Saturday, 11 May 2013
చల్లని స్వామి- మన చందనస్వామి
చల్లని
స్వామి-మాచందనస్వామి
సింహగిరులపైనవెలసినాస్వామి
చెయ్యెత్తి మొక్కితే దీవించుసామి-ఆలకించి మామ్మాదుకొనుస్వామి
వరాహరూపానవెలసినాస్వామి-నరసింహరూపాన్ని
కలిపినాస్వామి
నర మృగ
అవతార నృసింహస్వామి
చెయ్యెత్తి మొక్కితే దీవించుసామి
చల్లని
స్వామి-మాచందనస్వామి- చెయ్యెత్తి మొక్కితే
దీవించుసామి.
వరాహావతారంగా హిరణ్యాక్షు ద్రుంచి,
.భూమినిరక్షించి బ్రోచినావపుడు
హిరణ్యకశిపుడు నిలదీసిఅడుగ-బాలప్రహ్లాదుని,
ధర్మాన్నిగావ,
స్తంభం నుండొచ్చి రక్కసునిజంపి, ఉగ్ర
రూపముతోడ ఊగునినుజూచి
బ్రహ్మాదిదేవతలు ,రుద్రుడు,
మునులు, శాంతిపజూసినా చల్లబడకుండా,
భక్తుడగు ప్రహ్లాదు ప్రార్దనకుకరిగి- సింహగిరిపై వెలసి సేవలందేవు
కృతయుగ కాలపు గాధలివియ౦ట,
దేవతలు గుడికట్టి కొలచినారంట.
బ్రహ్మోత్సవాలు చేసినారంట,
సకలవైభవాలు చాటినారంట.
ఆనాటి ఆ కథలు ఆనందమంటా.అఖిలలోకాలు ముదమందునంట.
వైశాఖ శుద్ధ తదియనా డ౦ట,వరాహనరసింహునవతారమంట
ప్రహ్లాదుని బ్రోచివెలసినాస్వామి- తరతరాలట్లు
సేవలందినాడంట
చల్లని స్వామిమనచందనస్వామి ,
సింహగిరులపైనవెలసినాడంట
యుగములంతరి౦చి జగములు పోవ, ఆరాధనలు లేక అదృశ్యమయ్యి.
కృతయుగానా తీరు కోలువైనస్వామి-
కాలచక్రముతిరుగకన్నుమరుగయ్యె.
ఆరాధనలులేక
ఆకొండపైన, పుట్టలోపలయుండెతూర్పుకనుమలలో
ఆరుగురు
గొప్ప చక్రవర్తులలో- అదృష్టవంతుడగు
ఆపురూరవుడు
దివ్యవిమానములో తిరుగాడు చుండి, బంగాళాఖాతపు
తీరాన యున్న
సింహగిరులలోతిరుగాడుచుండ,అదేమిమహిమాయో
అద్భుతమోగాని
విమానమటనుండి కదలనేలేదు ,విస్తుపోయిన రాజు
పురూరవుండు
విషయమేమిటని ఊర్వశిని అడుగ ,దివ్యదృష్టితో
చూచినప్సరస
దేవదేవుడు
ఆ నృసింహస్వామి, వరహమూర్తిగా
వెలసినాడయ్య
స్వామిని వేడుకో శుభమునీకనిన ,అట్లేజేసెను ఆ
పురూరవుడు.
ఆనాటిస్వప్నాన ఆరాజు కలలో, వరాహనరసింహ స్వామికన్పించి
పుట్టలో ఉన్నాను బయిటకు తీయు, పూజలుజరిపించి
ప్రఖ్యాతిపొందు
అనిచెప్ప
ఆరాజు సంతోషమంది ,.మహద్ భాగ్యమని
మదిలోన తలచి
సహస్ర కలశముల జలములతోను, పంచామృతములతోపుట్టను
తడిపె.
జ్ఞానచక్షువుకు గోచరించేను. వరాహస్వామతని కానతిచ్చేను.
ఆజ్ఞనౌద లదాల్చిఆపురూరవుడు - మట్టితొలగించినంతమంచి
గంధమును.
స్వామిపైపెట్టి శాంతిజరిపాడు- తొమ్మిదిమణుగుల
గంధముపెట్టాడు.
ఆనాటినుండి ఆ పద్ధతిలో ముమ్మారు స్వామికి మూడుమణుగులలో
హరి చందనమునుపెట్టి అద్దుతుంటారు.వైశాఖపున్నమికి
ఒకటవ సారి
జ్యేష్టపున్నమికి రెండవసారి .ఆషాడపున్నమికి
మూడవసారి
శ్రీచందనమును శిరసునపెట్టి .నిత్యమూ చందనపు
పూతలుపూసి
స్వామినిగొల్చుట సంప్రదాయముగా- చేసాడుఆనాడుపురూరవుండు.
ఘనముగా
గోపురములన్ని కట్టించి, స్వామికి ఎన్నెన్నో సేవలుజేసే
వైశాఖ శుద్ధతదియ శుభదినము -చందనోత్సవమని
శాసనముజేసి
పూజలు జరిపెనాపురూరవుడు- అనుచుస్థలపురాణము
చెప్తోందిమనకు.
ఆనాటినుండి చందనోత్సవము- ఆ తిధిని జరుపుట ఆచారమయ్యే
సింహవల్లిగా లక్ష్మి సేవించు చుండ- ఆదినారాయణుడుఅవనిపాలించు
అంతియేగాక ఆచరిత్రజూస్తే, ఈనాటి ఆలయము క్రీస్తు పూర్వమున తొమ్మిదవశతాబ్ది
నాటికుందనుచు ,
పదమూడవశతాబ్దిప్రారంభమందు
పునరుద్ధరి౦ప బడినదని చరిత్రగలదు,
పాంచరాత్రాగమనపద్ధతిలోన
పూజలుచేస్తారు పురుషోత్తమునకు ,.ఉత్సవామూర్తిగా
గోవిందరాజు
శయనమూర్తిగామదన గోపాలుడున్ను.స్నపనమూర్తివేణుగోపాలస్వామి బలిమూర్తిగా
యోగానారశి౦హుడును, .చక్రపెరుమాళ్గాసుదర్శనుడును
కొలువుతీరగా మన నృశి౦హస్వామి-కన్నులపండుగ జేయు
చున్నాడు .
స్వామిమహిమలు పొగడ శేషునికైనా, శక్యంబుగాదు
మానవులదెంత?
బ్రహ్మాదిదేవతలు మునులు దిగివచ్చి-
కొలిచినస్వామికి మనకోలుపులెంత ?
అయిననూ ఆస్వామి అప్పన్న అనుచూ- అమాయకముగా
అనిననూగాని
తలచినాకోలిచినా తృప్తిని చెంది -కోరిన వరములు
కురిపించుతాడు’
పుష్కరిణిలోమునిగి- గన్నేరుపూలు వేసినా వెంటనే
కరుణించు తాడు.
గంగ ధారలలోన స్నానాలుజేసి, ఘనముగా స్వామికి
పూజలుజేసి
తులసిమాలలు వేయ తృప్తినిపొందు, అర్చనలు జేయగా
ఆశీర్వదించు’
చందనమునుపూసి సంపెంగపూల పూజలు చేసినా పొంగిపోతాడు
హరిహరీ నారాయణాది .నారాయణఅనిభజనలుజేయగాసంతసిస్తాడు
శక్తికొలదీపూజ భక్తితోమ్రొక్కు- మ్రొక్కగాకోర్కెలు తీర్చుతుంటాడు
కప్పస్తంభము నెల్లి కౌగలించుకొని- కోరితే కోరికలు
తీర్చుతుంటాడు
కోడెదూడ నొదిలి
కొత్తపంటలను- అర్పించి సేవింప ఆదుకుంటాడు
సంపెంగపూలతో పూజింప స్వామీ మనపై దయను వెదజల్లుతాడు
గిరిప్రదక్షనముచేయ గురుతుపెట్టుకొని అప్పన్న
అనగానే ఆదరిస్తాడు ..
రూపమేకోపము మనసెంతో వెన్న- వరాహనరశింహస్వామియేమిన్న
నిజరూపదర్శనము నిత్యమూగాదు,ఏడాది కొకసారే
చందనోత్సమున
చల్లనిస్వామి మా చందన స్వామి- తలచినా కొలచినా
దయచూపుతాడు .
ఈ చరితమువిన్న చదివినా స్వామి- సకలశుభములుగూర్చి
రక్షించుతాడు .
దండాలు దండాలు దండాలు స్వామీ దయగల తండ్రిమానరసింహ
స్వామి
పిల్ల పాపలనంత చల్లగా భ్రోచి కాపాడుచుండుమా
కడదాకా మమ్ము.
------------శుభం--------------------
ఆర్యా!
నమస్కారములు.
చల్లని స్వామి-మాచందనస్వామి సింహగిరులపైనవెలసినాస్వామి అనే ఈ
గేయకవిత నా ఊహాజనితం .ఎవరినీ
అనుకరించి
అనుసరించి వ్రాసినది
కాదు.నాస్వంతమని విన్నవించు కొంటున్నాను.
ఇట్లు
కవయిత్రి /రచయిత్రి, శ్రీమతి .దామరాజు .విశాలాక్షి
ఇంటినెం;
4/199, విద్యానగర్.గోపాలపట్నం,
విశాఖపట్నం-27.damaraju.visalakshi@gmail.com.
Wednesday, 16 January 2013
Saturday, 12 January 2013
సంక్రాంతిసంబరాలు
సంక్రాంతిసంబరాలు
ధనుర్మాసమనడంతో
సంబరాలుప్రారంభం
రంగురంగులతో రమణులు దిద్దే
రంగవల్లులతో ఆరంభం
తిరుప్పావై ప్రవచనాలతో
గోదా
సేవలు ప్రారంభం
ముద్దులొలుకు
ముగ్దలుదిద్దే
ముత్యాల ముగ్గులు ప్రారంభం
ఇంటిని
ఒంటిని అలంకరించుట
ఇంతుల కెంతో ఆనందం
గొబ్బిల్లంటూ గంతులేయడం
కన్నె పిల్లలకు సంతోషం
పండుగ కోసం పిండివంటలు
చేసే గృహిణుల సందోహం
అల్లుళ్ళతో కూతుళ్ళతో
ఇల్లిల్లు సందోహం
కానుకలిచ్చి పంపించుటలో
అత్తమామలకు ఆరాటం
పంటల కోతలు కుప్ప నూర్పులతో
రైతుల ఇళ్ళలో సంతోషం
గంపలకొలది దానముచేయుట
ఘనమని రైతులవిశ్వాసం
బుడబుక్కలతో
కొమ్మదాసరులతో
పల్లెవీదులలో సందోహం
హరిదాసులతో మేలుకోలుపులతో
తెల తెల్లవారే తీరంద౦
మరదలి వెంట పరుగులు పెట్టీ
బావల తీరు ఒక చందం ఒకఅందం
బావాబావా పన్నీరంటు
తిప్పలు పెట్టుట ఒక అందం
బంతి
పూలతో చేమంతులతో
పౌష్య లక్ష్మికి పేరంటం
సంప్రదాయము
ప్రతిబింభించే
సంక్రా౦తి పండుగ ఆనందం
పెద్దలకోలుచుట,
పధ్ధతి నీర్చుట
పండగ
జరుపుట లసలర్ధం
ఒకరిని
ఒకరు గౌరవించుట
ఈ పండుగ లోని పరమార్ధం .
చీరలు నగలు చూపుతు చూసే
స్త్రీలలో ఎంతో ఉత్సాహం
పది మందితో పంచుకు తినుటే
ఈ
పండగలోని పరమార్దం .
రావణకాష్టం రగుల్చుట కోసం
పిడకల దండల
పరిహారం
Saturday, 7 July 2012
Subscribe to:
Posts (Atom)