Sunday, 13 October 2024

అక్టోబర్ 8వ తేదీన అడవిబాపిరాజు గారి జయంతిసందర్భంగా వ్యాసం

 అక్టోబర్ 8వ తేదీన అడవిబాపిరాజు గారి జయంతిసందర్భంగా వ్యాసం.


“ఎటువైపు చూచిన ఏడు అడుగుల ఎత్తు నిలిచి ,

మనసులో మహోన్నత భావనలను నింపే మహనీయ మూర్తులు సాహితీ లోకాన  కొందరు మాత్రమే కానవస్తారు . 

అరుదైన వ్యక్తిత్వం గల అలాంటి మహనీయుల కోవకు చెందిన కవుల లో అడవి బాపిరాజు గారు ఒకరు.

సుకుమారుడు ,సుందరుడు, సునిశిత పరిశీలనా మూర్తి,విద్యా వినయ సంపన్నుడు

 బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు గారు.

వారి మహనీయ వ్యక్తిత్వాన్ని గూర్చి, కొందరు మహనీయులు ఏమన్నారంటే! 

20వ శతాబ్దపు తొలి అర్ధ భాగంలో ,లలిత కళావతంసులకు సాహితీవేత్తలకు

 బావగా పరిచయమైన బాపి బావ, పదాలకు నాట్యం నేర్పాడు.

 నాట్యానికి సంగీత మద్దాడు. చిత్రాలకు ప్రాణం పోశాడు. చరిత్రను అక్షరీకరించాడు. సాంఘికానికి అభ్యుదయం ఊడ్పులు  అందించారు. 

అన్నింటా మానవత్వం ప్రజ్వ లించారు. అతడే అడవి బాపిరాజు అన్నారు .

 .సాహితీ సముద్రంలో అడవి బాపిరాజు లాంటి ఆణిముత్యాలు కొన్నేలభిస్తాయి“ అన్నారు .

చెదరని క్రాపు ,నలగని తెల్లని దుస్తులు, చెదరని చిరునవ్వు ,మానవత్వాన్ని పసిగట్టే పసివాడని చూపు, సురభాండం చిలికే పలుకులు, ఆదుకోడానికి  సాగుతున్న అడుగులతో సొగసైననడక ఇది బాపిరాజుగారి  స్పురద్రూపము .

అడవి బాపిరాజు గారి పేరు వినగానే సాహితీవేత్తలకు గుర్తు వచ్చేవి ఆయనరాసిన నవలలు ,కథలు ,మరికొందరికి ఆయన చిత్రించిన చిత్రాలు .

సన్నిహితులకు ఆయన పాడిన పాటలు తలపులకు వస్తాయి..

 అయితే నిజాం తెలుగుదినపత్రిక సంపాదకునిగా ప్రజాస్వామ్యయుతమైన పోరాటాలకు ఉత నిచ్చిన వానిగా ప్రజాతంత్రవాదిగా అభ్యుదయ వాదిగా చేసిన కృషి చరిత్రలో మరుగున పడిపోయింది .ఆయన వ్యక్తిత్వం లో మరుగున పడిన ఈ కోణం గురించి మనకు తెలియజేసిన వారు దేవులపల్లి రామానుజరావు గారు.

  బాపిరాజు గారు రాజమండ్రి ప్రభుత్వ కళాశాల లో విద్యార్థి గా ఉన్నప్పుడు” దామెర్ల రామారావుగారు, కవికొండల వెంక ట్రావు గారు ,జొన్నల గడ్డ ,సత్యనారాయణమూర్తి గారు ఆయనకు సమకాలికులు. కళాశాల ప్రిన్సిపల్ ఆ స్వార్డ్ కూల్రే చిత్రకారుడు.. రచయిత బాపిరాజుగారు అక్కడ బి.ఎఫ్ చేసి ,మద్రాసు లా కళాశాల లో బియ్యే

 చదివి, కొంతకాలం భీమవరం కోర్టులో ప్రాక్టీస్ చేశారు .

కూల్ డ్రే   తన దేశానికి వెళుతూ,బాపి రాజు గారి ని, గొప్ప చిత్రకారునిగాతీర్చిదిద్దాలని ఉద్దేశ్యంతో ,లండన్ తీసుకొని వెళతాను రమ్మని పిలిచారుట .

అయితే బాపిరాజుగారు, దేశం దాస్యం లో అలమటిస్తుంటే తన అభివృద్ధి కోసం ఇంగ్లాండు వెళ్లడాని కి ఇష్టపడలేదు.

 కూల్ డ్రే కూడా ఆయనను తీసుకున్న నిర్ణయానికి హర్షించారు.

 ఒక శిఖరం మరొక శిఖరంతో పోరాటానికి దిగినట్లు ,మనం పురాణాల్లో చదువుకున్నాం.

కానీ! ఒక సాహితీ శిఖరం ,మరో సాహితీ శిఖరపు ఔన్నత్యాన్ని ప్రశంసించిందంటే ఆశ్చర్యం వేస్తుంది .అది ఆ మెచ్చుకున్న సాహితీ శిఖరం  సామాన్యం కాకపోతే సంభ్ర మాశ్చర్యాల లో మునిగిపోతాం.

మరి ఆ సాహితీ శిఖరం ఎవరంటే వారే ! కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు.

వారు బాపిరాజు గారి గురించి చెప్పిన కొన్ని పంక్తులు ,చదివితే చాలు,

 వారి వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ” అతడు గీసిన గీత బొమ్మై, అతడుచూసిన చూపుమెరుపై ,అతడు పలికిన పలుకు పాటై అతడు తలచిన తలపు వెలుగై అతని హృదయములోని  మెత్తన అతని జీవికలోని తీయనా అర్ధ చమకృతియే అమృత  రసధునియై” “అన్నమాటలు బాపిరాజు గారి వ్యక్తిత్వానికి గీటుగా ఇలా నిలిచి మహా మానవునిగా తీర్చిదిద్దాయి హిమాలయ శిఖరం వలె గంగా యమునా నదులవని శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్య శ్రేష్టల్లో అడవి బాపిరాజు గారు అగ్రశ్రేణిలోని వారిని  దాశరధి కృష్ణమాచార్యులు వారు అన్నారు.ఆయనే బాపిరాజు గారికి విశిష్టమైన వ్యక్తిత్వం త్రివేణి సంగమం వలే సంగీత సాహిత్య చిత్ర నాయక్ చిత్రలేఖనాలు వారిలో కలిసిపోయాయి అంటారు ఆయన తలస్పర్శగా తెలిసిన వ్యక్తి ఆయన .

 హిమాలయోత్తుంగ శ్రుంగం  నీ బ్రతుకు ఉమాపతి నాట్య రంగం అని బాపూజీ గురించి బాపిరాజు గారు గానం చేస్తూ ఉంటే తన్మయులై వినేవాళ్ళట. ధవళ మైన బా నవ్వుతూ న భవిష్యతి అంటారు పెద్దలు బాపి రాజుగారు జాతీయ ఉద్యమంలో పాల్గొని ఒక్కొక్కసారి ఆరు నెలల చొప్పున రెండు సార్లు కారాగారవాసం చేశారట ఒక జైలులోనే ఆయనతోపాటు రంపపితురీ ఉద్యమానికి చెందిన పలనాటి ఎలమంద అనే విప్లవకారుడు కూడా ఉన్నాడట అతని గురించి తెలుసుకొని ఆశగా ఎలమందపై ఒక పాట రాసి జైల్లోగొంతెత్తి“ ఓ పలనాటి ఎలమంద కల వరిస్తాం జైలు కొ ట్ల ల్లో” అని బాపిరాజు గారు పాడారటకానీ ఆ పాట పూర్తిగా లభ్యం కాలేదు..

 ఆయనగోన గన్నారెడ్డి   మనకు పలనాటి ఎలమంద గా కనిపిస్తాడు

 పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించే చట్టాలను పత్రికల  నిషేధాన్ని నిర్వర్యంగా ఖండిస్తూ బాపిరాజుగారు రచనలు చేసేవారు అంతేకాదు తాను అధ్యక్షుడిగా భాస్కరభట్ల కృష్ణారావు .ఎల్లాప్రగడ సీతాకుమారి .వట్టికోట అల్వార్ స్వామి కార్యదర్శులుగా ఉండిన హైదరాబాదులో అభ్యుదయ రచయితల సంఘానికి 8 .10. 44న ప్రారంభించారు.

 ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ తన ప్రసంగంలో అడవి బాపిరాజు గారు

 రచనలు సాధించాలంటే కొన్ని హంగులు కావాలని బాధపడనవసరం లేదు నేడు సోవియట్ సాహిత్య పరులు చిత్రకారులు భయంకర యుద్ధ ప్రదేశాల నుంచే సాహిత్యాన్ని చిత్రాలను సృష్టిస్తున్నారు అదే మనక కూడా మార్గదర్శకం రచయిత తన పరిసరాలను పరిస్థితులను అర్థం చేసుకుంటే సులభంగా వ్రాయగలడు అంతేగాక సమాజానికి సారథి కాగలడు ఆ విధంగా సంచరించడం రచయితల ధర్మము వ్రతము అయి ఉండాలి అన్నారు నిజాం లోగో ఇక్కడింద స్వాతంత్రము సమత్వము సౌభాద్రత్వము అనే ఫ్రెంచి విప్లవ కాలం నాటి ఆశయాలు రాసి ఉండేవి నిజాం మూడు ఎడిషన్లలో ఉర్దూ ఎడిషన్ హైదరాబాదు నవాబుని ఇంగ్లీష్ ఎడిషన్ బ్రిటిష్ వారిని పొగిడేవిగా ఉండేది ఒక్క తెలుగు ఎడిషన్ మాత్రం తెలంగాణ ప్రజల న్యాయమైన పోరాటాలకు మద్దతు ఇచ్చేది దినపత్రికలకు వ్యవహారిక భాషకు అలవాటు చేసింది నిజాం పత్రిక ఆ తర్వాతే ఇతర పత్రికలు అన్నిటిని చెప్పుకోవాలి

ఆంధ్ర మహాసభ వార్తలు తెలంగాణ గ్రామాల్లో ప్రజల కష్టనష్టాలు, పోరాటాలు ప్రకటనలు అన్ని నాలుగో పేజీలో సుముఖంగా ప్రచురించేవారు ఈ పత్రిక వెసులుబాటును చక్కగా ఉపయోగించుకున్నారు అడవి బాపు రాజుగారు తన సంపాదక వర్గ బృందంతో సహా తెలంగాణ గ్రామాల్లో దేశముక్కులు పటేళ్లు పట్వారిలు, భూస్వాములు సామాన్య ప్రజానేకం పై చేస్తున్న దాడులు అణిచివేత చర్యలు వాటిని ప్రతిఘటిస్తూ ప్రజలు చేసే చిన్న పెద్ద పోరాటాలు కండనలు నిరసన ప్రకటనలు మొదలైనవి నిజాం పత్రికకు పత్రికను ఈనాడు చదువుతూ ఉంటే అది పార్టీ పత్రికగా పని చేసిందా అంతగా తెలంగాణ ప్రజల సమస్యలతో తాను ఏకమై ఆ వార్తలను మీజాన్ అడవి బాపిరాజు గారి సంపాదకత్వంలో ప్రచురించింది అంటారు దేవులపల్లి రామానుజ రావు గారు 

ఎండరేందరే మహానీయులు బాపిరాజు గారి సమగ్ర స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసిన సన్నివేశాలు ఉన్నాయి వాటిని ఇక్కడ ఉతంకించడానికి సమయము గాని నాకున్న జ్ఞానం గాని సరిపోవుశ్రీ  అడవి కృష్ణయ్య  సుబ్బమ్మ గార్ల గర్భశక్తి ముత్తాఫలంగా 8 10 1895 వ సంవత్సరంలోపశ్చిమగోదావరి జిల్లా  భీమవరంలో జన్మించారు. ప్రాథమిక విద్య రాజమహేంద్రవరం దగ్గర కొవ్వూరులో సాగింది 1915లో వీరి వివాహం జరిగిద్ది భార్య సుభద్రమ్మ గారు. 19 15 వీరు కూల్ డ్రే దొర గారి శిష్యత్వం ప్రారంభించారు 1920లో బిఏ పాసయ్యాక జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకున్నారు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్టు అయ్యారు ఆ సమయంలోనే పుత్రుడు పుట్టి చనిపోయాడు 1922లో సత్యాగ్రహం అరెస్టు మళ్ళీ జరిగాయి 1923లో చిత్రకళ విద్యార్థిగా ఆంధ్రజాతీయ కళాశాలలో ప్రమోద కొమోద కుమార శత ఉపాధ్యాయ వారి శిష్యత్వాన్ని స్వీకరించారు 1924 లో గయా కాంగ్రెస్ లో పాల్గొన్నారు. 1931లో బిఎల్ పాసయ్యారు 1934లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు వారు నిర్వహించిన నవలా పోటీలలో నారాయణరావు నవలకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలతో పాటుగా ప్రథమ బహుమతిని స్వీకరించారు1935లో బందర్ జాతీయ కళాశాల ప్రిన్సిపల్ పదవిని అలంకరించారు 1936 లో భార్య సుభద్రమ్మ గారికి తీవ్రమైన అనారోగ్యం ప్రథమపుత్రిక రాధా వసంత కుమారి గారికి పోలియో వంటి కష్టాలు రావడంతో ధైర్యంగా దిగమింగారు

19  49లొ    కుమార్తెలు రాధా వసంత, ప్రేమ కుమారి గార్ల  వివాహం జరిపించారు.

1950లో కనకాభిషేకం జరిగింది  మద్రాసు తెలుగు కళా సమితి భాషా సమితి ఆధ్వర్యంలో తయారైన తెలుగు విజ్ఞాన సర్వస్వానికి సాహిత్యం భాష విద్య మొదలైన విషయాలకు కలలో ఉన్న విషయాలకు సంబంధించిన సంపుతం తయారు చేసే ఉప సంఘం లో సభ్యత్వం పొందారు . 1951లో  సింహళంలోని సిగిరియా గుహల్లోని కుద్య చిత్రాల ప్రతిరూపాల చిత్రానకై పరిశీలనా యాత్ర చేశారు ఈ మహనీయుడు సెప్టెంబర్ 22 1952న  తన సంగీత సాహిత్య చిత్రలేఖన శీల సౌందర్యాలతో సమ్మోహన పరచడానికి దివిజ లోకాలకు ఏగారుఅడవి బాపిరాజు గారి సృజన వైజయంతిక మాల

 వీ 19 193 నారాయణ రావు, తుఫాను కోనంగి నరుడు జాజిమల్లి వంటి సాంఘిక నవలలను హిమబిందు గోన గన్నారెడ్డి అడవి శాంతి శ్రీ అంసుమతి అనే చారిత్రక నవలలను మధురవాణి{ పూరణ దిట్టక శ్యామలాదేవి}శిలారధం కైలాసశ్వరుడు అనే అసంపూర్ణ సముద్రత నవలలను రచించారుఅంజలి తరంగిణి   తూలికా   నృత్యం భోగి నిలవయ్య రాగమాలిక వింధ్యాచలంవంటి కథా సంపుటాలు 

18ఎనిమిది కవితా సంపుటాలు, వీడియో నాటికలు ఏకాంకికలు వ్యాసాలు రేడియో ప్రసంగాలు పత్రికలు సంపాదకత్వాలు అనువాద గ్రంథాలు సాహిత్య లేఖలు చిత్రకళా కేళికి చెందిన ఎన్నెన్నో రచనలు లెక్కకు మిక్కిలి రచించారు బాపిరాజు గారి రచనల విషయంగా పీహెచ్ డి  పట్టాలు పొందినవారు అనేకులు ఆచార్యులైనడు ఉన్నత పదవుల్లో ఉన్నారు వారిలో మా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య వెలమల సిమన్న గారి ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను

 ఇలా ఇలా వారిని గూర్చి పరిచయం చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది అటువంటిది వారు రాసిన మహోత్కృష్టమైన సాంఘిక నవల రాజము” నారాయణరావు “ గూర్చి వివరించడానికి నాకు ఉన్న సమయము జ్ఞానము రెండూ సరిపోవు.సాహసించి నాకు ఎంతో ఇష్టమైన నారాయణరావు నవలను గూర్చి నా శక్తి మేరకు కొంత పరిచయం చేస్తాను. ఈ నవల పరిచయం చేయడంలో ప్రధాన కారణాలు నేను 16 17 ఏళ్ల వయస్సులో చదివిన నవలలలో ఉన్నత విలువలతో కూడుకున్న ఉత్తమమైన నవలగా నారాయణరావు నవలను భావించడం ఒకటి.అడవి బాపిరాజు గారు  నారాయణరావు  నవలలో  వర్ణించిన జమీందారీ కుటుంబాల్లో ఇనాంధారి కుటుంబాల్లో నిరాసిదారులలో నియోగుల కుటుంబాల్లో మా తాతగారు మా బంధువులు రే తాత ముత్తాతలు కొందరు ఉండడం, ఆ నవలలో నారాయణరావు వ్యక్తిత్వం లాంటి వ్యక్తిత్వం గల ఉన్నత విద్యావంతుడైన మా చిన్నన్నయ్య, అలాంటి పల్లెటూర్లలో అలాంటి జీవితాన్ని  స్వయంగా నేను అనుభవించడం, బాపిరాజు గారు వర్ణించిన వ్యక్తిత్వాలు లాంటి వ్యక్తిత్వాలను దగ్గరుండి చాలామందిని చూడడం, ఈ నవల పైన మక్కువ ఎక్కువ కావడానికి ప్రధాన కారణం అయ్యింది.  మరీ చెప్పాలంటే రామాయణంలో రాముని వ్యక్తిత్వానికి సరిపోయే వ్యక్తిత్వాన్ని గల నారాయణరావును  నాయకునిగా  ఎన్నుకోవడం, నాయకురాలు  విద్యావంతురాలు గుణవంతురాలు అయినా అదే పనిగా చెప్పుడు మాటలు వింటూ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలతో ప్రభావితమై తనకు తాను ఒక గిరి గిసుకుని కూర్చోవడం,  వలలో స్వాతంత్రోద్యమ నేపథ్యము నాకు ప్రధాన ఆకర్షణలుగా మిగిలాయి .శ్రీ బాపిరాజు గారిని మరించి నంతని ఆయన ప్రేమ మూర్తి కనుల ముందు సాక్షాత్కరించిన విధంగా నారాయణ రావు గారిని తలచుకోగానే శ్రీ పాపిరాజు గారి విరాట్ మూర్తి కనుల ముందు సాక్షాత్కరించక తప్పదు

సాహిత్యంలో” నారాయణరావుకు” పర్యాయపదం అడవి బాపిరాజు ..

అంతటి ప్రసిద్ధిని సంపాదించిన సాంఘిక నవల సృజన 1934లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు నవలల పోటీలో వచ్చిన రెండు నవలలను ప్రథమ బహుమతికి అరహమైనవిగా న్యాయాన్ని భావించి బహుమతిని ఇద్దరి రచయితలకు సమానంగా ప్రచారం చేశారు విశ్వనాధ్ వారి వేయి పడగలు పాపిరాజు గారి నారాయణరావు ఇది నారాయణరావు ఆవిర్భావ చరిత్ర.ఇందులో క్చిత్రితమైన నారాయణరావు పాత్ర  అడవి బాపిరాజు గారిదే అని అసంఖ్యాకులు అనుకుంటే కాదు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ముష్టి లక్ష్మీనారాయణ రావు గారితో చరిత్ర అన్నది రచయిత సమకాలికుల అంచనా.  

బాపి రాజు గారి సన్నిహితుడు భీమవరంలో నాటి న్యాయవాదుల్లో ప్రముఖుడు బాపిరాజు గారి కుమార్తెలకు తోట పెద్దనాన్న చివరి దశలో పూల చెట్ల నర్సరీని హైదరాబాదులో నిర్వహించిన సౌకమార్గ హృదయుడు లిస్టి లక్ష్మీనారాయణ రావు గారు

 బాపి రాజుగారు మిగిలిన రచనల కన్నా వారి సాంఘిక చారిత్రక నవలలకే ప్రాధాన్యమిచ్చారు.వీరిగురించి రాయప్రోలు వారిలా పాడారు. 


No comments:

Post a Comment