దైవ నిర్ణయం
—----------------.
“కూలి పోయిన గుడిసె ముందు నిలుచుని గుండెలవిసేలా ఏడుస్తున్న రజియా ని చూసి, చలించి పోయారు రావుగారు.
హోరుమనే ఆ గాలి వానలో .రైన్ కోటు వేసు కొని వెళ్ళి మరీ,రజియాకి ధైర్యం చెప్పి,
తన ఇంటికి తీసుకొచ్చారు ..
గోలగోల పెట్టి గుండెలు పగిలేలా ఏడుస్తున్న రజియా ,రావుగారు చెప్పిన మాట వినగానే,అతని పాదాలు
పట్టుకొని భోరునఏడ్చి ఆయనను అనుసరించింది .
..... కొద్ది గంటల క్రితం నుండి కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది..
ఏకధారగా కురుస్తున్న వర్షానికి ఏర్లుగెడ్డలు ఏకమౌతున్నాయ్ …ఇంచుమించుగా రావుగారి కాంపౌండ్ వరకూ నీరు వచ్చేసింది .
మస్తానయ్య మాంసం దుకాణం, వారిఇల్లనబడే గుడిసె కూలి పోయ్యాయి .
చుట్టు ప్రక్కల చాలా గుడిసెలు ఎగిరి పోయాయి…
ఏమిటో ,ఈ ప్రళయం! ..ఈ వర్షం ఇంకా ఎక్కువై పోతుందంట .కారు, షెడ్డు అవీ ఎలా. ఉన్నాయో నని,
చూసివెడదామని వచ్చిన రావు,తమ షెడ్డు ముందర ఎత్తైన గట్టు మీద వేసిన రేకు కింద,వర్షానికి తడవకుండా,
చిన్న చెల్లెలిచేయిపట్టుకుని నిలబడి , ఏడుస్తున్న దాన్ని ఓదార్చుతూ మస్తాన్ కొడుకు పదేళ్ల షరీఫ్ ..
వాడిని గట్టిగా పట్టుకుని వెక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్న మస్తానయ్య కూతురు..
ఆ పిల్లల్ని చూసి ,అరే!ఈ గాలి వానలో ఇక్కడ ఏమి చేస్తున్నారర్రా ?
ఇంటికి పొండి. ?మీ అమ్మా, నాన్న వెతుక్కుంటారు అన్నారు ..
ఆ అమ్మాయి ముంతాజ్ బోరుమని ఏడుస్తోంది ..అబ్బాయి కళ్ళుతుడుచుకుంటూ,
చెల్లెలిని దగ్గరకులాక్కుంటూ ,అదుగో !ఇప్పుడే మా ఇల్లు పడిపోయింది.సార్!
,భయం వేసి చెల్లిని తీసుకుని పరిగెత్తుకొని వచ్చేసాను సార్ !
ఈ గాలి రానప్పుడు మా అమ్మ .మా చెల్లెలు ఆకలని ఏడుస్తుంటే,
పొయ్యి అవీ తడిసి పోయాయని ,మమ్మల్ని మా డాడీకి అప్పజెప్పి, రోడ్డవతల ,తను పని జేస్తున్న
అమ్మగారింట్లో మాకు తినడానికేమైనా అడిగి తెస్తానని వెళ్ళింది సార్ …
వర్షం తగ్గాక వెళ్ళి పోతాము.మమ్మల్ని ఇక్కడ ఉండనీయండి సార్ .
ప్లీజ్ సార్ । చిన్ని చేతులు వాడి చెల్లెలు చేత్తో కలిపి జోడించాడు వాడు.
రావు గారికి జాలి వేసింది .మరి ,మీ నాన్న ఏమయాడురా ? అన్నారు...
మమ్మల్ని కూర్చోండి .ఇప్పుడేవస్తానని చెప్పి ,అమ్మ ,దాచుకున్న డబ్బులు పట్టుకొని తాగడానికి వెళ్ళి పోయాడు సర్... గాలికి మా ఇల్లు కదులుతుంటే భయం వేసి మీ షెడ్ కి వచ్చాం సర్ .
మేము ఏమీ తీయ లేదు. దొంగలం కాదు. మేము వచ్చాక మా ఇల్లు మొత్తం పడిపోయింది. .
మా చెల్లెలు అసలే ఆకలితో ఏడుస్తోంది .చెల్లెలి చేతులు వాడే జోడించి మళ్ళీ మొక్కాడు…
అయ్యో! మిమ్మల్ని ఏమీ చెయ్య నర్రా । ఈ గాలీ వానలో ఇక్కడ వద్దు ..
మా ఇంటిరండని , పిలుచు కెళ్ళి ,వరండాలో ఉండమని లోపలికి వెళ్ళారు.
పొడి తువ్వాళ్ళు తెచ్చి ఇచ్చి, తల తుడుచుకోమని ,తన బిస్కెట్స్ డబ్బాలోంచి కొన్ని బిస్కెట్స్ తెచ్చి ఇచ్చి తింటుండండి,ఇప్పుడే వస్తానని ఇంట్లోకివెళ్లారు రావుగారు …
అబ్బ! ఎక్కడికి వెళ్లారండీ ?ఈ గాలివానలో! వేడివేడిఉప్మా ,జీడిపప్పు వేసి చేసాను .చల్లాిరి పోతోంది .
మీ కోసం చూసి చూసి మామయ్యగారికిచెప్పి, ఆయనకు టిఫెన్ పెట్టి, మనిద్దరికీ ఆ హాట్ పాక్లో పెట్టాను. మీరు తినేయండి. .నేను“దేవీ భాగవతం”పారాయణ చేసుకొని తింటాను అన్నారు అనంతలక్ష్మి...
“భర్త. మాట్లాడకుండా వెళ్ళి ,రెండు పేపర్ ప్లేట్లు తీసుకొచ్చి. ఉప్మా వాటిల్లో సర్దుతుంటే ,ఆశ్చర్యంగా! అడిగారు ” .....ఏమిటది !ఎవరికి ,మీ స్నేహితు లెవరైనా వచ్చారా ? అని .
“ మన పొరుగు మస్తాన్ ఇల్లు కూలిపోయింది ..పాపం అతని పిల్లలు భయపడి వచ్చి ఆ గాలివానకు మన షెడ్డులో తలదాచుకున్నారు .. పాపం ఆ పిల్ల ఆకలికి గుక్కపెట్టి ఏడుస్తోంది . తినడానికేదైనా తెస్తానని
వర్షం రాకముంద వాళ్ళమ్మ వెళ్ళిందట ,ఈ గాలివానలో ఎక్కడ చిక్కుకుందో? ఇంకా రాలేదుట .
ఆ తాగుబోతు మస్తానెటో పోయాడట ,అన్నారురావుగారు,మంచినీళ్ళ బాటిల్ లో నీరు పడుతూఅన్నారు.. ఏమిటి ?మనకి పెద్ద సమస్యగా తయారయిన మస్తానయ్య,మనశ్శాంతి లేకుండా చేస్తున్న మస్తానయ్య ,
వాడి దుకాణంలో మాంసపు ముద్దలు కాకులూ, గద్దలూ ,ఇటుపడిస్తుంటే ,నేను అడిగానని ,తాగి వాగి పెద్దగొడవపెట్టిన మస్తానయ్య..ఇంత చక్కని ఇల్లు కట్టుకున్న ఆనందం మిగలనీయని ఆ మస్తానయ్య పిల్లలకోసం ,మీ కెంతో ఇష్టమని జీడిపప్పు నెయ్యివేసి. ప్రత్యేకంగా చేసిన ఉప్మా పెట్టేస్తారా? ఆ రోజు అతడేమి వాగాడో, మీ నాన్నగారు విన్నారు అడగండి ..అలాంటివాడి పిల్లల కోసం ఫలహారం పట్టుకు పోతారా ?కావాలంటే రాత్రి మిగిలిన అన్నం అని, ఆమె. ఏదో అనబోతుంటే .!వద్దు అనంతా ! వాడి తండ్రి ఏదో చేస్తే! పసిపిల్లలేమి చేస్తారు?
అయినా !ఆరోజు నుండి వాళ్ళమ్మ వచ్చి. ఏదైనా పడగానే శుభ్రం చేస్తోందిగదా..।
ఒకటి ఆలోచించు. పిల్లలు భగవద్ స్వరూపాలని నీవేఅంటావు కదా.. మొన్న నవరాత్రి పూజల ని అమ్మవారి రూపాల ని,రెండేళ్ళ నుండి పిల్లలి కోసం వెతికి వెతికి తెచ్చి, రకరకాల పిండి వంటలతో భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పూజలు చేసావు... ఆపిల్లలంతా ఆగర్భ శ్రీమంతులు ..ఆకలి తెలియనివారు .ఈ పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు ?వీరు అమ్మవారి స్వరూపం కాదా ? మస్తాన్ కూతురు ఆడపిల్ల అమ్మ ఆ అంశం కాదా? ఆలోచించు.ఈ పిల్లలు తిని సంతోషిస్తేనే, అమ్మవారు నిన్ను ఎక్కువ అనుగ్రహిస్తుంది ,ఏమో? అని, ఆ ప్లేట్లు పెద్ద ప్లేట్లొపెట్టి ,నీళ్ళ సీసా పట్టుకుని వెళ్ళారు రావుగారు
భర్త బయిటకెల్తుంటే, నోటమాట రాక అతనన్న ప్రతి మాట నిజమని పించినా ?మస్తాను వాళ్ళసలు మనదేముడినే నమ్మరు కదా ,మామయ్యా !అంటున్న అనంత లక్ష్మితో. ....
మామగారన్నారు . ఆకలి తీర్చడానికి మంచి మనసు, మానవత్వం కావాలమ్మా...మతం కులం కాదు
వాడు పూజలు వ్రతాలు చెయ్య డని మనం అనుకుంటా మమ్మా” ! ఆత్మశుద్ధి లేని ఆచారాలనునమ్మడు ,
కానీ!.ఆత్మశుద్ధితో అంతరాత్మ చెప్పింది చేస్తాడు” ..వెళ్ళు, వెళ్ళి మంచిని అనుసరించు అంటే 1
నివ్వెరపోయి భర్తననుసరించారు అనంతలక్ష్మి.....
అనంతలక్ష్మిని పిల్లల దగ్గరుండ మని, కిటికీలోంచి రజియా రావడం చూసి వెళ్ళి, పిల్లలుతన దగ్గర క్షేమంగా ఉన్నారనిచెప్పి ,తీసుకొచ్చారు రావుగారు. తన పిల్లలుటిఫెన్ తింటూ, అనంతలక్ష్మితో కబుర్లు చెబుతుంటేచూసి ,ఆమె పాదాలపై పడి., మీరు దేవత ,అయ్యగారు దేముడూ నమ్మా....
కాపాడి కన్నతల్లిలా ఆదరిస్తున్నారు..మీ మేలుజీవితంలోమరువనమ్మా అని కన్నీళ్ళు పెట్టుకుంది రజియా ..
అయ్యో !క్షేమంగా నీ పిల్లలిని చేరుకున్నావు ..ఇదిగో ,ముత్తయుదువు కిద్దామని పెట్టిన చీర .
అమ్మ వారు నీరూపంలో వచ్చిందనుకుంటాను .ఆ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో ...తల బాగా తుడుచుకో …
అసలే వట్టి మనిషివికావు .. నీ పిల్లలకి మా మనుమలి బట్టలు వేసారు మీ అయ్యగారు ..నేను టీకాచి. తెస్తాను అని లేచారు అనంతలక్ష్మి.
“పిల్లలిని పొదివి పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది రజియా బేగం .
తండ్రి ఎలా వెల్లాడో, ఇల్లెలా కూలిందో, చెల్లీ ।ఎలా తను రావుగారింటికిఎలా వచ్చారో. వివరంగా చెప్పాడు అబ్బాయి...ఆయన ఆదరించడం ,అన్నీ కొడుకు వర్ణించి చెప్తుంటే, ఒక నిశ్చయానికి వచ్చిన రజియా రావు గారితో అంది ..నా తండ్రి కంటే మీరు నయం బాబూ .....మా తండ్రి. తాగుడు వ్యసనం వలన
మస్తాన్ దగ్గర. డబ్బులు వాడేసి. అప్పు తీర్చమని గొడవ పెడితే. నన్ను ఇచ్చి పెళ్ళి చేసాడు .తర్వాత తెలిసిందయ్యా... అప్పటికే రెండు పెళ్ళిల్లు చేసుకుని స్థిరం లేక తిరుగుతాడని ..తిరుగుతాడని...కానీ।ఏంచేసేది. అప్పటికే. పిల్లడు కడుపున పడ్డాడు..అతగాడికి ఆ తాగుడు తప్ప, ఏమీ పట్టదు బాబూ! ఇన్నాళ్లూ భరించాను..
ఇక నా వల్ల కాదు...ఈ రోజు మీరు లేక పోతే నా పిల్లలు నాకు కాక పోదురు బాబూ!నా బతుకెలాగూ నాశనమైంది.ఇంకా నే నతని తోనే ఉంటే. పిల్లలు పాడయి పోతారండీ బాబుగారూ !ఎవరికైనా అమ్మేస్తాడు .
ఇప్పుడే! నేను పనిచేస్తున్న అమ్మగారు అడిగారు బాబూ,వాళ్ళఊరురమ్మని..
ఆమెగారు, ధనవంతురాలైనా ,చదువుకున్నదైనా నాలాగే, ఒకడి వలన మోసపోయారు..ఆమెకు పిల్లలు లేరు ..
ఆమె తండ్రికి పెద్ద స్కూల్, హోస్టలు, ఉన్నాయిట ..ఆమెతో పాటు వచ్చి , నన్ను హోస్టల్. లో పిల్లలకు వంటపని చూసుకోమన్నారు.పిల్లల్ని ఆస్కూల్లో చదివించుకోమన్నారు .నాకు ఉండడానికి ఇల్లు ఇస్తామన్నారు ..
పిల్లల బ్రతుకైనా బాగుంటుంది .నేను వెళ్ళిపోతానమ్మా !వర్షం తగ్గాక. ఆ అమ్మగారింటికి వెళ్ళి పోతామమ్మా !
ఎక్కడున్నా మీమేలు మరువనమ్మా। అంటూ నమస్కరించింది రజియాబేగం ..
ఇంతలో పరిగెత్తుకుంటూ రజియా ప్రక్క గుడిసెలో రిక్షా రాముడు వచ్చాడు. .రజియక్కా । మీ మస్తాను. కల్లు పాకదగ్గర తాగేసి పడిపోయాడట .ఆప్రక్కన పాతగోడ కూలి మీదపడ. చనిపోయాడట ..అందరూ, నీకో సం వెతుకుతున్నారట.పదక్కా!.నా ఆటో లో తీసికెల్తాను .అన్నాడు..
అయ్యో । అని గుండెలు బాదుకుంటూ పిల్లలనుతీసుకొని మమ్మల్ని దిక్కు లేని వాళ్ళను చేసావా ? అల్లా అని ఏడుస్తూ రాముడిన అనుసరించింది రజియా .. “దైవ నిర్ణయం “ ఇది అని నిట్టూర్చారు రావుగారిదంపతులు ..
.................సమాప్తం................
..
No comments:
Post a Comment