తాడు తెగింది...
“ మాసిన చిరుగులచీర, జాకెట్టు, పిచ్చిపిచ్చిగా ముందుకు వెనక్కు ఎగురుతున్న జుట్టు, ఒంటినిండా గాయాలు,
మనిషి గుర్తుపట్టలేనంతగా కాటుక ,మసి పూసుకుని.ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టుకళ్ళతో ఒకామె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు
రోడ్డుప్రక్కనున్న మర్రిచెట్టు కిందకూర్చుని ఏడుస్తూఉంది. .
పోలీసు స్టేన్ వైపు చూస్తూ బొట్టు చెరుపుకుంది..చేతి గాజులు పగల కొట్టుకుంటోంది...మెడలో తాడు తెంపేసుకుని విసిరేసింది.
.చేతిలో గుడ్డసంఛి గుడ్డతో చుట్టినపెద్ద దిష్టిబొమ్మ, కర్ర ఉన్నాయి,,
ఆ కర్రతో ఆ బొమ్మను కొడుతూ నన్నిలాగే కొట్టావు కదరా !
“ చావరా చావు చచ్చినోడా.!నన్ను చావగొట్టావుకదా ?చూడు నేను కూడా నిన్ను ఎలా కొడుతున్నానో!
చూడు అని ,ఆ బొమ్మని కొడుతూ,చేతులు కాళ్ళు వెనక్కి విరిచేస్తూ , పకపకా నవ్వుతూ, మళ్లీ అంతలోనే తల బాదుకుని ఏడుస్తూ,
నాకిలా కావాల్సిందే! నా వాళ్ళని వదిలి మోసం చేసి నీతో వచ్చేసాను కదా! అందుకు నాకు
ఇలా జరగాల్సిందేఅని ఏడుస్తూ,,తనలో తనే ఏదో గొణుక్కుంటూ, శూన్యంలోకి చూస్తూ, కోపంగా అరుస్తూన్నది.
చూడగానే పాపం ఎన్ని బాధలు పడిందో? ఎవడు మోసం చేసాడో?! పాపం పిచ్చిది అయిపోయింది
అని , ఆ తోవన పోయేవాళ్ళు జాలి పడుతూ , తినడానికి ఎవరైనా ఏదైనా పెడితే ,
అక్కడ తిరుగుతున్న కుక్కలను రండమ్మా రండి,కడుపునిండా తినండి. .హాయిగా తిరగండి.
మీకేనయం విశ్వాసం ఉంది. అంటుంది..ప్రేమగా దగ్గరకు తీసుకుని ఒళ్ళు నిమురుతుమంది .
పాపం పిచ్చిదనిత్రోవనపోయే జనాలు జాలిపడుతున్నారు..
.కాని స్టేబుల్ వచ్చి ,ఎవరమ్మానువ్వు ?నీపేరేంటి ? అంటే , గాల్లోఖీ చేతులుజోడీంచి దండంపెట్టింది.
నీపేరేంటి అంటే ? నిప్పు .నిప్పు కాలుస్తుంది అంది..అతడు విసుగ్గా....పోమ్మ ,పో !ఇక్కడ కూర్చోకూడదు.
ఇది పోలీస్ స్టేషన్.. ఇక్కడ కూర్చోకూడదు అని అదిలించాడు.. తనకేమీ పట్టనట్టు ఒక వీధి కుక్కను దగ్గరగా తీసుకొని,ఇదే మన ఇల్లు ఇక్కడ ఉందామా?
నాకు తోడు ఉంటావా తమ్ముడు..ఇడుగో వీడు పొమ్మన్నాడు .
అని భోరున ఏడుస్తూ,,ఆ కుక్క వెళ్ళిపోతే అయ్యో !నన్ను వదిలి పోతున్నావా ?అని శోకాలు పెడుతుంది..
ఏయ్ ! ఇక్కడనుండి పోతావా ,పోవా ?అని అరిస్తే,, మాఅమ్మతో చెప్తానుండని గట్టిగా ఏడూస్తోంది … “ త్రోవనపోతున్న వారు, లోఫలికి వస్తున్న మీడీయావారు అడిగారు ..
.ఏమి పోలీసువయ్యా!?ఇలాటీవారికి ఏదో ఆశ్రయం చూపి ,రక్షించేది పోయి, పాపమ్ ఆపిచ్చిదాన్ని పొమ్మంటావేం?
నిరాశ్రయులుమీద నీ ప్రతాపమా అని నిలదీసాడు”..
:”నాకు చచ్చే చావువచ్చింది.. ఈరోజు కమిషనర్ గారు,, ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు..
మా ఎస్ఐ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారట:.. అసలే మా ఎస్ఐ ఇవాళ స్టేషన్ కిచుట్టుపక్కల ఎవరూ రాకుండా కాపలాకాయు అన్నారు.ఎస్సై
.ఽతడీకసలే అనుమానం..ఈ పిచ్చిది చూస్తే ఎక్కడి నుండి కదలడం లేదు’.
.పబ్లిక్ మీడియా ఇలాటి సలహాలిస్తున్నారు అనిమనసఉలో అనుకుని.. ..వాళ్ళముదరే..
హేయ్ ,అమ్మా! ఇక్కడ కూర్చో.. సిఐ గారు వచ్చి వెళ్ళిపోయాక నేను నిన్ను హోమ్ లో చేరుస్తాను అన్నాడు జాలిగా.
తనకు ఏమీ పట్టనట్లు తల గోక్కుంటూ ఎటో చూస్తూ కొనుక్కుంటుంది ఆమె.
కమీషనర్ వచ్చారు. ఇన్స్పెక్షన్ ఎంక్వయిరీలు అయ్యాయి..
“ఆ అమ్మాయిల మిస్సింగ్ కేసు విషయంలో నీ హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి .,
ఇది నిజం కాదని నాలుగు రోజుల్లో రుజువు చేసుకోకపోతే, నిన్ను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి,
విసురుగా బయటకు వచ్చాడు చంద్రగుప్త..
ఎస్సై ఏకాంబరం ఏదో చెప్పబోతూ, అది కాదు సార్ అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు .
నాకు ఏ పాపం తెలియదు అన్నాడు.అలాగా !అదే నిరూపించుకో ,అని విసురుగా బయటకు వచ్చారు
అతను.. కారు ఎక్కబోతున్న కమీషనర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలు పట్టుకుందాపిచ్చిది,,
ఎవర్రా ! దీన్ని లోపలకిరానిచ్చారు ?బయటకు తరమండీ.అన్నాడు ఎస్.ఐ ఏ ఏకాంబరం ఆందోళనగా…
.ఆమె ను చూస్తే అతడీకేదో అనుమానమ్ వచ్చింది .పోలీసులు అదిలిస్తున్నా.
ముందుకు పరిగెత్తి కమీషనర్ గారి కారుదగ్గరకు పరిగెత్తుకొచ్చిన ఆ పిచ్చిదాన్ని చూసి
ఎస్సై ఏకాంబరం ఏదో అనుమానం బలపడీ, బలవంతంగా లాగుతున్నా,,ఏడుస్తూ ,
పాత గుడ్డ మూట కమిషనర్ గారికి ఇచ్చి ,మా బాబే ,మా నాయనే,ఇవి నీకోసమే దాచాను.ఎవరికీ ఎవరికి ఇవ్వకేం!..
దొంగలు పట్టుకొని పోకుండా చూసుకో. ఈ డబ్బంతా నీకోసమే దాచాను..దాచుకో నీకే అని చెప్పి ,
ఏకాంబరం ని చూపించి,అమ్మో !నన్ను చంపిస్తాడని చూసి భయపడుతూ ,కమీషనర్ గారి వెనకాతల దాక్కుంది
ఆ పిచ్చిది..
ఆమె జబ్బ పట్టుకుని బలవంతంగా లాగుతున్న ఏకాంబరం పై విరుచుకుపడ్డారు కమిషనర్ గారు. …
ఆపవయ్యా !ఆపునీ జులుమ్..నీ ప్రతాపమంతా పిచ్చి వాళ్ళ మీద, పేద వాళ్ళ మీద,బలహీనుల మీద నా?
పనిలో చూపెట్టు.. నీ మీద ఎన్ని కంప్లైంట్లు వచ్చినా,మారతావని టైం ఇచ్చి చూశాను,, నిన్న ఆ జర్నలిస్టు కేసులో మీడియా కోడై కూస్తోంది.
అమ్మాయిలు మిస్సింగు కేసులో నిన్ను నువ్వు, నిరూపించుకోకపోతే, తర్వాత నేను ఏమి చేయలేను అన్నారు. ఎస్ సర్ .
ఽఅగుడ్డామూటా కమ్పు కొడూతోంది. ఇలా ఇవ్వండీసర్ .బయిటా విసిరేస్తాను
అన్న ఏకాంబరాన్ని ఎగాదిగా చూసి ఇమ్తకన్నా కంపు కొడూతున్న వ్యవస్టను బాగుచెయ్యడానికి
ఈరంగంలో దిగిన వాడీని ఈ పిచ్చితల్లి గుడ్డలమూట కంపు లెక్కేమిటి?..నీవు నీసంగతి చూసుకోనేను ఈ పిచ్చితల్లిగురించి చూసుకుంటాను అని ,
నాతొ రా ,అమ్మా !నీకు భయం లేదు అని ,అందరూ ఆశ్చర్య పోతుంటే,కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు,కమిషనర్ చంద్రగుప్త గారు.
********************************************************88
“ఆయన ఈ పట్టణానికి వచ్చి ఆరు నెలలు అయినా, చిన్న కుర్రాడే అయినా!.
నిజాయితీగల మంచి మనసుగల ఐ .పి.ఎస్. పోలీస్ ఆఫీసర్. మానవత్వం గల వ్యక్తిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.
గొప్ప ధైర్యసాహసాలు గల ఐపీఎస్ ఆఫీసర్. ఎవర్ని ఎక్కడ ఉంచాలో, అక్కడ ఉంచుతారు . ఏకాంబరం గురించి ఎన్నో కంప్లైంట్లు వెళ్ళినా,
సమయంకోసమ్ చూసి ఈరోజు నిర్ధారించుకున్నా.రు..
“ఈరోజు ఉదయాన్నే జాగింగ్ చేసుకుంటున్న,అతని దగ్గరకు, ఏకాంబరం బార్ నుండి తప్పించుకుని పరిగెత్తి
వచ్చిన ఓ యువతి చెప్పిన సమాచారం విని .కోపంతో ఊగిపోయారు. ఆ అమ్మాయి చెప్పింది శ్రద్ధగా విన్నారు.
ఆడవాళ్ళని ,పిల్లలను దుబాయి పంపే ముఠాలతో పెద్ద సంబంధం ఉందని ముందే ఏకాంబరం మీద ఎంక్వయిరీ కి వస్తున్నట్లు నిన్ననే సమాచారంపంపారు.అతనిపై నిఘా పెట్టారు కమీషనర్ గారు
—------------------------------------------------------------------------------------------
కమిషనర్ గారికారు ఆటు వెళ్లగానే పరుగు పరుగున ఇంటికి వెల్లాడు ఏకామంబరం..
వీధితలుపుకువేసిన తాళం వేసినట్లు ఉండడంతో హాయిగా ఊపిరి పీల్చుకుని, తాళం తీసుకుని లోపలికి వెళ్లి ఇల్లంతా వెతికిన ఎస్ఐ ఏకాంబరం తలపట్టుకు కూర్చుండి పోయాడు..
ఇల్లంతా వెతికినా తన భార్య దుర్గ కనబడలేదు. పెరటి వైపు ఎప్పుడూ వాడనిస్టోర్ రూమ్ పడిపోతున్న కిటికీ తొలగించి బయటపడి పారిపోయింది.
ఎంత పని చేసింది?. అంత ధైర్యం ఎలా వచ్చింది?ఆ జర్నలిస్టు పిల్ల ఏదో నూరిపోసి ఉంటుంది.. పళ్ళు పటపట కొరికాడు ఏకాంబరం..
పరార్ అయిపోదామని బేగ్ సర్దుకొని బయటకు వచ్చిన ఏకాంబరం, ఎదురుగా పోలీస్ బందోబస్తు తో తనను కస్టడీలోకి తీసుకున్న సీఐ చిన్నారావుతో
,కమిషనర్ గారు నన్ను రుజువు చేసుకోమన్నారు కదా?
అందుకోసమే వెళుతున్నాను.. ఆధారాలేవి ? అరిచాడు ఏకాంబరం..
ఇవిగో, ఆధారాలు ..ఇవిగో నీటెర్మినేషన్ ఆర్డర్. ఇవి గానీ బేడీలు అంటూ వరుస మీద అన్నీ చూపెట్టాడు చిన్నారావు.
ఆ ఫోటోలు చూసిన ఏకాంబరం బుర్ర గిర్రున తిరిగి భూమిలోకి వెళ్ళిపోయింది.
పబ్బులో, క్లబ్బులో, తన శృంగార లీలలు.. తనపై తన అరాచకాలపై దుమ్మెత్తి పోస్తున్న ఆడావాళ్ళు,
తన చేతిలో దెబ్బతిన్న మహిళల వీడియోలు .. ఇవన్నీ ఎలా ఎలా వచ్చాయి?
ఇదంతా ఫేక్ .గొణుగుతున్నట్టగా అన్నాడు ఏకాంబరం..
అవునా? పాపం . నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాల్సిన అవసరం ఉందని,
నీ చేత ఈ చండాలం పనులన్నీ చేయించిన నీ రాజకీయ రక్షకులే చెప్పారట.
నీతో వాళ్ళకేం సంబంధాలు లేవని అన్నారట.. విను, అని అది కూడా వినిపించాడు సీ.ఐ ..
చేసేదిలేక చేతులతో మొహం కప్పుకుని జీపు ఎక్కాడు ఏకాంబరం…
—-----------------------------------------------------------------------
‘తనతో కారెక్కిన పిచ్చిదాన్ని అడిగారు కమిషనర్ చంద్ర గుప్త గారు.నువ్వెవరో నాకు తెలుసమ్మా!
” అమ్మా! మా ఇంటికి వస్తావా? మా అమ్మ చాలా పెద్దది. మా అమ్మకి సేవ చేస్తూ మా ఇంట్లో ఉండి పోతావా ?
నీకు ఏ భయం లేకుండా నేను చూస్తాను.అనునయంగా అన్నారు.
అలాగే అన్నట్లు తల ఊపి. వెంట తెచ్చుకున్న భయం పోయి,ఆశ్చర్యమ్ ఆనందంతో ఒకేసారి వెక్కిళ్ల రూపంలో దుఃఖం బయటకు వచ్చింది.
ఆమెనలాగే ఏడవ నిచ్చి తనైంటికి తీసుకుపోయారు చంద్ర గుప్త గారు.
ఇంట్లో కి వెళ్ళాక. నువ్వెవరో నాకు తెలుసు. ఆ పోలీస్ స్టేషన్ ముందు నువ్వు ఉంటావని కూడా తెలుసు.
.ఆ అమ్మాయి అంతా చెప్పింది.నీకు నా ఇంట్లో ఎలాంటి ఆపదా రాదు. నా అక్క చెల్లెలుగా 80 ఏళ్ల మా అమ్మకు సేవలుచేస్తూ ఇక్కడే ఉండి పో.
అమ్మ ఆరోగ్యంగానే ఉంది తిరుగుతుంది లే. ఆమెకు సహాయం గా ఉంటే చాలు.నా భార్య కూడా పోలేసు ఆఫీసరే.....
ఆ దుర్మార్గుడు నిన్ను ఏమీ చెయ్యలేడు.జీవితం లో ఇక బయటకు రాడు.
అదుగో! అమ్మ హాల్ పక్కన అమ్మ గది .ఆపక్కన నీ గది.. ఆ గదిలో ఉంటూ రేపటినుండి అమ్మనుచూసుకుందువు.
ఈ రోజు స్నానం చేసివిశ్రాంతి తీసుకో.. మీ గదిలోకి భోజనం పంపించుతాను .తిని నిద్రపో అమ్మా! నాకు చాలా పని ఉంది అని అన్నారు చంద్ర గుప్త గారు.
కన్నీటితో ఆయన పాదాలపై పడి. కృతజ్ఞతలు చెప్పుకొన్నది ఆమె..
లే లే! నీ తమ్ముడు లాంటి వాడిని అని చెప్పాను కదా! ఆ నరకాసురుడు జైలు పాలవుతాడు.
ఇక నీ జీవితంలో నిత్యం దీపావళిపండగే. నీకు జరగవలసిన న్యాయం జరిగేలా నేను చూస్తాను అని వెళ్లిపోయారు.
.....................................................................................................................
‘పని అమ్మాయి వచ్చి ఆ గది చూపెట్టి, మీరు స్నానం చేయండి. నేను టీ తెస్తాను అని వెళ్ళిపోయింది.’
స్నానం చేసి వచ్చినతర్వాత ఆమెను చూసి విస్తుపోయిందిఅమ్మాయి..
వంటినిండా గాయాలున్నా,”కడిగిన ముత్యంలా ,బక్క చిక్కిన బంగారు బొమ్మలా ఉంది.”
ఇందాక చూసిన ఆ పిచ్చి రూపుకు,స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ రూపానికి పోలికే లేదు..
మిమ్మల్ని నేను ప్రశ్నలు వేయకూడదని సార్ చెప్పారు. మీరేనా? ఎలా నటించారు? ఎలా మారిపోయారమ్మా?వావ్.. .
అమ్మో! సార్ తో ఇలా అన్నాననవద్దు. ఆశ్చర్య పోయి అన్నాను అంతే! అని ,
ఆ అమ్మాయకొబ్బరి నూనె, గాయాలకు ఆయింట్మెంట్ తెచ్చి ఇక్కడ పెట్టాను. నేను మందురాయనా?అంది..
వద్దులేమ్మా! నాకు ఎప్పుడూ వేషాలు వేయడం తెలియదు. కానీ తప్పనిసరై ఈరోజు మా ఇంటి పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లో గ్రీజు ఇంట్లో కాటుక .నల్ల రంగు. అన్ని కలిపి పూసుకున్నాను.అందువల్లనే ప్రాణాలతో మిగిలాను అంది ఆమె
. పోనీలే!ఇక నీకు నటించాల్సిన అవసరంరాదు ...నన్ను కూడా ఒక నరకం నుండి తప్పించి, నాకెంత మంచి బతుకు కల్పించిన మహానుభావుడు ఇతను. ఈ బాబు చల్లని నీడలో ప్రశాంతంగా బతుకుతున్నాను.
నీవు కూడా ఏ చింతలూ పెట్టుకోకుండా జరిగింది పీడకల మరచిపోయి అమ్మ గారి సేవలు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకు. మనం బయటికి వెళ్ళినా భద్రత ఉండదు.మన బతుకులకు వేరే దేవుడు లేడు... ఈ కమిషనర్ బాబే అని నమస్కరించి వెళ్ళిపోయి,,భోజనం తెచ్చిపెట్టింది ఆఅమ్మాయి ..
ఆ అమ్మాయి వెళ్ళిపోయాక చాలా కాలం తర్వాత కడూపునిండా తిని ,తలుపులేసుకుని పడుకున్న ఆమె సినిమా రీలులా గతమ్ కళ్ళ ముందు కదులుతూ ఉంటే, ఆ భయానక దృశ్యాన్ని తలుచుకుంటేనే భయపడిపోయింది..
అయినా మనసు మాటవినదు ,గతాన్ని మరువనివ్వదుకదా !
---------------------------------------------
ఒళ్ళు తెలియకుండా అర్ధరాత్రి దాటే వరకూ తాగి, మంచానికి అడ్డదిడ్డంగా పడుకొని తెల్లవారకముదే లేచిన ఆ దుర్మార్గుడు, లేస్తూనే తాళం వేసిన గదిలోకి వెళ్లి ,బయటకు వచ్చి ,పడుకున్న తనను పొట్టలోతన్ని ,
తోకతొక్కిన త్రాచులా బుస్సుమన్నాడు . ఎంత ధైర్యం నీకు? దాన్ని వదిలేసావా? అందువల్ల నా ఉద్యోగం పోతుంది అని తెలుసు కదా? అయినా తాళం తీసి వదిలేసావా? మాటాడావేమే,,ముంగీ ? ఈరోజు వాకమిషనరు వస్తున్నాడు నా పాలిటనా మీద ఎంక్వయిరీ కి.. ఆ పిల్లవాడిని కలిస్తే బతుకు బద్దలై పోతుంది. అసలు నువ్వు నాపెళ్ళానివేనా? నా శత్రువువా?అని కోపంతో ఊగిపోతూ బెల్ట్ తీసి“కొట్టినంతసేపు కొట్టి, తన్నినంతసేపు తన్ని, ,కర్రతో పశువు ని బాదినట్టు బాది, ఉబ్బిన కళ్ళతో ఉరిమి చూస్తూ, పొడుచుకొచ్చిన పొట్ట, క్రింద పడిన కర్ర తీయడానికి కూడా ఒళ్ళు వంగనీయనంతగా అడ్డోస్తుంటే ,ఆయాస పడుతూ,,,అడ్డమైన కూతలూకూస్తూ,ఈ జర్నలిస్టు..ఆ పిల్ల దొరక్కపోతే ఈ రోజు నా చేతుల్లో నీకు చావు తప్పదు. దొంగ ముండా !నా జేబులో పడవలసిన 50 వేల రూపాయలు, నీవలనే అందకుండా పోయాయి.. ఆరోజు పసిపిల్లలను తప్పించేశావు.నాకుతెలుసు నువ్వే ఈరోజు ఈ పిల్లను తప్పించావు.వేసిన తాళం వేసినట్లు ఉంచి ఆపిల్లను ఎల్ఎలాతప్పించావు ? ఆ బక్కపిల్ల కిటికీ ప్రేము తీసే గలదా? మెకానిక్ షాప్ కాడ ఎవడినో పిలిచిఆ చువ్వలు వంచీమని ఉంటావు...ఆడెవడో తెలుసుకూంటాను ..తర్వాత నిన్నుచంపి సమాధి చేస్తాను..
పాతికతులాల బంగారం తో వచ్చిన, నా పెౡ పెళ్ళానే పాతిపెట్టిన వాడిని... .ప్రేమ పేరుతో పాతిక వేలుతో వచ్చిన నిన్ను చంపడం నాకు ఒక లెక్కా.. నువ్వుచస్తే నాదే బాధ్యతని మీ అయ్య మున్దే కేసు పెట్టాదు గాబట్తటి ఆలోచిస్తన్నాను .ఇవాళ తీసుకెఌ ఏతట్లో ఇసిరేస్తాను .మదనష్టపుధాన నీ మొఖం చూడాలి అంటే నే అసహ్యం .
అని బూటు కాళ్లతో బలంగా తన్ని, అసలు ఈ రోజు అకస్మాత్తుగా ” కమిషనర్ .వస్తున్నాడన్న హడావిడిలో ఉన్నాను”. లేకపోతే నీ ప్రాణమైన తీసి ఆ పిల్లని ఎక్కడికి పంపావో ,నీ చేత చెప్పించే వాడిని .
ఏమయింది ,ఆపిల్ల .?..నావి నా స్నేహితుడువి గుట్టు మట్లన్నీ ,వీడియో తీసింది ..అందుకే వెంబడించి పట్టుకుని మత్తు మందు చూపెట్టి తెచ్చాను.దాని మత్తు దిగిన తర్వాత దాన్ని ఏం చేయాలో చేద్దాం అనుకున్నాను.
ఈ లోపం నాకు మొద్దు నిద్ర పట్టేసింది. ఆ పిల్లని నువ్వు తప్పించేసావు. ఆధారాలన్నిదాని దగ్గర ఉన్నాయి.
“ కల్లు తాగిన కోతిలా చిందులు వేస్తున్నాడు ఎస్ .ఐ. ఏకాంబరం.
అన్ని దెబ్బలు తింటూ,భయంకరమైన ఆ బాధను భరిస్తూ ఆ అమ్మాయి కిటికీ కర్టెన్ వెనకాతల అమర్చిన వీడియో కెమెరా గురించి, తన చేతికి ఇచ్చిన వీడియో గురించి, సెల్ ఫోన్ గురించి పెదవి విప్పి చెప్పలేదు . అంత బాధను పళ్ల బిగువున ఓర్చుకుంటూ నాకేమీ తెలియదని ఏడుస్తూనే ఉంది...
కమీషనర్ విజిట్ అయిపోగానే వచ్చి నీపని పడతాను ముందు ఆపిల్ల ఆచూకీ తెలుసుకోవాలని అని విసురుగా వీధి తలుపు తాళం వేసుకునివెళ్ళిపోయాడు ఎస్ ఐ. ఏకాంబరం”…
“ఏడ్చి ఏడ్చి అలా ఎంత సేపు ఉండి పోయిందో తనకే తెలియదు. శక్తినంతా కూడదీసుకుని లేచింది..
“. నువ్వు కాదురా! ఈరోజు నీ అంతం నేను తేలుస్తాను. ఇన్నాళ్ళగా పరువు మర్యాదలకు పాకులాడేను.
నా పండంటి బతుకు నీ పాపిష్టి చేతిలో పెట్టాను”. నమ్మినందుకు నా గొంతుకోయడమే కాదుఎందరి ఆడ పిల్లల ఉసురు పోసుకుంటున్నవో?నీ బతుకు చెడ,. ఆ వుద్యోగం కాస్త ఉడిపోతే.. కుక్కలు కూడా నిన్ను చూడవు .”
నీ డబ్బులకు ఆకర్షింపబడి,నీ పోలీస్ ఉద్యోగానికి భయపడి, నీ కామాగ్ని చల్లార్చు తున్న ఆడవాళ్లు,
చీపుర్లతో కొట్టి ,చేటలు నీ మెడలో వేసి ఊరేగించే రోజు రాకపోతే నేను నేను బెజవాడ దుర్గనే కాదు”..
ప్రేమ పేరుతో నమ్మించి ,నావారందరికీ దూరం చేసావు ..మూడేళ్ళకే మోజు తీరిపోయి ,కాల్చకు తినడం మొదలు పెట్టావు . పిల్లలు ల్eకుండాఆ ఆపరేషన్ చేయించావు ...కట్టుకున్న పెళ్ళాన్ని, నా ముందే కులటలతో కులుకుతూ నాచేత చాకిరేచేయించు కోని, తాగి తందనాలు ఆడుతూ, పెళ్లయి పదేళ్లు దాటిన నా పుట్టింటినుండి తెచ్చిన డబ్బులింకా చాలవని చావగొడతావు ...కాపలాకాయు కావలసిన నువ్వే, కాలం మీద ఉన్న పిల్లలను కాని పనులు చేస్తున్నట్లు కేసులు పెట్టికాసులకు అమ్ముకుంటున్నావు. కొందరిని నీకామానికి బలి చేస్తున్నావు..
పసిపిల్లలు నీపాలబడితే తెలివిగా తప్పించాను.
నిన్న ఆ జర్నలిస్టు. నీ మీదా, , నీలాగే అడ్డగోలుగా సంపాదించి అడ్డమైన వ్యసనాలకు లోనై న దుర్మార్గులైన నీ స్నేహితులమీద , కలిసి అరాచకాలు చేస్తున్నావని వీదియోలు తీసిందని, ఏదో పేపర్ లో రాసి, చానల్లో ప్రసారం చేసిందని పగబట్టిప్లాన్ వేసి, డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్న ఆ పిల్లను బలవంతంగా జీప్ ఎక్కించిమత్తుమందిచ్చి మన ఇంటికి తీసుకు వచ్చావ్..తాగి తూలుతూ లోపలకు వచ్చి,ఆ పిల్ల ని ఆ గదిలో పెట్టి తాళం పెట్టి నన్ను కాపలా పెట్టావు.నువ్వు స్నానం చేసి వచ్చేలోపున నీ తిదడిలోనిద్రమాత్రలు నాలుగుంటే కలిపాను .అర్ధరాత్రి దాటాక తెలివొచ్చిన ఆ పిల్లగోల ఏడుపు వినలేక నేను తలుపు తీసేసాను.ఒకనెంబరిచ్చి ఫోన్ చేయమంటే చేశాను..ఒకతనువచ్చి బయటినుండి ఆ కిటికీ చువ్వలు తీసి ఆ పిల్లను తీసుకుపోయాడు.
ఆ పిల్ల నాకన్నీ ఇచ్చి వాడీ కంట పడనీయవద్దని చెప్పి ఆకెమేరాలు బిగించి ,నన్నుకూడా పారిపొమ్మని ,
అర్ధరాత్రి దాటాక పారిపోయింది...
నేను పారిపోదాం అనుకునే సరికి ,నీవు అరుస్తున్నావ్..నిద్ర లేచావు అనుకుని ధైర్యం చేయలేదు.పడుకున్నట్టు నటిస్తూంటే నిజంగానే నిద్ర పట్టేసింది.పొద్దున్నలేచి చూసి నీవల్ల నేతప్పించుకుందని నన్నుచావబాదావు..
ఇదుగోఈ ఆపిల్ల అమర్చిన కెమేరాలోనన్ను పెట్టీన బాధలున్నాయి ఽమ్తేకాదు నువ్వు నీనోటితోనేచెప్పిన ,
నీచండాలమైన చరిత్ర ఉంది .. ఎలాగైనా కమిషనర్గారికి దీన్ని అందజేస్తాను .నీపాపం బద్దలు గొడతాను ..
అని శక్తినంతా కూడాగట్టుకొనిలేచి నిలబడి…పిచ్చిదాని వేషం వేసుకుని.పెరటివైపున్న కిటికీలో నుంచి బయటపడ్డాను.. చుట్టుపక్కల ఎవరూ గుర్తుపట్టలేనంతగా మెకానిక్ షెడ్ లో మసి పూసుకొని ,
పోలీస్ స్టేషన్ చేరాను..స్వగతంలోచెప్పుకొని , ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడమే నా జీవితంలో స్వర్ణ యుగం ప్రారంభమైంది.
అదే ఈ చంద్రగుప్తుని చేతుల్లో స్వర్ణయుగం ప్రారంభమైమ్ అనుకుంది. హిస్టరీ తో బి ఏ చదివి ,ఎంతో తెలివైన పిల్లగా గుర్తింపు పొంది ‘ప్రేమ పేరుతో ,పెను ప్రమాదం లో చిక్కుకున్న' దుర్గ ..
కమిషనర్ చంద్రగుప్త ద్వారా విమోచనం పొందిన ఎస్సై ఏకాంబరం భార్య దుర్గ అమావాస్య చీకట్లు పోయి అమ్మవారి ముఖం వోలె ప్రకాశిస్తున్న అష్టమిచంద్రుని చూస్తూ హాయిగానిద్రపోయింది......
—-------------------------------------
No comments:
Post a Comment