దిష్టిబొమ్మ_ దీపపు సెమ్మె ..
“అలా దిష్టిబొమ్మలా గుమ్మంలో కూర్చోకపోతే, పొలిమేరల్లో తిరిగి ఆగాకరకాయలో,
పెసర కాయలో ఏరుకురావచ్చుగా?
కాలక్షేపం అవుతుంది,కడుపునిండుతుంది,
విసురుగా మామ గారి నుద్దేశించి అంటోంది కోడలు విమల.
“ అవునమ్మా!! ఆయన తీరికగా తిని
అరక్క ఇంట్లో కూర్చున్నారుగా ?
మరి,అరగాలంటే అలా తిరిగిరావాలి బాధగా అంటోంది అత్తగారు గున్నమ్మ” .
ఓయబ్బో ! పౌరుషానికి ఏమి తక్కువ లేదు.. పిల్లలకు ఆగాకరకాయలంటే ఇష్టం.
ఆ తాటిపెండెలలో దొరుకుతాయి .
24 గంటలు వీధి గుమ్మంలో ఆఅరుగు మీద
పడి అలా దొర్లకపోతే ,
కాలారా తిరిగి రావొచ్చు కదా అన్నాను.
అది తప్పేనా?
తీరిగ్గా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి తప్ప ,
ఒక్క మాట అనే హక్కుకూడా మాకు లేదు…
హక్కులేదు అనకూడని మాటలు అంటూ, అర్ధాంతరంగా వచ్చిన సిరితో, అదిరిపోతోంది విమల”..
“ధనం దర్పాన్ని తీసుకొస్తుంది అనుకున్నాను గానీ, ఇలా దయ జాలి లేకుండా, మనుషులను
మార్చివేసి , మానవత్వం లేకుండా మంచి చెడు విచక్షణ లేకుండా,మదమెక్కి తిరిగేలా చేస్తుందని, కలలో కూడా అనుకోలేదు అనుకున్నారు
ఈ సంభాషణ అంతా వింటున్న విమల మామగారు విశ్వనాధం..
నీరసముగా ఉన్నా, తప్పవని ఆనుకుని
కండువాదులిపి భుజానవేసుకుని ఆగాకరకాయలు తేడానికి, అన్నం రాజు వారి తోటవైపు బయలుదేరారు..
కర్ర ఊత పట్టుకుని నడుస్తున్నారు
విశ్వనాధం, ,కన్నీటి తెర లడ్డుకొని తోవకూడా కనబడడం లేదు..
“ఇంత బతుకు బతికి ఇంటివెనక చచ్చినట్లు, అయ్యింది తన పరిస్థితి”ఇంతలో ఎంత మార్పు?
మూడేళ్ల క్రితం వరకూ ,తను పేరుపడిన పెద్ద అకౌంటెంట్ .అకౌంట్స్ లో తన సాయంకావాలని, సలహాలు చెప్పమని, ట్యూషన్ చెప్పమని వచ్చిన వారి ని, ఇంట్లో పెట్టుకుని మరీబోధించేవాడు..
తనకు అంత పేరు ఉండేది అకౌంట్స్ లో.
తను సంపాదించినంతకాలం ,ఇల్లు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండేది.
తన భార్య గున్నమ్మకూడా లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండేది…
” పూచిన తంగేడులా” ఉండేది.
ఆ పుణ్యాత్మురాలు నిజంగా, తన వలనే నేడు *దీపపుసెమ్మె* లాగే. మిగిలింది..
తను ఇంటికి “దిష్టిబొమ్మలా” మారిపోయాడు
ఈ ఇంటి దీపం.. నా కంటి వెలుగు.. కాంతులీనుతూ ప్రకాశించి, వెలుగులు వేదజిమ్మే పున్నమి రాత్రి లా ఉండేది గున్నమ్మ .
మరి ఇప్పుడు ?
కాయలు పండ్లు కొమ్మలు రెమ్మలు అన్ని అందరికీ పంచి , శిశిరంలో ఆకు రాల్చిన చెట్టులా, ఎండిపోయిన మోడులా, మిగిలింది..
“ తన వల్లనే.. కేవలం తనవల్లనే అను కున్నాడు విశ్వనాథం”..
తను మాత్రం బాగున్నాడా? తన వాళ్లే సర్వస్వం అనుకొని,పిల్లలపై అంధప్రేమతో ధృతరాష్ట్ర
వ్యామోహంతో,సర్వం అర్పించి , చిగురు లేని మొడులా , శిధిలమైన గూడులా మిగిలాడు..
“దాయాదులు పరాయివాళ్ళు మోసం చేస్తారని, అన్యాయంచేస్తారని తనకుతెలుసు. గానీ!కడుపులో పుట్టిన పిల్లలే , కన్న వాళ్ళని ఇలామోసం చేస్తారని, అదీ నమ్మించి మోసం చేస్తారని,జీవితంలో తెల్సుకోలేకపోయాడు….”
అందరి లెక్కలు అంతా కచ్చితంగా వేసే
తను, తన లెక్కలో తప్పుటడుగు వేసాడు”..
పరాయి వాళ్ళ చేతుల్లో మోసపోయినా ఆ
బాధ , మర్చిపోగలం..
కానీ !తనవాళ్లే తనని మోసం చేసారు,
ఆ విషయం తలపుల్లోకి వచ్చినప్పుడల్లా,
గుండెలను దహించివేస్తూనే ఉంటుంది..
రిటైర్మెంట్ రోజు పిల్లలు చేసిన హడావిడి చూసి ,ఈ ప్రపంచంలో తన అంత
అదృష్టవంతుడు లేడని మురిసిపోయాడు.
.ఉద్యోగం చేసినంతకాలం ఎంతో వైభవంగా బతికాడు!
ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ పెన్షన్ ఉండదు.
అంత పెద్ద ఉద్యోగం చేసిన పి. ఎఫ్ వాడిచ్చిన 1500/ పింఛను.
రిటైర్మెంట్ వలన వచ్చిన,డబ్బుతో,
హాయిగా జీవితం గడిచిపోతుందనుకున్నాడు.
ఈ విశ్రాంతి సమయంలో , ధర్మబద్ధంగా ,ప్రశాంతంగా జీవించాలని,
పదిమందికి సాయపడాలని కలలుకన్నాడు.
బాధ్యతల వల్ల అప్పుడు ఎక్కడికి వెళ్ళ లేకపోయాడు.
ఇప్పుడు భార్యకోరికతో తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు..
పిల్ల పాపలతో చల్లగా సంతోషంగా గడపాలని అనుకున్నాడు ఎ.న్ని కలలుకన్నాడు?…
తన కలలన్నీ కల్లలయ్యాయి..
సంవత్సరం కాకుండా కోరికలన్నీ సజీవ సమాధి అయ్యాయి..
రిటైర్ అయిన మూడేళ్లకే తన భార్య ముసలి ముత్తయిదువుగా మారిపోయింది.
నవనాడులు క్రుంగిపోయిన తను కర్ర ఊతపట్టుకుని కాలక్షేపం చేస్తున్నాడు..
ఇదంతా!తన స్వయంకృత అపరాధం.
నాన్నా ! ప్రాణంమీదికివచ్చింది .అవసరానికి ఆఫీసుడబ్బు వాడాను,అరెస్టు చేస్తారేమో,? భయంగా ఉందిఅర్జంటుగా !
నువ్వు సర్దకుపోతే నన్ను ఆదుకునే వారు లేరు. బేంకు వాళ్లిచ్చిన వడ్డీ డబ్బులు, నేనే ఇస్తానని, పెద్దకొడుకు పాతికలక్షలుతీసుకున్నాడు..
వ్యాపారంలో నష్టమొచ్చింది .ఇరవై లక్షలు ఇస్తే,,
బేంకువాల్లకంటే ,వడ్డీ ఎక్కువ ఇస్తానని మిగతాది తీసుకున్నాడు చిన్న కొడుకు..
పిల్ల పెళ్లిచేయాలి నాన్నా! అని కూతురు అవసరానికి దాచుకున్న పదిలక్షలు తీసుకున్నాది .
.
భార్య పేరుని కొంత దాచాలన్న ఆలోచన కూడా తనకు రాలేదు..
ఆమె అంటూనే ఉంది.
బంగారము భాగ్యము ,ఏదో ఒకటి మన దగ్గర ఉండకపోతే, భవిష్యత్తు కష్టమవుతుంది ఆలోచించండి అని.
తనే మూర్ఖునిలా ఆమెమాట పెడచెవిని పెట్టాడు .
మన పిల్లలకు మనం చూడకపోతే అవసరాలు ఎవరో ఆదుకుంటారు అన్నాడు..
మాకు ఇవ్వడం అమ్మకి ఇష్టం లేదు .
ఈ తల్లి అయినా ఇలా మాట్లాడుతుందా?
అని పిల్లలు ఆమెను ఆడిపోసుకున్నారు.
తనవలన పిల్లల దగ్గర చెడ్డ అయింది..
తను ఆమెకు చెడ్డ పేరు మాత్రమే మిగిల్చాడు.
సంవత్సరము వరకూ ,వడ్డీ అప్పుడప్పుడు ఇచ్చి యిచ్చి, ఆపై మీ భారమంతా ,మాదే కదా ?
మీకు ఖర్చేమిటని? వడ్డీ కూడా ఇవ్వడం ఆపేసారు
అసలు ఆ సంగతి ఆలోచించలేదు కూడా..;
కోడళ్ళు,.మీకు పెద్ద కొడుకు, కోడలు అంటే ఇష్టమని చిన్నవాళ్లు
, . మీకు చిన్న కొడుకు, భార్య అంటే ఇష్టమని పెద్దవాళ్లు ,దెప్పడం మొదలుపెట్టారు.
వారి సాధింపులతో పాటు ,
తము శక్తి ఉన్నంతవరకూ చాకిరీ చేయాలని నిర్ణయించారు ,
,కూతురు అంతా కొడుకులకు ఇచ్చేసారు .
అవసరానికి మనమా అని అంటున్నారు ,మీఅల్లుడుఅంది ..
వైద్యకోసం వారింటికెల్తే .
ఇప్పుడు తమ పరిస్థితి అద్వాన్నం గా ఉంది అల్లోచిస్తూ నడుస్తున్న విశ్వనాధంగారు. ..ఒక కారు అత్యంత వేగంగా తన నా పక్కనుండే దూసుకుపోవడంతో ఆ కంగారులో తూలి తుప్పల్లో పడిపోయారు.. వెళ్లినంత వేగంగా వెనక్కి వచ్చిందా కారు..
డ్రైవర్ వచ్చి రోడ్డుమీదనడుస్తున్నప్పుడు చూసుకోనక్కర్లేదా ? నేనుతప్పించాను, కాబట్టిసరిపోయింది .
లేకపోతే నా కారు కిందపడిపోయి నన్ను జైలుపాలు చేసేవాడివి, అనివిసుకుంటూనేలేపాడు.
.ఇదంతా చూసిన కారులోఉన్న వ్యక్తి వచ్చి,విశ్వనాథంగారిని చూస్తూనే విస్తుపోయాడు..
క్షమించండి గురువుగారూ,. నేను మీప్రతాప్ ని . మీరేనా ?నేను మీ దగ్గరికేవస్తున్నాను.
నేనుఇప్పుడు హైదరాబాదులోచార్టర్ అకౌంటెంట్ గా స్థిరపడ్డాను..
మీ దగ్గర అకౌంటింగ్ నేర్చుకున్న నేను, పట్టుదలతో సి.ఎ..చేసి ఈ స్థితికి చేరాను…కాలేజీ పెట్టాను.
నాకూతురుపెళ్లికివచ్చిన మన సుదర్శన్ ,మీరు ఈ ఊర్లో ఉంటున్నారు రిటైర్ అయిపోయారు అని చెప్పాడు....వాళ్ల చెల్లెలు ఈ ఊరిలో ఉంటుందిట కదా! మీ పరిస్థితి మొత్తం అంతా చెప్పాడు..
రండి కార్లో కూర్చుని మాట్లాడుకుందాం అని,కార్ల కూర్చోబెట్టి,,తనే ఫస్ట్ ఎయిడ్ చేసి, సేద తీర్చాక,
మంచినీళ్లు ,బిస్కెట్లుఇచ్చి ,,డ్రింక్ ఇచ్చి సేద తీశాడు .
.మేమిద్దరం ఈ చెట్టు కూర్చుని మాట్లాడుకుంటాం..నువ్వు అక్కడ ఎవరిరైనా అడిగి ,వారితో పాటు వెళ్ళు .వాళ్ళింట్లో మాస్టర్ ఇలా పడిపోయారనిదెబ్బలు తగిలాయని చెప్పు..నువ్వు డ్రైవర్ అని చెప్పకు.. కారు దూరంగా ఆపి అమ్మగారిని కార్ల తీసుకురా అన్నాడు ప్రతాప్..
అలాగే సార్ అని వెళ్లాడు ఆ యువకుడు…వద్దు నాయనా! తను చాలా కంగారు పడుతుంది..
నా మాట విను నేను వెళ్ళిపోతాను ఇంటికి అన్న మాస్టారుతో..మాస్టారు. మిమ్మల్ని అమ్మగారిని తీసుకెళ్ళి
నాతో పాటు ఉంచుకుందామని నేను వచ్చాను.ఇది నేను మీకు ఉపకారం చేస్తున్నట్టు కాదు నా పరిస్థితులు బట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. భగవంతుని దయవల్ల మీరుపడిపోవడంకూడా మేలేజరిగింది.
మీ వాళ్ళు ఎవరైనా వస్తే, కొన్నాళ్ళు వైద్యం చేయించి పంపుతాననిచెప్తాను..
నా భార్య తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్ లో పోవడంతో నా భార్య మంచం పట్టింది బెంగతో..
డాక్టర్లు తనను ప్రేమగా చూసుకునే పెద్దవాళ్ళుఉంటే కోలుకుంటుంది అన్నారు. మా అమ్మ కూడా ఆరు నెలల క్రితం చనిపోయింది.. నా శ్రేయస్సు కోరేవారు నాకు మీరు అమ్మగారు తప్ప ఎవరూ లేరు. అందుకే అభ్యర్థించడానికి వచ్చాను అన్నాడు చేతులు పట్టుకుని.. భగవంతుడే ప్రతాపను పంపాడేమో అనుకుని తండ్రిని లీలలు అనుకున్నాడు విశ్వం . నా పిల్లలు కూడా చిన్నవాళ్లు. మీరు నాకు సలహాదారుగా కూడా ఉండొచ్చు.
నా ఇంటి పక్కనే ఒక చిన్న ఇల్లు పెద్ద వాళ్ల కోసం కట్టించాను. అందులో మీరు హాయిగా ఉండొచ్చు నా మాట కాదంటే నాపై ఒట్టేఅని ప్రతాప్ పట్టుపట్టాడు. అన్ని ఆలోచించే సరేనన్నారువిశ్వంగారు.
……………………………………….
వీధిలో మంచం పై ఒడియాలు ఎండపెడుతున్న గున్నమ్మ , పక్కింటి పంతులుగారి అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తయ్యా , మామయ్యగారు పొలం దగ్గర కారు గుద్దితే పడిపోయారట.మిమ్మల్ని తీసుకురమ్మని అదిగో కారు పంపారు అర్జెంటుగా రండి అని చెప్పాడు..
అయ్యో, భగవంతుడా! ఏమైందని ,?నీరసంగా ఉన్నారు వెళ్ళొద్దనే అంటున్నాను .పౌరుషం పడివెళ్లారు.
ఏం జరిగిందయ్యా ? అని ఏడుస్తూ,నెత్తి కొట్టుకుంటున్నారు గున్నమ్మ.,
సీరియస్ గా సీరియల్ చూసుకుంటున్న కోడలు విమల వచ్చి., మీరు ఎక్కువ మాట్లాడకండి.. ఈ సోదంతా చెప్పకండి?.. యాక్సిడెంట్ అంటున్నారు. పోలీసులు కేసులు. నాకు అసలే ఒంట్లో బాగాలేదు.
నాలుగు అడుగులు కూడా వేయలేను.. మీ కొడుకు ఊర్లో లేడు.నా కొడుకుచిన్నవాడు. పోలీసులు చూస్తే బాడీభవిష్యత్తు పాడైపోతుంది.. ఆ కార్లో మీరెల్లి ,ఆ డ్రైవర్ ఇదే తప్పని, నెత్తి నోరుమొత్తుకుఅక్కడ ఏడవండి.
బాగా డబ్బులగుంజండి..ఆసుపత్రి ఖర్చు వారినే భరించమనండి.. మీకొడుకులకు ఫోన్లు చేయకండి…
నేను మీ చిన్న కొడుక్కి కోడలికి ఫోన్ కూడా చేస్తాను..మీ అబ్బాయి వచ్చాక, మీరు ఫోను ఎక్కడున్నారో నాకు చెప్తే వస్తాము. .మీ ఆయనకు ఎలా ఉన్నా మీరు ఇక్కడికే రావాలి . జాగ్రత్తా! నేను పంపినట్లు ఎవరితోనైనా
చెప్పవద్దు.అని దుర్మార్గంగా హెచ్చరించింది..కనీసం గదిలోంచి బయటకు కూడా రాకుండా.విమల….
ఏమీ చేయలేని,అసక్తతతో, అసహ్యంగాకోడల్ని చూసి, ఆయనకేమీ కాదమ్మా!నువ్వు భయపడకు..
బాగున్నా లేకపోయినా మేము తిరిగి ఇక్కడికి రాము. ఇకపై మీకు ఎవరికీ భారం కాదల్చుకోలేదు..
భగవంతుని నమ్ముకుని, మా బతుకేదో మేము ఎలాగోలా బతికేస్తాం. . నీ పేరు చెప్పను.
సరి కదా! మీరందరూ ఉన్నారన్న విషయంకూడా మరిచిపోతాము. సరేనా !అని ఏడుస్తూ ,
వెళ్లి ,కారులో కూర్చుంది గున్నమ్మ.చాగా నిల్చనిఅంతా విన్న డ్రైవర్ ఆశ్చర్యపోయాడు..స్త్రీలలో
ఇంతటి దుర్మార్గులు ఉంటారా? అనుకున్నాడు.సార్ గారికి ఏమీ కాలేదమ్మా మీరు ఏడవకండి. సారీ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు డ్రైవర్. మాస్టర్ ని చూసి బోరున ఏడుస్తున్న గున్నమ్మ గారి పరిస్థితి తను చూసింది
ప్రతాపకు జరిగిందంతా”పూసగుచ్చినట్లు “చెప్పాడుడ్రైవర్..
వెక్కివెక్కి ఏడుస్తున్న గున్నమ్మ గారితో, అమ్మా! ఏడవకండి మాస్టారికి ఏమీ కాలేదు. మీ పరిస్థితి అంతా తెలిసి , మిమ్మల్ని అలా తీసుకురమ్మని నేనే చెప్పాను క్షమించండి.. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్ళిపోతున్నాం.
మీకు గుర్తుందా లేదో? గానీ!నాకు బాగా గుర్తుంది.. మీ చేత్తో పెట్టిన అన్నం తిని, మీ వరండాలో నిద్రపోయి,
బీకాం మూడు సంవత్సరాలు మాస్టారు చేత అకౌంట్స్ చెప్పించుకుని, ఈరోజు ఎంత ఉన్నత స్థితిలో నిలబడ్డాను... నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ చనిపోయి ఆరు నెలలు అయింది.
మా అమ్మ స్థానంలో మిమ్మల్ని చూసుకుంటాను. తల్లి తండ్రిని కోల్పోయిన నాభార్య కూడా తల్లిగామారి
.నా ఇంటి జ్యోతిని నిలబెట్టండి. అందుకుమీ సాయం కావాలి. .నా మాట కాదనవద్దు..
నేను ఏదో మిమ్మల్ని ఉద్ధరించడానికి తీసుకెళ్తున్నానని నేను భావించడం లేదు.. మీరు తప్ప నా ఆదుకునేది ఎవరు లేదని ఉద్దేశంతో మిమ్మల్ని వెతుక్కుని వచ్చి తీసుకెళ్తున్నాను. ఇప్పటికీ మీరు సాయం చేసే స్థితిలో ఉన్నారు నేను అభ్యర్థించే స్థితిలోనే ఉన్నాను. అన్నాడు అనుకోవుగా ప్రతాప్
కారు కదిలిపోయింది.. ఊరి పొలిమేరలతో పాటు తమ కష్టాలు కూడా కనుమరుగైపోయాయి అనుకున్నారు విశ్వం దంపతులు…..
ఇప్పుడు ఆ “దీపపు సెమ్మె” తళతళలాడుతూ , ప్రతాప్ ఇంట జ్యోతి వెలిగించడానికి,
ఆ “దిష్టిబొమ్మ” దిశా నిర్దేశం చేసే, మార్గదర్శి అవ్వడానికి నిశ్చయించుకున్నాయి…. సమాప్తం…….
నమస్కారములు..
దామరాజు విశాలాక్షి అనే నేను పంపించుచున్న
“ దిష్టిబొమ్మ_ దీపపు సెమ్మె” అనే ఈ కథ ఎవరిని అనుసరించి గాని అనుకరించి గాని రాయలేదని. కేవలము నా ఊహాజనితమని,ఎచ్చట ప్రచురింపబడలేదు,ప్రసారం కాలేదని, కేవలము మీరు నిర్వహించుచున్న పోటీ కొరకు రాశానని, విన్నవించుకుంటున్నాను
ఇట్లు విధేయురాలు,దామరాజు విశాలాక్షి. విశ్రాంత ఉపాధ్యాయిని. చరవాణి: 9 0 1 0 9 0 2 7 9 4
మెయిల్ ఐడి.damaraju.visalakshi@gmail.com .
No comments:
Post a Comment