త్యాగఫలం ..
స్వాతంత్ర సంగ్రామంలోనికి సాహసంతో ఊరికి , స్వరాజ్య సమరంలో శౌర్య ధైర్యాలతో మెలిగి,
తెలుగు వారు తేజోవి విరాజితులని నిరూపించిన మన వీర విజయ గాథలు విందామా!
ఆ శౌర్య ధనులను వింటూ మనోచక్షుల ద్వారా కనులారా కందామా! పదండి…
“దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా !
పాండవేయుల పదును కత్తులు మండిమరిసిన మహిత రణ కథ
కండగల చిక్కని తెలుగుల కలసి పాడవే చెల్లెలా! అని రాయప్రోలు వారన్నట్లు కలసి పాడుతూ,,,,,,
లోకమంతాకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి
చీకి పోవని సేవ పదముల చేర్చి పాడరా తమ్ముడా,
తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి తత్రుళ్లి భంగపడని తెలుగు నాధుల పాట పాడవే చెల్లెలా! అనచూ .,,గత చరిత్రలు గానం చేస్తున్న ఆ యువకుడు ..............ఽతని చుట్టూచేరి,
గలగల ప్రవహిస్తున్న గౌతమీ నదిని చూస్తూ... ఇసుక తిన్నెలపై విహరిస్తున్న మరి కొందరు యువకులు స్వాతంత్రోద్యమ ఘట్టాలను ఎలా స్మరిస్తున్నారు. వినండి..
.!. ఒక యువకుడు: “ ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం. వారందరినీ తలచుకుని మన మానస వీధిని నిలుపుకొని “
2 యువకుడు .. నిజం మిత్రమా! ఎంత తలుచుకున్న తరిమితేరినది. మెచ్చుకున్న కొలది మేలు అయినది.
స్వాతంత్ర ఉద్యమంలో తెలుగువారి పాత్ర. ఆ విషయాలను తన గలగలలో వినిపించే ఈ గోదారి గొంతులో విందామా!
3 .యువకుడు :నిజమే మరి ఆ త్యాగాలలో మరుపురాని మహా ఘట్టాలను మననం చేసుకుందాం.
4వ యువకుడు:1857 సంవత్సరం నాటి మొదటి భారత స్వాతంత్ర సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై తిరుగుబాటు జెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర గాధ మనకు స్ఫూర్తిదాయకం ..జానపదులు ఆ స్వాతంత్ర వీరుని అమరుగాతను పాడుతూ మండల నేటికీ ఉత్తేజ పరుస్తున్నారు.
”రేనాటి సీమలో రెడ్డోళ్ళ కులములోనా దొరవారి వంశాన ధీరుడే నరసింహారెడ్డి
కోయల్ కుంట్ల గుంటల వెంట కుందేరు వొడ్డు లెంట ,గుర్రమెక్కి నీవు వస్తే, కుంపిణికి గుండె దిగులు
కాలికి సంకెళ్లు వేసి,, చేతికి బేడీలు వేసి,,, పారాతో పట్టి తెచ్చి బంధికానాలో పెట్టిరీ
కండ్లకు గంతలు కట్టి నోటి నిండా బట్టలు పెట్టి , నిలువునా నీ తల్లికేమో చావు శుద్ధి తెలిపినారు.
కన్నకడుపే తల్లడిల్లే గంగలోనా గంగ కలిసే,, దొరవారి నరసింహారెడ్డి నీ దొరతనము కూలిపోయే
రాజా నరసింహారెడ్డి, అని ఆ స్వాతంత్ర పిపాసి మహావీరుడైన సీతారామరాజు గాథలు పాడుతూనే ఉంటారు.
1వ యువకుడు : మానధనుడైన మంగళ పాండే,, అహంకార ఆంగ్లేయ అధికారుల దురాగతాలపై తిరుగుబాటు చేసిన ప్రథమ ఉద్యమం, ప్రథమ భారత సంగ్రామానికి ప్రాణం పోసింది. సిపాయిల తిరుగుబాటుక.
రంగం సిద్ధం చేసింది. మన తెలుగువారిలో కూడా జాతీయోద్యమ స్ఫూర్తిని నింపి నడిపించింద..
2వ .యువకుడు : అవునవును:మన తెలుగు స్త్రీలు కూడా అంత తెగు చూపెట్టడానికి, స్వాతంత్రోద్యమంలోనికి ఉరకడానికి సిపాయి ఉద్యమంలో పాల్గొని,, శౌర్య ధైర్యాలతో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా, ఆంగ్లేయుల గుండెల్లో హడలు పుట్టించి, సింహ పరాక్రమంతో సోబిల్లి, వీరభరతనార్యై విజృంభించిన ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు తెగింపును కలగజేసింది..
3వ యువకుడు : నిజం మిత్రమా: నానాసాహెబ్,, తాంత్యాతోపే,, వంటి మహా వీరుల వీరగాథలు ఎలా మర్చిపోగలం?. ప్రథమ భారత సంగ్రామం పరిస్థితులను సమీకరించుకుని, స్వాతంత్ర ఉద్యమ సాహసానికి పూనుకోవడానికి భారతీయులు పకడ్బందీగా వ్యూహరచన చేసుకున్నారు.
ఇంకొక యువకుడు :“గ్రాండ్ ఓల్డ్ మాన్ అఫ్ ఇండియా గా గుర్తింపు పొందిన దాదాభాయ్ నౌరోజి” బ్రిటిష్ కంపెనీకి క్రమశిక్షణ గల మేనేజర్ కావలసి వచ్చినప్పుడు,” మేనేజర్ గా కోటలో బాగా వేసి” భారతదేశానికి సాయం చేయాలని అక్కడ చేరారు. లండన్ లో అధ్వానంగా ఉన్న భారతీయుల స్థితిని మెరుగుపరచాలన." లండన్ ఇండియా సొసైటీ స్థాపించి” అందరినీ ఐక్యపరచి స్వాతంత్ర్య పిపాసను రగుల్కొల్పారు.
5వ యువకుడు : స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాలగంగాధర తి లెక్క నినాదం స్వాతంత్రోద్యమానికి జవసత్వాలు కలిగించిందట కదా!
6వ యువకుడు : “నిజం మిత్రమా! స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్య చైతన్యం జాగ్రత్తగా ఉన్నంతకాలం నేను యువకుడినే.. నా విశ్వాసాలను ఏ అస్త్రము ఛేదింపజాలదు. ఏ అగ్ని దహింపజాలదు... ఏ ప్రవాహము దానిని కొట్టుకుని పోజాలదు . ఏ ప్రవాహము దానిని పెకిలింప జాలదు . నా దేహానికి ముసలితనం వచ్చినా
నా చైతన్యానికి ముసలితనం రాదు." అన్నారట తిలక్.
1.యువకుడు: అందుకే ఆనాడు అతివాద త్రయముగా అభివర్ణింపబడిన లాల్ బాల్ పాల్ లు , తమ ప్రసంగాల ద్వారా తమ ప్రవర్తన ద్వారా లక్షలాది మందిని ఉత్తేజపరచి భారత స్వాతంత్ర సంగ్రామాన్ని చైతన్యవంతం చేశారు.మహనీయుల కృషి మరువలేనిది..
2.యువకుడు: అవున మిత్రమా! స్వరాజ్య ఉద్యమంలో సమరోత్సహంతో పాల్గొని యువతను ఉత్తేజపరిచిన దేశభక్తులు మన ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ వైతాళికులుగా, ప్రధమ ఆంధ్ర రాజకీయ ఖైదీగా, నిస్వార్థ నిరాడంబర ప్రజాసేవకులుగా, విద్యావేత్తగా, త్యాగమూర్తిగా గ్రంథాలయ స్థాపకునిగా, అనేక విధాల ముఖ్య అతి చెందిన శ్రీ గాడి చర్ల సర్వోత్తమ రావు గారిని భారత స్వాతంత్రోద్యమ త్రిమూర్తులలో ఒకరైన విపించంద్ర పాల్ గారు ఉపన్యాసం ఇదిగో ఈ రాజమండ్రి వేదికగా జరిగినప్పుడు ఆ ఉపన్యాస ప్రభావం వలన హరి సర్వోత్తమ రావు గారే కాకుండా వేలాదిమంది విద్యార్థులు వందేమాతరం అంటూ బ్యాడ్జీలతో తరగతి గదులకు వెళ్లారట.
బిళ్ళలు తీస్తే గాని కళాశాలలోనికి రానివ్వమని ప్రిన్సిపల్ నిషేధాజ్ఞలు జారీ చేసినా , కాలేజీ నుండి సస్పెండ్ చేసినా, విద్యార్థి నాయకుడైన హరిసర్వోత్తమ రావు గారు కొంచెం కూడా బెదరకుండా ఉద్యమాన్ని ఉధృతం చేశారట..
3.వ యువకుడు :: పంజాబ్ కేసరి లాల్వ లజపతిరాయ్ పౌరుషాగ్రేసరి కదా!
4. యువకుడ.:అదొక ఉద్యమాల కొరకే ఈ పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి రాజమహేంద్రి విద్యార్థులు స్వరాజ్య సాధనా దీక్షా కంకణదారులైనరట…
5.యు.. స్వరాజ దీక్ష తీసుకున్నారని గాడిచర్ల హరిసరివోత్తమరావు గారిని బంధించి జైల్లో పెట్టారట…
6.యు..ఆ సమయంలోనే, హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకొని పొట్టి శ్రీరాములు గారు ప్రచారం చేసేవారట. మండుటెండర్లో కాళ్లకు చెప్పులు గొడుగు లేకుండ., జాతీయ ఉద్యమాన్ని చాటుతూ ప్రచారం చేసేవారుట. ఆ దేశభక్తున్ని సామాన్యులు” పిచ్చి శ్రీరాములు అనేవారట”.
అవును ఆయనకు దేశాభ్యుదయం అనే పిచ్చి పట్టిందట.
1.యువ. అందుకే మహాత్మా గాంధీ, పట్టుమని పదిమంది పొట్టి శ్రీరాములు వంటి మహా వ్యక్తులు ఉంటే మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్రం తెచ్చి పెట్టగలను అన్నారట..
2వ.యు. దేశ భాషల సమున్నతికి ఆత్మబలిదానం గావించిన అద్భుత దేశభక్తులు శ్రీరాములు గారు.
No comments:
Post a Comment