Monday, 14 October 2024

జ్యోతిర్లింగస్వరూపుడు

 జ్యోతిర్లింగస్వరూపుడు


సౌరాష్ట్ర దేశాన సోమనాధా యనుచు

 సకల జనులు నిన్ను సన్నుతింప

జ్యోతిర్లింగమై  జాజ్వల్యమానమై

వెలుగొందు మహాదేవ వేడుకొందు…

 

మరో కైలాసమని మహదానందము చెంది

 మల్లికార్జున ఈ మహిని వెలిసి

మనోభీష్టం తీర్చి మనసార దీవించు

 మహాదేవ  మనసార గొలుతు 


 చితాభస్మము పూయచిద్విలాసముగ నుండు

మహాకాళేశ్వరుని మనము నందు

 అనుక్షణము స్మరించి ఐహికాముష్మికములు

అనవసరము పొందు చుందు నేను ..







No comments:

Post a Comment