర్వతములను ప్రేల్చి వేయ
ఉగ్రుడై గాంధీజీ ఉరికె ఉద్యమమందు
కోట్లాది తనవారి క్షేమమెంచి.
వందేమాతరము మంత్రముగ పఠించు
భారతీయులంత తోడురాగ
బెంగాలు విభజనకు తీవ్ర నిరసన దెలిపె
సోదరుల కలహాలు చూడలేక .
సామ దాన భేద దండోపాయముల
స్వాతంత్ర్య సిద్ధిని సాదింపలేక
సణుగు కొనెడివారి చెంతజేరి కలిసి
శాంతియుతముగా పోరు జరుపమనెను.
ఎన్నెన్నో స౦ఘటన లెదను కలచివేయ ఎంతోమంది ప్రాణములు పోవ
ఎంతగనో చింతించి ఏకమగుదేశమును చూడలేననిదలచి చిఒతనొందె.
విదేశీబహిష్కరణ ఉద్యమ తీవ్రతలొ వెరపును గల్గించి విజ్ఞతను జూపించి
రాయబారము నడిపి దేశస్థితిని జూపి
రాక్షసత్వము వీడమనుచుదెలిపె.
కుటిలనీతికి కూలి చీలి పోయినట్టి
భారతీయుల స్థితికి బాధ నొంది కుమ్ములాటలుపెట్టు కుత్సితుల చర్యలతో
కుమిలి పోయెగాంధి కలలు కరుగ.
దొంగలవలె దోచి దొరలుగా పాలించి
ద్వంద్వనీతి తోడ ఏలుచున్న
దుర్మార్గవర్తనుల దుర్నీతిని జూసి
ధైర్యముగా ఎదిరించి తరిమివేసె.
అంతిమ విజయముగ ఆగష్టు పదిహేను అర్ధరాత్రి వచ్చినట్టి స్వీచ్చ
శాంతి పోరాటములో సాధించిన గాంధి ఘనవిజయముగ జాతికీర్తి నింపె .
ఎర్రకోటపైన ఎగురు మనకేతనము
ఎంతో సంతసము కలుగజేయ
ఎదలోన మురిసినా , ఏర్పాటు వాదుల
వాదనలు విని గాంధి కుమిలిపోయె.
అధికారమునుగాని అవమానమునుగాని
అంట నీయకుండ ఉండి మెలిగి
రామనామము తోడ రాత్రి పగలు గడిపి
రాజకీయము లింక వలదు అనియె .
ప్రార్ధనకు వెళ్ళేటి పరమ మౌని పైన
గుండ్ల వర్షము కురిపించె కుటిలుడొకడు
హే!రామ. యనుచును నేలపై ఒరిగెను
జాతి కీర్తి శిఖరమైన గాంధి .
అట్టిమహనీయుని ఆత్మ. మనదేశాన
అంటిపెట్టుకు తిరుగు శాంతి యందు
శాంతిని నెలకొల్పి సద్భావనను గలిగి
భరతజాతి మెలుగ బాపూజి మెచ్చు .
-------------------------------------------
దామరాజు .విశాలాక్షి. విశ్రాంత ఉపాధ్యాయని.విశాఖపట్టణం.
ph 9010902794 .damaraju.visalakshi@gmail.com
damaraju .visalakshi@ gmail.com

పుతలీభాయి యొక్క పూజఫలము
పుట్టినాడు గాంధి పుణ్యఫలముగ నాడు
గుజరాతులోని పోర్బందరందు.
అక్టోబరు రెండు అద్భుతము తమ యింట
ఉదయించునని ఊహించలేదు
అర్భకునాబాలునత్యంత శ్రద్ధతో పెంచినారు మంచి సంస్కారమిచ్చి.
సత్యసంధతను ఋజువర్తనమును ప్రేమ శాంతి దయను ప్రజ్ఞ నేర్పి
పెంచినారతనిని పద్దతులు నేర్పుచు లోకహితముకొరకు తల్లిదండ్రి .
బాల్యముననేగాంధి బాహ్యాడంబరములు తగవుఅనుచు తల్లి అనిన మాట తలదాల్చి పాలించి కడవరకు పాటింఛి కర్మయోగిగమారె ఘనత నొంది .
శ్రీరాముని చరిత తల్లిద్వారా వినుచు హరిశ్చంద్రుని నాటకమును గనుచు
బాల్యమునుండియే బహుసంస్కారములు ఒంటబట్టిoచుకొనెను ఒదిగియుండి. మాoసముతినినచో మంచి దృడముగల్గి స్వాతoత్ర్యమును తెత్తురనెడి మిత్రుని మాటవిని మేకమాంసముతినిన నిజము కాదని తెలిసి నైజమును మార్చె. తల్లి దండ్రులు గురువు దైవ సమమని తలచి
శాంతి శోధనలో సాధనమునుజేసి
సత్యాన్వేషణలో సాగిపోయెను గాంధి సంకల్పబలముతో శ్రద్ధగల్గి.
అన్నయు స్నేహితుడు అప్పులు తీర్చగా బంగారు కడియము నిమ్మనడుగ తండ్రికి చెప్పక తనచేతి కడియములొ
ముక్కతీసి ఇచ్చి మోసపోయె.
తప్పును తెలుసుకొని తండ్రి కుత్తరము వ్రాసి నిజముచెప్పిదండిoప మనుచు వేడ
కోపపడక తండ్రి కన్నీళ్లు పెట్టగ చూసి కుమిలి గాంధి ఒట్టు వేసె.
మీ పాదముల ఆన తప్పు చేయ నెపుడు మన్నిoపుడని వేడ మౌన ముద్ర తోడ చిన్న నవ్వు నవ్వుతండ్రి మోము జూసి తప్పుడు పనులనుమానుకొనెను గాంధి.
భావనగరు నందు బాల్యవిద్యలు నేర్చి కళాశాలవిద్యకు బొoబాయికెళ్ళి బారిష్టరు చదువ లండ నెల్లెదననిన వెళ్ళవద్దని తల్లి పట్టుబట్టె.
మాధ్యమును త్రాగను .మగువలను చేరను. మాంసమును తిననని ఒట్లువేయ , అమ్మయు , అన్నయు అనుమతి నీయగ
ఆనందముతో వెళ్లి విద్య గరపె.
తలతెగిపోయినా తల్లికిచ్చినమాట
వీడకుండగాంది విధులు నెరిపి
వెళ్ళిన పనిపైన పూర్తి శ్రద్ధ జూపి విజయవంతముగ తిరిగి ఊరికొచ్చె.
బారిష్టరు చదివి స్వదేశమునకువచ్చి న్యాయవాద వృత్తి చేతబట్టి
వృత్తిలోన మంచి వృద్ధి సాధించుటకు దక్షిణాఫ్రికాకు పయనమయ్యె.
దక్షిణాఫ్రికాలో తెల్లవారి చేత నల్లవారు పడు వెతలు జూసి
స్వానుభావముతోడ సంఘటితశక్తులే సమస్యలను ఎదుర్కొనుననుచు ఎరిగె .
నల్లవారికి అండదండగా నిలబడి సాధించి హక్కులు తెలియజేసి
దక్షిణాఫ్రికాలో స్వేఛ్చ కలుగజేసి మాతృభూమికి వచ్చి జూసి వగచె . చంపారణ్యములోన సామాన్యుల బ్రతుకు దుర్భరమగుటను చూసి గాంధి సత్యాగ్రహమును శాంతియుతముగాజూపి పోరాటమును జరిపె పట్టు దలగ. ఆనాడు కల్గిన అద్భుత భావన స్వాతంత్ర్య కాంక్షను పెంపుజేయ పారతంత్ర్యముబాప పట్టుదలతో గాంధి ఉద్యమిoపసాగె ఉరకలేసి . అసమానతలు జూపి అవమానములుజేసి అధికారమదముతో తెల్లవారు పన్నుపై పన్నేసి ప్రజలను పీడింప పద్ధతిగాదని సర్దిజెప్పె. మంచి జెప్పినవినక మనలను పీడింఛి మదముతో బాధించు తెల్లవారి మనసుమార్చిమనకు మంచి జేయగనెంచి స్వదేశీ ఉద్యమము చేపట్టె గాంధి . ప్రజల మధ్యనతిరిగి వారిబాధలు జూసి పెద్దలనుపిన్నలను ప్రోదిజేసి శాంతియుతమైన సంగ్రామములు జరిపె జనమును జాగ్రుతపరచె గాంధి . ఉప్పు సత్యాగ్రహము ,స్వదేశీఉద్యమము ఉనికిని చాటి ఉత్సాహమును నింప వేలాది యువకులు విద్యావంతులు స్త్రీలు గాంధీజీ మార్గములో కదలినారు . ధనమును ప్రాణమును తృణప్రాయముగా నెంచి స్వచ్చందముగకదలి వచ్చుచున్న జనులకు ముందుండి సత్యముతో నడిపించె
సత్య ధర్మ శాంతి సాధనముగ.
జైల్లలోపెట్టినా తీవ్రముగా కొట్టినా ధనమాన ప్రాణములు బలిగ గొనిన శత్రువులో మార్పును శాంతి తోడనె తెచ్చి
తరిమి వేయుదమనెను సహనశీలి .
జలియను వాలాబాగు సంఘటన హృదయములొ అగ్ని పర్వతములు ప్రేల్చి వేయ
ఉగ్రుడై గాంధీజీ ఉరికె ఉద్యమమందు
కోట్లాది తనవారి క్షేమమెంచి.
వందేమాతరము మంత్రముగ పఠించు
భారతీయులంత తోడురాగ
బెంగాలు విభజనకు తీవ్ర నిరసన దెలిపె
సోదరుల కలహాలు చూడలేక .
సామ దాన భేద దండోపాయముల
స్వాతంత్ర్య సిద్ధిని సాదింపలేక
సణుగు కొనెడి వారి చెంతజేరి కలిసి
శాంతియుతముగా పోరు జరుపమనెను.
ఎన్నెన్నో స౦ఘటన లెదను కలచివేయ ఎంతోమంది ప్రాణములు పోవ
ఎంతగనో చింతించి ఏకమగుదేశమును చూడలేననిదలచి చిoతనొందె.
విదేశీబహిష్కరణ ఉద్యమ తీవ్రతలొ వెరపును గల్గించి విజ్ఞతను జూపించి
రాయబారము నడిపి దేశస్థితిని జూపి
రాక్షసత్వము వీడమనుచుదెలిపె.
కుటిలనీతికి కూలి చీలి పోయినట్టి
భారతీయుల స్థితికి బాధ నొంది కుమ్ములాటలుపెట్టు కుత్సితుల చర్యలతో
కుమిలి పోయెగాంధి కలలు కరుగ.
దొంగలవలెదోచి దొరలుగా పాలించి
ద్వంద్వనీతి తోడ ఏలుచున్న
దుర్మార్గవర్తనుల దుర్నీతిని జూసి
ధైర్యముగా ఎదిరించి తరిమివేసె.
అంతిమ విజయముగ ఆగష్టు పదిహేను అర్ధరాత్రి వచ్చినట్టి స్వీచ్చ
శాంతి పోరాటములో సాధించిన గాంధి ఘనవిజయముగ జాతికీర్తి నింపె .
ఎర్రకోటపైన ఎగురు మనకేతనము
ఎంతో సంతసము కలుగజేయ
ఎదలోన మురిసినా ఏర్పాటు వాదుల
వాదనలు విని గాంధి కుమిలిపోయె.
అధికారమునుగాని అవమానమునుగాని
అంట నీయకుండ ఉండి మెలిగి
రామనామము తోడ రాత్రి పగలు గడిపి
రాజకీయము లింక వలదు అనియె .
ప్రార్ధనకు వెళ్ళేటి పరమ మౌని పైన
గుండ్ల వర్షము కురిపించె కుటిలుడొకడు
హేరామ యనుచును నేలపై ఒరిగెను
జాతి కీర్తి శిఖరమైన గాంధి .
అట్టిమహనీయుని ఆత్మమనదేశాన
అంటిపెట్టుకు తిరుగు శాంతి యందు
శాంతిని నెలకొల్పి సద్భావనను గలిగి
భరతజాతి మెలుగ బాపూజి మెచ్చు .
-------------------------------------------
దామరాజు .విశాలాక్షి. విశ్రాంత ఉపాధ్యాయని.విశాఖపట్టణం.
ph ౯౦౧౦౯౦౨౭౯౪ 9010902794 .
damaraju .visalakshi@ gmail.com