Sunday, 13 October 2024

దిష్టిబొమ్మ - దీపపుసెమ్మె (1) (2)

 దిష్టిబొమ్మ_ దీపపు  సెమ్మె .. 


“అలా దిష్టిబొమ్మలా గుమ్మంలో కూర్చోకపోతే, పొలిమేరల్లో తిరిగి ఆగాకరకాయలో, 

పెసర కాయలో ఏరుకురావచ్చుగా?  

కాలక్షేపం అవుతుంది,కడుపునిండుతుంది,

విసురుగా మామ గారి నుద్దేశించి  అంటోంది కోడలు విమల.


“ అవునమ్మా!!  ఆయన తీరికగా తిని 

అరక్క ఇంట్లో కూర్చున్నారుగా ?

మరి,అరగాలంటే అలా తిరిగిరావాలి బాధగా అంటోంది  అత్తగారు   గున్నమ్మ” .


ఓయబ్బో ! పౌరుషానికి ఏమి తక్కువ లేదు.. పిల్లలకు ఆగాకరకాయలంటే ఇష్టం. 

ఆ తాటిపెండెలలో దొరుకుతాయి .

24 గంటలు వీధి గుమ్మంలో ఆఅరుగు మీద

 పడి అలా దొర్లకపోతే ,

కాలారా తిరిగి రావొచ్చు కదా  అన్నాను. 

అది తప్పేనా?

తీరిగ్గా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి తప్ప ,

 ఒక్క మాట అనే హక్కుకూడా మాకు లేదు…

 హక్కులేదు   అనకూడని మాటలు అంటూ, అర్ధాంతరంగా వచ్చిన సిరితో, అదిరిపోతోంది విమల”..

“ధనం దర్పాన్ని తీసుకొస్తుంది అనుకున్నాను గానీ, ఇలా దయ జాలి లేకుండా, మనుషులను 

మార్చివేసి , మానవత్వం లేకుండా మంచి చెడు విచక్షణ లేకుండా,మదమెక్కి తిరిగేలా చేస్తుందని, కలలో కూడా అనుకోలేదు అనుకున్నారు

 ఈ సంభాషణ అంతా వింటున్న విమల మామగారు విశ్వనాధం..

నీరసముగా ఉన్నా, తప్పవని ఆనుకుని 

 కండువాదులిపి భుజానవేసుకుని ఆగాకరకాయలు తేడానికి, అన్నం రాజు వారి తోటవైపు బయలుదేరారు..

             కర్ర ఊత పట్టుకుని నడుస్తున్నారు

 విశ్వనాధం,  ,కన్నీటి తెర లడ్డుకొని  తోవకూడా కనబడడం లేదు..

“ఇంత బతుకు బతికి  ఇంటివెనక చచ్చినట్లు, అయ్యింది తన పరిస్థితి”ఇంతలో ఎంత మార్పు?


 మూడేళ్ల క్రితం  వరకూ ,తను  పేరుపడిన  పెద్ద అకౌంటెంట్ .అకౌంట్స్ లో తన సాయంకావాలని,   సలహాలు చెప్పమని,  ట్యూషన్ చెప్పమని వచ్చిన వారి ని, ఇంట్లో పెట్టుకుని మరీబోధించేవాడు..

తనకు అంత పేరు ఉండేది  అకౌంట్స్ లో. 


తను సంపాదించినంతకాలం ,ఇల్లు నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉండేది.

తన భార్య గున్నమ్మకూడా  లక్ష్మీదేవిలా  కళకళలాడుతూ ఉండేది…

” పూచిన తంగేడులా” ఉండేది. 

ఆ పుణ్యాత్మురాలు  నిజంగా, తన వలనే నేడు  *దీపపుసెమ్మె* లాగే. మిగిలింది..

 తను ఇంటికి “దిష్టిబొమ్మలా” మారిపోయాడు  

ఈ ఇంటి దీపం..  నా కంటి వెలుగు.. కాంతులీనుతూ ప్రకాశించి, వెలుగులు వేదజిమ్మే పున్నమి రాత్రి లా ఉండేది గున్నమ్మ .

మరి ఇప్పుడు  ?  

కాయలు పండ్లు కొమ్మలు రెమ్మలు అన్ని అందరికీ పంచి , శిశిరంలో ఆకు రాల్చిన చెట్టులా, ఎండిపోయిన మోడులా,   మిగిలింది..

“ తన వల్లనే.. కేవలం తనవల్లనే అను కున్నాడు విశ్వనాథం”..

తను మాత్రం బాగున్నాడా?   తన వాళ్లే సర్వస్వం అనుకొని,పిల్లలపై   అంధప్రేమతో ధృతరాష్ట్ర 

వ్యామోహంతో,సర్వం అర్పించి ,  చిగురు లేని మొడులా , శిధిలమైన గూడులా మిగిలాడు..

        “దాయాదులు  పరాయివాళ్ళు మోసం చేస్తారని, అన్యాయంచేస్తారని  తనకుతెలుసు. గానీ!కడుపులో పుట్టిన పిల్లలే , కన్న వాళ్ళని ఇలామోసం చేస్తారని, అదీ నమ్మించి మోసం చేస్తారని,జీవితంలో తెల్సుకోలేకపోయాడు….”


అందరి లెక్కలు అంతా కచ్చితంగా వేసే

తను, తన లెక్కలో తప్పుటడుగు వేసాడు”..


 పరాయి వాళ్ళ చేతుల్లో మోసపోయినా ఆ 

 బాధ , మర్చిపోగలం..

కానీ !తనవాళ్లే తనని మోసం చేసారు, 


ఆ విషయం తలపుల్లోకి  వచ్చినప్పుడల్లా,  

గుండెలను దహించివేస్తూనే ఉంటుంది..


      రిటైర్మెంట్ రోజు  పిల్లలు చేసిన హడావిడి చూసి ,ఈ ప్రపంచంలో తన అంత 

అదృష్టవంతుడు లేడని మురిసిపోయాడు.


.ఉద్యోగం చేసినంతకాలం ఎంతో వైభవంగా బతికాడు!

ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ పెన్షన్ ఉండదు.

 

అంత పెద్ద ఉద్యోగం చేసిన పి. ఎఫ్ వాడిచ్చిన 1500/  పింఛను.


 రిటైర్మెంట్ వలన వచ్చిన,డబ్బుతో,

హాయిగా జీవితం గడిచిపోతుందనుకున్నాడు.


ఈ విశ్రాంతి సమయంలో , ధర్మబద్ధంగా  ,ప్రశాంతంగా జీవించాలని, 

పదిమందికి సాయపడాలని కలలుకన్నాడు. 


బాధ్యతల వల్ల  అప్పుడు ఎక్కడికి వెళ్ళ లేకపోయాడు. 

ఇప్పుడు భార్యకోరికతో  తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు..

పిల్ల పాపలతో చల్లగా సంతోషంగా గడపాలని అనుకున్నాడు ఎ.న్ని కలలుకన్నాడు?…


 తన కలలన్నీ కల్లలయ్యాయి.. 


సంవత్సరం కాకుండా కోరికలన్నీ సజీవ సమాధి అయ్యాయి..


రిటైర్ అయిన మూడేళ్లకే  తన భార్య  ముసలి  ముత్తయిదువుగా  మారిపోయింది.


 నవనాడులు  క్రుంగిపోయిన తను  కర్ర ఊతపట్టుకుని కాలక్షేపం చేస్తున్నాడు..


ఇదంతా!తన స్వయంకృత అపరాధం.


 నాన్నా !  ప్రాణంమీదికివచ్చింది .అవసరానికి ఆఫీసుడబ్బు వాడాను,అరెస్టు చేస్తారేమో,? భయంగా ఉందిఅర్జంటుగా !

నువ్వు సర్దకుపోతే నన్ను ఆదుకునే వారు లేరు. బేంకు వాళ్లిచ్చిన వడ్డీ డబ్బులు, నేనే ఇస్తానని, పెద్దకొడుకు పాతికలక్షలుతీసుకున్నాడు..


వ్యాపారంలో నష్టమొచ్చింది .ఇరవై లక్షలు  ఇస్తే,,

బేంకువాల్లకంటే ,వడ్డీ ఎక్కువ ఇస్తానని మిగతాది తీసుకున్నాడు చిన్న కొడుకు..


పిల్ల పెళ్లిచేయాలి నాన్నా! అని కూతురు అవసరానికి దాచుకున్న పదిలక్షలు తీసుకున్నాది .

.

భార్య పేరుని కొంత దాచాలన్న ఆలోచన కూడా తనకు రాలేదు.. 

ఆమె అంటూనే ఉంది.

 బంగారము భాగ్యము ,ఏదో ఒకటి మన దగ్గర ఉండకపోతే, భవిష్యత్తు కష్టమవుతుంది ఆలోచించండి అని.


 తనే మూర్ఖునిలా ఆమెమాట పెడచెవిని పెట్టాడు .


మన పిల్లలకు మనం చూడకపోతే అవసరాలు ఎవరో ఆదుకుంటారు అన్నాడు.. 


మాకు ఇవ్వడం అమ్మకి ఇష్టం లేదు .


ఈ తల్లి అయినా ఇలా మాట్లాడుతుందా?

 అని పిల్లలు ఆమెను ఆడిపోసుకున్నారు.


 తనవలన పిల్లల దగ్గర చెడ్డ అయింది.. 


తను  ఆమెకు చెడ్డ పేరు మాత్రమే మిగిల్చాడు.


సంవత్సరము వరకూ ,వడ్డీ అప్పుడప్పుడు ఇచ్చి యిచ్చి, ఆపై మీ భారమంతా ,మాదే కదా ?


మీకు ఖర్చేమిటని? వడ్డీ కూడా ఇవ్వడం ఆపేసారు


అసలు ఆ సంగతి ఆలోచించలేదు కూడా..;


కోడళ్ళు,.మీకు పెద్ద కొడుకు, కోడలు అంటే ఇష్టమని చిన్నవాళ్లు


, . మీకు చిన్న కొడుకు, భార్య అంటే ఇష్టమని పెద్దవాళ్లు  ,దెప్పడం మొదలుపెట్టారు.


వారి సాధింపులతో పాటు ,

తము శక్తి ఉన్నంతవరకూ చాకిరీ చేయాలని నిర్ణయించారు ,

,కూతురు అంతా కొడుకులకు ఇచ్చేసారు .

 అవసరానికి మనమా అని అంటున్నారు ,మీఅల్లుడుఅంది ..

వైద్యకోసం వారింటికెల్తే  .


ఇప్పుడు తమ పరిస్థితి అద్వాన్నం గా  ఉంది అల్లోచిస్తూ నడుస్తున్న విశ్వనాధంగారు. ..ఒక కారు అత్యంత వేగంగా తన నా పక్కనుండే దూసుకుపోవడంతో  ఆ కంగారులో  తూలి తుప్పల్లో పడిపోయారు..  వెళ్లినంత వేగంగా వెనక్కి వచ్చిందా కారు..

డ్రైవర్ వచ్చి  రోడ్డుమీదనడుస్తున్నప్పుడు చూసుకోనక్కర్లేదా ? నేనుతప్పించాను, కాబట్టిసరిపోయింది .

లేకపోతే నా కారు కిందపడిపోయి నన్ను జైలుపాలు చేసేవాడివి, అనివిసుకుంటూనేలేపాడు.

.ఇదంతా చూసిన కారులోఉన్న  వ్యక్తి వచ్చి,విశ్వనాథంగారిని చూస్తూనే విస్తుపోయాడు.. 

 క్షమించండి గురువుగారూ,. నేను మీప్రతాప్ ని . మీరేనా ?నేను మీ దగ్గరికేవస్తున్నాను. 

నేనుఇప్పుడు హైదరాబాదులోచార్టర్ అకౌంటెంట్ గా స్థిరపడ్డాను..

 మీ దగ్గర అకౌంటింగ్  నేర్చుకున్న నేను, పట్టుదలతో సి.ఎ..చేసి ఈ స్థితికి చేరాను…కాలేజీ పెట్టాను.

నాకూతురుపెళ్లికివచ్చిన  మన  సుదర్శన్  ,మీరు ఈ ఊర్లో ఉంటున్నారు రిటైర్ అయిపోయారు అని చెప్పాడు....వాళ్ల చెల్లెలు ఈ ఊరిలో ఉంటుందిట కదా! మీ పరిస్థితి మొత్తం అంతా చెప్పాడు..

రండి కార్లో కూర్చుని మాట్లాడుకుందాం అని,కార్ల కూర్చోబెట్టి,,తనే ఫస్ట్ ఎయిడ్ చేసి,  సేద తీర్చాక,  

మంచినీళ్లు ,బిస్కెట్లుఇచ్చి ,,డ్రింక్  ఇచ్చి సేద తీశాడు .

.మేమిద్దరం ఈ చెట్టు  కూర్చుని మాట్లాడుకుంటాం..నువ్వు అక్కడ ఎవరిరైనా అడిగి ,వారితో పాటు వెళ్ళు .వాళ్ళింట్లో మాస్టర్ ఇలా పడిపోయారనిదెబ్బలు తగిలాయని  చెప్పు..నువ్వు డ్రైవర్ అని చెప్పకు.. కారు దూరంగా ఆపి అమ్మగారిని కార్ల తీసుకురా అన్నాడు ప్రతాప్.. 

అలాగే సార్ అని వెళ్లాడు ఆ యువకుడు…వద్దు నాయనా! తను చాలా కంగారు పడుతుంది..

 నా మాట విను నేను వెళ్ళిపోతాను ఇంటికి అన్న మాస్టారుతో..మాస్టారు. మిమ్మల్ని అమ్మగారిని తీసుకెళ్ళి

 నాతో పాటు ఉంచుకుందామని నేను వచ్చాను.ఇది నేను మీకు ఉపకారం చేస్తున్నట్టు కాదు నా పరిస్థితులు బట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. భగవంతుని దయవల్ల మీరుపడిపోవడంకూడా  మేలేజరిగింది. 

మీ వాళ్ళు ఎవరైనా వస్తే, కొన్నాళ్ళు వైద్యం చేయించి పంపుతాననిచెప్తాను.. 

నా భార్య  తల్లిదండ్రులు ఇద్దరు యాక్సిడెంట్ లో పోవడంతో నా భార్య మంచం పట్టింది బెంగతో.. 

డాక్టర్లు తనను ప్రేమగా చూసుకునే పెద్దవాళ్ళుఉంటే కోలుకుంటుంది అన్నారు. మా అమ్మ కూడా ఆరు నెలల క్రితం చనిపోయింది.. నా శ్రేయస్సు కోరేవారు నాకు మీరు అమ్మగారు తప్ప ఎవరూ లేరు. అందుకే అభ్యర్థించడానికి వచ్చాను అన్నాడు చేతులు పట్టుకుని.. భగవంతుడే ప్రతాపను పంపాడేమో అనుకుని తండ్రిని లీలలు అనుకున్నాడు విశ్వం . నా పిల్లలు కూడా చిన్నవాళ్లు. మీరు నాకు సలహాదారుగా కూడా ఉండొచ్చు.

నా ఇంటి పక్కనే ఒక చిన్న  ఇల్లు పెద్ద వాళ్ల కోసం కట్టించాను. అందులో మీరు హాయిగా ఉండొచ్చు నా మాట కాదంటే నాపై ఒట్టేఅని ప్రతాప్ పట్టుపట్టాడు. అన్ని ఆలోచించే సరేనన్నారువిశ్వంగారు.

……………………………………….

వీధిలో మంచం పై ఒడియాలు ఎండపెడుతున్న గున్నమ్మ  , పక్కింటి  పంతులుగారి అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, అత్తయ్యా , మామయ్యగారు పొలం దగ్గర కారు గుద్దితే పడిపోయారట.మిమ్మల్ని తీసుకురమ్మని అదిగో కారు పంపారు అర్జెంటుగా రండి అని చెప్పాడు..

అయ్యో, భగవంతుడా! ఏమైందని ,?నీరసంగా ఉన్నారు వెళ్ళొద్దనే అంటున్నాను .పౌరుషం పడివెళ్లారు.

ఏం జరిగిందయ్యా ? అని ఏడుస్తూ,నెత్తి కొట్టుకుంటున్నారు గున్నమ్మ.,

సీరియస్ గా సీరియల్ చూసుకుంటున్న కోడలు విమల వచ్చి., మీరు ఎక్కువ మాట్లాడకండి.. ఈ సోదంతా చెప్పకండి?.. యాక్సిడెంట్ అంటున్నారు. పోలీసులు కేసులు. నాకు అసలే ఒంట్లో బాగాలేదు.

 నాలుగు అడుగులు కూడా వేయలేను.. మీ కొడుకు ఊర్లో లేడు.నా కొడుకుచిన్నవాడు. పోలీసులు చూస్తే  బాడీభవిష్యత్తు పాడైపోతుంది.. ఆ కార్లో  మీరెల్లి ,ఆ డ్రైవర్ ఇదే తప్పని, నెత్తి నోరుమొత్తుకుఅక్కడ ఏడవండి.

బాగా డబ్బులగుంజండి..ఆసుపత్రి  ఖర్చు వారినే భరించమనండి.. మీకొడుకులకు ఫోన్లు చేయకండి… 

నేను మీ చిన్న కొడుక్కి కోడలికి ఫోన్ కూడా చేస్తాను..మీ అబ్బాయి వచ్చాక, మీరు ఫోను ఎక్కడున్నారో నాకు చెప్తే వస్తాము. .మీ ఆయనకు ఎలా ఉన్నా మీరు ఇక్కడికే రావాలి . జాగ్రత్తా! నేను పంపినట్లు ఎవరితోనైనా 

 చెప్పవద్దు.అని దుర్మార్గంగా హెచ్చరించింది..కనీసం గదిలోంచి బయటకు కూడా రాకుండా.విమల….

    ఏమీ చేయలేని,అసక్తతతో, అసహ్యంగాకోడల్ని చూసి, ఆయనకేమీ కాదమ్మా!నువ్వు భయపడకు.. 

బాగున్నా లేకపోయినా మేము తిరిగి ఇక్కడికి రాము. ఇకపై మీకు ఎవరికీ భారం కాదల్చుకోలేదు..

 భగవంతుని నమ్ముకుని, మా బతుకేదో మేము ఎలాగోలా బతికేస్తాం.  . నీ పేరు చెప్పను.

 సరి కదా! మీరందరూ ఉన్నారన్న విషయంకూడా మరిచిపోతాము. సరేనా !అని ఏడుస్తూ ,

వెళ్లి ,కారులో కూర్చుంది గున్నమ్మ.చాగా నిల్చనిఅంతా విన్న డ్రైవర్ ఆశ్చర్యపోయాడు..స్త్రీలలో

 ఇంతటి దుర్మార్గులు ఉంటారా? అనుకున్నాడు.సార్ గారికి ఏమీ కాలేదమ్మా మీరు ఏడవకండి. సారీ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు డ్రైవర్. మాస్టర్ ని చూసి బోరున ఏడుస్తున్న గున్నమ్మ గారి పరిస్థితి తను చూసింది

ప్రతాపకు జరిగిందంతా”పూసగుచ్చినట్లు “చెప్పాడుడ్రైవర్.. 

వెక్కివెక్కి ఏడుస్తున్న గున్నమ్మ గారితో, అమ్మా! ఏడవకండి మాస్టారికి ఏమీ కాలేదు. మీ పరిస్థితి అంతా తెలిసి , మిమ్మల్ని అలా తీసుకురమ్మని నేనే చెప్పాను క్షమించండి.. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. 

మీకు గుర్తుందా లేదో? గానీ!నాకు బాగా గుర్తుంది.. మీ చేత్తో పెట్టిన అన్నం తిని, మీ వరండాలో నిద్రపోయి, 

బీకాం మూడు సంవత్సరాలు మాస్టారు చేత అకౌంట్స్ చెప్పించుకుని, ఈరోజు ఎంత ఉన్నత స్థితిలో నిలబడ్డాను... నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ చనిపోయి ఆరు నెలలు అయింది.

మా అమ్మ స్థానంలో మిమ్మల్ని చూసుకుంటాను. తల్లి తండ్రిని కోల్పోయిన నాభార్య కూడా తల్లిగామారి 

.నా ఇంటి జ్యోతిని నిలబెట్టండి. అందుకుమీ సాయం కావాలి. .నా మాట కాదనవద్దు..

 నేను ఏదో మిమ్మల్ని ఉద్ధరించడానికి తీసుకెళ్తున్నానని నేను భావించడం లేదు.. మీరు తప్ప నా ఆదుకునేది ఎవరు లేదని ఉద్దేశంతో మిమ్మల్ని వెతుక్కుని వచ్చి తీసుకెళ్తున్నాను. ఇప్పటికీ మీరు సాయం చేసే స్థితిలో ఉన్నారు నేను అభ్యర్థించే స్థితిలోనే ఉన్నాను. అన్నాడు అనుకోవుగా ప్రతాప్

కారు కదిలిపోయింది.. ఊరి పొలిమేరలతో పాటు తమ కష్టాలు కూడా కనుమరుగైపోయాయి అనుకున్నారు విశ్వం దంపతులు…..

ఇప్పుడు ఆ “దీపపు సెమ్మె” తళతళలాడుతూ , ప్రతాప్ ఇంట  జ్యోతి వెలిగించడానికి,

 ఆ “దిష్టిబొమ్మ”   దిశా నిర్దేశం చేసే, మార్గదర్శి అవ్వడానికి  నిశ్చయించుకున్నాయి…. సమాప్తం…….


















 నమస్కారములు..

  దామరాజు విశాలాక్షి అనే నేను పంపించుచున్న

“ దిష్టిబొమ్మ_ దీపపు సెమ్మె” అనే ఈ కథ ఎవరిని అనుసరించి గాని అనుకరించి గాని రాయలేదని. కేవలము నా ఊహాజనితమని,ఎచ్చట ప్రచురింపబడలేదు,ప్రసారం కాలేదని, కేవలము మీరు నిర్వహించుచున్న పోటీ కొరకు రాశానని, విన్నవించుకుంటున్నాను

ఇట్లు విధేయురాలు,దామరాజు విశాలాక్షి. విశ్రాంత ఉపాధ్యాయిని. చరవాణి:  9 0 1 0 9 0 2 7 9 4

 మెయిల్ ఐడి.damaraju.visalakshi@gmail.com . 






మనకవి

                                                 మనకవి –మహాకవి 

తల్లి కౌసల్యయు  తండ్రి రామదాసు                                                                                 తపమేమిచేసిరో దాని ఫలము

 వారింaటపుట్టిన వరప్రసాదియగు 

అప్పారావు జగద్విఖ్యాతి గాంచె. 

వంశాభ్దిచంద్రుడై వజ్రసంకల్పుడై 

ఉదయించె గురజాడ  ఉర్విమీద 

నాడుపడెను ఏమో !

నవ్యతకుబీజాలు 

చిన్నిశిశువు తలలో చిత్రమగుచూ 

దుందుభి వత్సరము  భాద్రపద మాసపు శుద్ధత్రయోదశి  ఆదివారమందు ,గురజాడ జననము గురుతుగామిగులుటకు                                                                                               నాంది పలికెను  నాటిభాగ్యమేమో!                                                                                                          బక్కపలచగ యున్న బహుచురుకుగానుండి  బాల్యమందునబహుశ్రద్ధగాను                                                                                          గమని౦చినడు

గురుతుగా మెలగుతూ                                                                            విద్యార్ధిగా మంచి పేరుగాంచె బాల్యములో కోయదొర బ౦గారముగ                                                                                  మట్టిని మార్చి ఇచ్చెదనని చెప్పి                                                                                 చిన్న  పిల్లల యొక్క ధనము దోచ 

అతని సంచి నుండి అందరి సోమ్మును                                                                                                తీసి పిల్లలకు తిరిగి యిచ్చె

 మోసమనుచు  ఏడ్చు 

 కోయదోరనుచూసి

 కోరికతోమట్టి ఇచ్చి                                                                          బంగారముగvమార్చి                                                                                    బ్రతుకు గడుపు 

కాని మోసముతో                                                                                      బ్రతికిన  బ్రతుకు హీనమనుచు బుద్ధిచెప్పె నా కోయవాడి కపుడు                   

అతనితోపాటుగా ఆదర్శభావాలు

అభివృద్ధి చెందగా ఆశయముతో

సాహిత్యరంగమును సాధనముగా చేసి ఆ౦గ్లమందున తొలి రచనజేసె.

అపార ప్రజ్ఞగల అప్పారావు కు పరభాషలో  ప్రజ్ఞ చూచి నట్టి  సంపాదకులు శంభు చంద్రముఖర్జీ

 గురజాడ ప్రతిభను గుర్తించి పిలిచి  

మాతృభాష లోన మంచి రచనలు జేయ రాణించ గలవనుచు  చెప్పగాను  

మాత్రుభాషలోనె మంచిరచనలు జేసి సామాజిక సేవ చేయదలచె 

బాల్యస్నేహితుడు గిడుగు బాసటనిలువ 

అగ్నికాజ్యము వోలె విజ్రుభి౦చి

                                                                           ప్రజలకర్ధమగు వాడుక భాషకు 

పట్టముకట్టగా నడుముకట్టె

సాహిత్య సృష్టియే సాధనముగా తలచి 

సారంగధరతో ఆరంభమిచ్చి 

ఆంగ్లము న ప్రతిభున్న అమ్మభాషలోన

అద్భుతరచనలకు  పూనుకొనెను

ఆనందగజపతి కొలువులో  నౌఖరి 

ఆశయమునకు అ౦డనిలువగాను 

అద్భుతరీతిలో ఆనాటి పరిస్థితులు 

దృశ్యకావ్యమువోలె  తీర్చిదిద్దె

కొండుబట్టీయము నీలగిరి పాటలు 

కన్యాశుల్కపు తొలి కూర్పు కూర్చి  

దురాచారములపై  దుమ్మెత్తి పోయుచు 

భాషా సంస్కరణలకు పూనుకొనెను 

బాల్యవివాహములు బలవన్మరణములను 

దౌర్జన్యములు,  దుర్మార్గములనన్ని

నాటకమును వ్రాసి,అందు  పొందుపరచి                                                                    మూఢఆచారములపై

తిరుగుబాటు చేసె ….

చీకటిమాటున శృంగార చేష్టలతో  

తప్పుడు పనులు చేసి తృప్తి నొంది ,

వెలుగులోనికి వచ్చి నీతులు చెప్పెడి, 

ప్రబుద్ధులకు గట్టి బుద్ధి చెప్పె.

కన్యాశుల్కపు  తొలి కూర్పును కూర్చి                                                                        దురాచారములపై దుమ్మెత్తిపోసి                                                                 

ఆధునికభాషకుఅంకురార్పణజేసీ 

ఆనందగజపతికి అంకితమొనర్చె 

                                                                                          ముత్యాలసరములు ముదముతో రచియించి 

దేశభక్తి జాతియందు నిలిపి

విశ్వ జనీనమైనభావములనన్నిటిని 

వెలయించి ప్రేమకు విలువ చెప్పె

మాత్రా ఛ౦దస్సులోముత్యాలసరమును 

అపురూప కావ్యముగ తీర్చిదిద్ది 

పూర్ణమ్మ కన్యక వంటి వారినిజూపి

స్త్రీల బ్రతుకులలోని చితిమంట లాపె..

ఆధునిక స్త్రీచరిత్ర తిరిగి 

వ్రాయగలదనుచును

 విశ్వసి౦చి వారి నుద్ధరి0చ

ఆత్మవిశ్వాసముగల అద్భుతస్త్రీపాత్ర 

లెన్నిటినో సృష్టించి   వెన్నుగాచె  .

బాల్యవివాహములు బలవన్మరణములు

దౌర్జన్యములు  దుర్మార్గములనన్ని

బట్టబయలు చేసి  బుట్టదాఖలుజేయు 

ప్రబుద్ధులకు బుద్ధి చెప్పనపుడె

కన్యాశుల్కమను నాటక  రాజములో                                                                       పాత్రల  రూపాన బ్రతుకు జూపి 

 లోకుల పోకడలు  తెలియజేసెను నాడు                                                                  కమనీయనాటక రాజమందు . 

అపూర్వసృష్టియగు అందలి పాత్రలు 

హాస్య వ్య౦గ్య  సందేశ భరితమగుచు 

విశిష్టనాటకముగ   విశ్వజనీనముగ 

విశ్వవేదికపైన  విలసిల్ల నిలిచె 

ఆ నాటిసాంఘిక దురాచారముల నన్నిటిని 

పాత్రలరూపములో  పరిచయముచేసి 

ఆనందగజపతిని ఆనాటి  పెద్దలను 

మెప్పించి  గొప్పగా  పేరు గాంచె 

బాల్య వివాహములుబూటకపు వేషములు

బ్రూణహత్యలు   భూత ప్రేత భయము 

తప్పుడు సాక్ష్యాలు తంపులమారులు

వేశ్యాలంపటాలు ఎత్తి చూపె

అంగాంగ వర్ణనల  నావలికి నెట్టేసి                                                                          శ్రుంగార చేష్టలు భంగపరచి                                                                      విలాసముల పట్ల వ్యగ్రత కల్గించి 

కచేరి కార్యములు కల్పితము చూపి 

పరమతదూషణలు  పాపమనుచు చెప్పి 

సంస్కరణల  వైపు  సాగివచ్చి 

గురజాడ ఆనాడు  గురుతుగా  జనులకు 

ఘనమైన రచనలు  చేపెట్టి వ్రాసె

ఆధునిక  కవిత్వా౦బుధిలో జొచ్చి 

అపురూప కావ్యసంపదలు తీసి

ఆధునిక కథకు  ఆద్యు డై గురజాడ 

అందించె  ప్రేమతో దిద్దుబాటు 

 మంచి చెడ్డలు లోకమందున                                                                                     ఎంచి చూసిమంచిత్రోవన 

తానూ నడిచి నడిపించినట్టి 

నవయుగ వైతాళికుడు మహాకవి 

శారీ రకముగా బలహీనుడైనా 

మానసికముగా మహాదృఢముగా 

నిలిచి   భావి తరములకొరకు

బాటలేసె  గురజాడ  

మనసున్న మారాజు  మహాకై గురజాడ వారికి నివాళులర్పిస్తూ 

  శ్రీమతి దామరాజు విశాలాక్షి  విశాఖ పట్టణం  ph no ;9010902794

  0891-2792984






 



   




 



  




  










 














 



   




 



  


భాషావైభవం

 


:శీర్షిక "యుగయుగాల తెలుగు జగమంతావెలుగు వ్యాసం ." 

అంశం..".తెలుగు  సాహిత్యం  మనుగడ.."

    -------------------------------------- 

            మన మాతృభాష తెలుగు.అమ్మను అమ్మభాషను అమ్మ సంస్కృతిని  ఆదరించి సేవించి తరించే మహోన్నతసంస్కృతి మనది.గతచరిత్ర వైభవం గమనిస్తే తులనాత్మక పరిశీలన చేసుకుంటేనే,మనుగడ  తెలిసుకొని మందడుగువేసేది.

అమ్మభాషను. ఆదరించి అగ్రస్థానంలో నిలబెట్టవలసిన బాధ్యత తెలిసి  ఆ భాషామతల్లి బిడ్డలలైన  మన అందరిపైనా ఉంది .. .     

జాతి జాతి నంతటినీ  జాగృతినొందించి జయపతాకాన్ని రూపొందించి  ఎగురవేసిన రాజులు 

కవిపండిత పోషకులు భాషాభిమానాలను గురించి తెలుసుకుంటేనే పోరాటపటిమ పెరిగేది

ఆర్ధ్రతనిండినభాష ,ఆప్యాయతచూపెడిభాష.ఆసక్తిని పెంచెడిభాష ఆనందం నింపెడిభాష ,అన్నిభాషలను కలుపుకు పోవుటకు ,అనుగుణమైన అమృత సమమైన  మన మాతృభాష  తెలుగుభాష. అలాంటి మనమాతృభాష  గురించి చెప్పుకోవాలంటే  మహాగ్రంథ మౌతుంది.  

    భారతీయ భాషా కుటుంబాలలోనే గాక  ప్రపంచభాషా కుటుంబాలలోనే అతిపెద్ద భాషాకుటుంబము ద్రవిడభాషాకుటుంబము .ఈ ద్రావిడభాషాకుటుంబము దక్షిణ భారత దేశమంతటా వ్యాపించింది.. ..దీనికి నాలుగువేల సంవత్సరాల సుదీర్ఘచరిత్ర ఉంది.. .

 ద్రావిడభాషాకుటుంబములలో తెలుగుభాషకు చాలా సుదీర్ఘమైన చరిత్రఉంది .ద్రావిడభాషాకుటుంబములోతెలుగుమాట్లాడేవారిసంఖ్య ప్రథమంగాఉంద  

అయితే!  అంతరించిపోనున్న భాషలకు కూడా మన భాష అతిచేరువగా వెళ్తోందిఅనే ఆందోళన   వాదన   కూడా  లేకపోలేదు.మేధావి వర్గాల అంచనా ప్రకారం  పరాయిభాషల. ప్రభావంలో కొట్టుకుపోతున్న మన మాతృభాషకు.మనమే మనుగడ లేకుండా చేస్తున్నాం...

అలాటి వారలో మనమే. ముందంజలోఉన్నాము ఈమాట”నూటికినూరుపాళ్ళూ”నిజమే.దీనికి “కర్ణుని చావుకి ఉన్నట్లు కారణాలుఉన్నాయి.

తెలుగు నేలమీద భాషమనుగడకోసం నేటికీ తెగించి పోరాడుతున్నవారుఉన్నారు ....

ప్రభుత్వాలతో మొదటినుండీ యుధ్దాలు చేస్తున్నవారూ ఉన్నారు.. అయితే !ఆ సంఖ్య చాలా తక్కువ . ఈ భాష పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటేనే  ఈ   భాషను ఎందుకు కాపాడాలో. మనకు అర్థం అవుతుంది...ఆంధ్ర లేదా తెలుగు  భాషకు పర్యాయపదాలుగా  ఆంధ్ర,తెనుగు,తెలుగు,పదాలు వాడుకలో ఉన్నాయి. ఆయాకాలాల్లోజాతిపరంగా దేశపరంగా భాషాపరంగా ఇవి ప్రసిద్ధిని పొందాయి ..మొట్టమొదటిసారిగాకీస్తుపూర్వం.  ౬౦౦.    600 ప్రాంతానికి. చెందినఐతరేయ బ్రాహ్మణంలో“ఆంధ్రపదం”జాతివాచకంగా. ఉపయోగింపబడింది.   

వ్యాసమహాభారతంలో కూడా  ఆంధ్రపదం   జాతివాచకంగా   కనిపిస్తుంది. వాల్మీకి   రామాయణంలో “ఆంధ్రశబ్దం” దేశవాచకంగా కూడా.  కనిపిస్తుంది. .

భాగవతంలో బలికుమారులు ఆరుగురిలో “ఆంధ్రుడనేవాడు” మన ఆంద్రరాజ్యం స్థాపించినట్లు చెప్పబడింది .బౌద్ధ వాజ్మయంలో పాళీ గ్రంథంలో “అంధరకట్ట “అనే పదాన్ని ఆంధ్రరాష్ట్రమన్నారని , ఆంధ్రులు, అంధకులు ఒక్కటేనని మల్లంపల్లి సోమశేఖర శర్మగారు పేర్కొన్నారు . అనేకశాసనాలలో అదే ఉన్నదట ..ఐతరేయబ్రాహ్మణకథనంబట్టిఆంధ్రులు“విశ్వామిత్ర”సంతతికచెందినవారనివిశ్వామిత్రుని శాపంవలన వింధ్యపర్వతాలకు దక్షిణంగా వెళ్ళారని తెలుస్తుంది ..

 త్రిలింగ నుండి తెలుగు అనేపదం పుట్టినదని రెండవ కాకతీయప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాదుడు అనుకవి వ్రాసారు.నాటి ఆంధ్రదేశంలోని త్రిలింగములనబడెడి శ్రీశైలము ,కాళేశ్వరము, భీమేశ్వరముఅను త్రిలింగముల నడుమప్రదేశము తెలుగునేల. .తెనుంగు ,తెలుంగు,తెలుగు గా పేరుపొందింది.ఒక విశిష్ట జాతిగాతెగలసమాహారంగా. తెలుగు చరిత్రేకాదు,

ఆచరిత్రకు పునాదులెత్తిన  మనభాషాచరిత్ర కూడా. మహోజ్వలమైనదే.    ఆంధ్రజాతి ప్రశస్తికి, తెలుగుభాషా ప్రశస్తికి , ఆనవాళ్ళుగా క్రీ: పూ :౩౦౦ నాటికే కళింగం మొదలుకొని 

ఆకొననుండి ఈకొనదాకాఆంధ్ర జనపదాలు. ఆంధ్రనగరులూ వెలిసాయి..క్రీ:పూ :633 నాటికే బ్రాహ్మీలిపిలోభాగంగా తెలుగు బ్రాహ్మీ అవతరించింది

..బ్రాహ్మికి ప్రాచీనతెలుగు ఆధారమని కొందరతమిళ పండితుల విశ్వాసము .క్రీ:శ: ౧ వశతాబ్దమునుండి సాహిత్యభాషగా తెలుగు పదసంపదకుపట్టం కట్టబడిందంటారు విజ్ఞులు. 

శాతవాహన చక్రవర్తులలో ఒకరైన హాలుడి"గాధాసప్తసతి" ప్రపంచ కథానికకు ప్రాణాధారలు అందించినది. గుణాధ్యుని “బృహత్కథా" సంపుటంలోకూడా తెలుగులో ప్రాకృతపదాలు 

చోటుచేసుకున్న కాలంకూడా అదే. సంస్కృత కధావాజ్మయంలోని ఎన్నోకథలకు ఈ ప్రాకృతమే మూలం .ప్రాకృతం తెలుగును అక్కునచేర్చుకుంది...

బౌద్ధవాజ్మయంలోని పాలీ భాషలోనికి మూడువేలకు పైగా పదాలకు చొచ్చుకెళ్ళాయని,  క్రీ:పూ: 130 నాటికే తమిళవ్యాకరణం“అగత్తియం" 

 తెలుగు పదాల్ని భాషాపరంగా అరువుతెచ్చుకొని వాడుకుందట .. ఋషితుల్యుడైన  ప్రాచీనతమిళకవి తిరువళూర్ తన శైవగ్రంథంలో తెలుగును ఎంతగానో ప్రశంసించారు ..

తమిళనాడులోని “మధురైఆధీనం"అనే సంస్థానములలోలభించిన తెలుగు ప్రాచీన పత్రాలలో  తెలిసింది.శైవసిద్ధాంత సాహిత్యంలోని యోగ శాస్త్ర సంబంధం ఉన్న 51 అక్షరాలున్న ఏకైకవర్ణమాల తెలుగు తప్ప మరే ప్రాచీన భాషలోనూ లేదని ఆంధ్రఫ్రదేశ్  లోఉన్నతాధికారిగా పనిచేసిన

 “ కాశీపాంఢ్యన్ “అనేతమిళపరిశోధకుడు తెలియజేసారు.  సాహితీసార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు “దేశభాషలందు తెలుగు లెస్స”అని తెలియజేస్తే ,  

ఎందరో  దేశీయపండితులేగాక  ,పాశ్చాత్య పండితులు కూడా తెలుగు భాషా మాధుర్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. భాషకున్న విశిష్టతనుబట్టి ,శ్రుతి మాధుర్యాన్నిబట్టి, అజంతమైన మనభాషను  పాశ్చాత్యులు “ ఇటాలియన్ ఆఫ్ థ ఈస్ట్” గా వర్ణించారు. 

   భారతీయ భాషలను విఫులీకరిస్తూ ,జె.టి. ఎస్ .హాల్డేన్ “తెలుగుభాషకు అత్యంత సమన్వయ శక్తి ఉన్నదని , ఈభాషకు విభిన్న స్రవంతులను తనలో లీనం చేసుకునే. సమర్ధత  యున్నదని కొనియాడారు .. ఆ పాశ్చాత్యులే మనభాషా ఔన్నత్యాన్ని వేనోళ్ళపొగడడమే కాకుండా.అనేకతెలుగు పద్యాలను కావ్యాలను, అనేక తాళపత్ర గ్రంథాలను ,ఎన్నో రచనలను వెలుగులోనికి తెచ్చారు. .

నిఘంటువులను , వ్యాకరణ గ్రంథాలను స్వయంగా వ్రాసారు .పరిష్కృతప్రతులు తయారుచేసి ముద్రించారు .తెలుగుభాషకు వీరు చేసినసేవ అనన్య సామాన్యం .  

 మన భాష ప్రాచీనభాషగా గుర్తింపబడిన నేపధ్యంలో అంతర్జాతీయ కీర్తినిపొందడంలో ,ఆకీర్తిని ఆపాదించడంలో వారి సేవలు కూడా ఈ సమయంలో మరచిపోలేము .

“నైలునది నాగరికతలో సామాన్యుని జీవితమెలాగుందో తెలియదుగాని,,ఈజిప్టులోని నైలునదినుంచి మన కృష్ణాతీరందాకాసాగిన.  ప్రజల నౌకాయానం. తెలుగువారు సకల దీవులలో.,

 వివిధజాతుల నాగరికతకు దోహదం చేసిన శుభఘడియలవి .ఈ పూర్వ యుగంలో ఆంద్రజాతి ప్రశస్తికి తెలుగు భాషా ప్రశస్తికి ఆనవాళ్ళుగా. క్రీస్తు పూర్వం 500 నాటికి బ్రాహ్మీ లిపిలో భాగంగా తెలుగు బ్రాహ్మీ అవతరించినది.   బ్రాహ్మీకి ప్రాచీన తెలుగు ఆధారమని. తమిళపండితుల. అభిప్రాయం..     దక్షిణాదిని ఏలిన శాతవాహనులు తొలినాళ్ళలో బౌద్ధం జైనం ప్రభావం వలన ప్రాకృతాన్ని తెలుగు ప్రాకృతాన్ని వర్ధిల్ల జేసినా  శాతవాహనులపాలన చివరిదశలో ఒకవర్గప్రభావానికి లోబడి రాజులు సంస్కృతానికి పెద్దపీట వేసారని ప్రతీతి.చాళుక్యరాజుల ప్రోత్సాహంతో ప్రారంభమైనతెలుగు సంస్కృతీకరణ నన్నయతో పూర్తయిందని, నన్నయాదుల ప్రౌఢ కావ్యరచనకు అదిపునాదులు వేసిందని చరిత్రకారులఅభిప్రాయం. అందుకే” పలుకు నుడికారమున్నభాష తెలుగని “శ్రీనాధమహాకవి” వివరిస్తే ,యతిప్రాసలులేని సంస్కృత కవిత్వారణ్యంలో” పుట్టిన   భారత   వేదానికి  ఆంధ్రత్వం నేర్పినది “తిక్కనకవి” అంటారు జాషువాకవి. హరికథాపితామహుడు కవిపండితుడైన “ఆదిభట్లనారాయణదాసు” 

"మొలకలేతదనము/ మొగ్గసొగసుదనము /పువ్వు తావితేనె తియ్యదనము /తెనుంగునకుగాక/ పరుష సంస్కృత భాషకెద్ది ?  అని అన్నారు .ఇలాఅనేకానేక సాహిత్య ప్రక్రియలలో అరుదైన అవధానాలలో అగ్రతాంబూలాలందుకున్నది తెలుగుభాష . బౌద్ధ వాజ్మయంలోని పాళీ భాషలో మూడువేలకు పైగా తెలుగుపదాలు చొచ్చుకు వెళ్ళాయి ...  

  క్రీస్తుశకం ౧౩౦ నాటికే తెలుగు వ్యాకరణం “అగత్తియం "తెలుగుపదాలను భాషాపరంగా అరువు తెచ్చుకుని వాడుకున్నదట.కనుకనే తమిళమహా కవి సుబ్రహ్మణ్య భారతి ,”కళింగత్తుపరణి “కావ్యకర్త జయగోండాన్ కవి “తె లుగును సుందరమైన భాషగా అభివర్ణిస్తూ  ఇలా అన్నారట .*సింధు నదిలోన పండువెన్నెలలోన చేర దేశపు చిరు పడతుల శోభ అందాల తెలుగులో ఆలపిస్తూ పాట అందరము పడవలో ఆడి వద్దాము “"మురిపించుతూ కొన్ని ముద్దు తెలుగు పదాలు అరవమ్ముతో కలసి అచటచట వాడుతూ చిరు తీపి పలుకులు చెవులు విందులు చేయ 

కరునాడు (కర్నాటక) యువతులూ గడియ తీయండి ..అని “తెలుగు మాధుర్యానికి తబ్బి ఉబ్బిపోయేవారట. అటు ఉత్తరాంధ్రంలోని కళింగం నుండి దక్షిణాదిన కంచిదాక ,ఇటు తెలంగాణంలోని కోటిలింగాలనుండి అటు మధ్యాంధ్రలోని కోటిపల్లిదాకా ,అటు ఉత్తరానమగధనుండి ఇటు దక్షిణాన మచలీపట్టణం వరకూ ఒక్కమాటలో శాతవాహనుల కాలంలోని తెలుగువారందరూ ఒకే రాజ్యంలో ఉండేవారట .ఆంధ్ర శాతవాహనుడు శ్రీముఖుడు  స్థాపించిన ఆంద్ర రాజ్యమని చరిత్రకారులనిర్ధారణ .ొ

వీరిపాలనకు ఎంపిక చేసుకున్న కేంద్ర స్థానాలు కరీంగర్ జిల్లాలోని కోటిలింగాల  కృష్ణాజిల్లాలోని శ్రీకాకూళం ,గుంటూరు జిల్లాలోని అమరావతి వరకూ విస్తరించినది .జనపదాలు జానపదకళలకు స్వచ్చమైనపలుకుబడులకు అటు తెలంగాణం ఇటు శ్రీకాకుళం ఆటపట్టులైనవట . మహాకవి నన్నయతో భాషానిర్మాణం కావ్యరచన జరిగాయని వాదించేవారు.

గ్రామ మాతృదేవతలను మనవారు గుర్తించరు .ఈ వివక్ష ఈతతంగమే జానపద సాహిత్యమునకు శాపమై తెలుగు సహజమైన వెలుగు చూపినవారిని గమనింపనేలేదు .చిన్నచూపు చూసారు .జానపదులను వారిభాష.మనవాళ్ళ నిరాదరణ వలనమరుగునపడింది.  మనవారి అశ్రద్ధ నిర్లక్ష్యం వలన ,అన్యభాషల పట్ల ఉన్న ఆసక్తి. తల్లి భాషపై లేకపోడంవలన తెలుగులో ౩౦౦ ఏడ్లకు పైబడిన తెలుగువారి సాహిత్య వికాశానికి చెందిన రచనలు మరుగున పడ్డాయని.    ఆచార్య సి.ఆర్.రెడ్డి , ఆచార్య .తిరుమల రామచంద్ర గారు వంటి భాషావేత్తలు బాధ పడ్డారట .తెలుగు నేలపైపుట్టి తెలుగు వాడవై పెరిగి తెలుగురాదని తింగరి మాటలాడెదవేల ?అని సాక్షి వ్యాసాలలో ఆంధ్రము రాదని ఆంగ్లములో మాటాడిన ఉపన్యాసకుని విమర్శిస్తారు. జంఘాలశాస్త్రి .మనసు తెలుపని భాష మచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓకూనలమ్మ అంటారు ఆరుద్రగారు

”మూలబడినభాష . పిల్లి పిల్లి దెబ్బలాటలో రొట్టెముక్కను కోతి ఎత్తుకుపోయినట్లు “మనభాషను ఆంగ్లభాష ఆక్రమించింది..్అన్ని మాండలీకాల సొగసులూ తనలో ఇముడ్చుకుంటూ తెలుగుభాష విభిన్న ప్రక్రియలలో వెలుగులు జిమ్ముతూ ప్రకాశిస్తోంది ...ఆదరించే   అన్యులను. అవి ల్లలను చూసి ఆనందంతో ఉప్పొంగుతెలుగుతల్లి స్వంతబిడ్డలు చీదరించుకుంటే చిన్న బోతోంది . విశిష్ట సేవలు చేస్తూ ఉన్నతిని చాటుతుంటే నాడు ఉజ్వలంగా వెల్లివిరుసిన తెలగుతల్లి నేడు  మమ్మీలకు మహా పీఠాలువేసి. అమ్మను  ఆవతలికి నెట్టేస్తుంటే ఆక్రోషిస్తోంది..తల్లివిలువతెలియని బిడ్డలను  చూసి  తల్లడిల్లుతోంది....అందుకే.  అమ్మను అమ్మభాషను అమ్మభూమిని గౌరవిద్దాం..

ముఖ్యంగా ప్రభుత్వాలు   సరియైన మార్గదర్శకాలను జారీచేసి భాష సర్వతోముఖాభివృద్ధికి విశేషమైన కృషి చేయాలి. స్వాతంత్ర్యం కోసం సమష్టి కృషి జరిగినట్లే.  భాషాభావృద్ధికి బహుముఖీయమైనకృషి జరిగి ,తెలుగుతల్లి. పునర్వైభవానికి ప్రతి తెలుగువాడూ కృషి చేయాలి .ఆనాడే భాషకు మనుగడ కలుగుతుంది..

ఆదిశగా అందరం  కలసి అడుగులేద్దాం ....

జై తెలుగుతల్లి.



 




                

    


      




..


త్యాగఫలం నాటిక

 త్యాగఫలం  ..


స్వాతంత్ర సంగ్రామంలోనికి  సాహసంతో ఊరికి ,  స్వరాజ్య సమరంలో శౌర్య ధైర్యాలతో మెలిగి,   

 తెలుగు వారు తేజోవి  విరాజితులని నిరూపించిన  మన  వీర విజయ గాథలు   విందామా!   

ఆ శౌర్య ధనులను వింటూ  మనోచక్షుల ద్వారా కనులారా కందామా!    పదండి…


“దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగ

 దేశమరసిన ధీర పురుషుల  తెలిసి పాడర తమ్ముడా !

పాండవేయుల పదును కత్తులు మండిమరిసిన మహిత రణ కథ

 కండగల చిక్కని తెలుగుల  కలసి పాడవే చెల్లెలా!   అని రాయప్రోలు వారన్నట్లు కలసి పాడుతూ,,,,,,

 లోకమంతాకు కాక పెట్టిన   కాకతీయుల కథన పాండితి

 చీకి పోవని సేవ పదముల చేర్చి పాడరా తమ్ముడా,


 తుంగభద్ర భంగములతో  పొంగి నింగిని పొడిచి తత్రుళ్లి భంగపడని తెలుగు నాధుల పాట పాడవే చెల్లెలా! అనచూ  .,,గత చరిత్రలు గానం చేస్తున్న ఆ యువకుడు ..............ఽతని చుట్టూచేరి,


గలగల ప్రవహిస్తున్న గౌతమీ నదిని చూస్తూ... ఇసుక  తిన్నెలపై విహరిస్తున్న మరి కొందరు యువకులు స్వాతంత్రోద్యమ ఘట్టాలను ఎలా స్మరిస్తున్నారు.  వినండి..


.!. ఒక యువకుడు: “ ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం. వారందరినీ తలచుకుని మన మానస వీధిని నిలుపుకొని   “

2 యువకుడు .. నిజం మిత్రమా!  ఎంత తలుచుకున్న తరిమితేరినది. మెచ్చుకున్న కొలది మేలు అయినది.

స్వాతంత్ర ఉద్యమంలో తెలుగువారి పాత్ర. ఆ విషయాలను తన గలగలలో వినిపించే ఈ గోదారి గొంతులో విందామా! 

3 .యువకుడు :నిజమే మరి ఆ త్యాగాలలో మరుపురాని మహా ఘట్టాలను  మననం చేసుకుందాం.


4వ యువకుడు:1857 సంవత్సరం నాటి మొదటి భారత స్వాతంత్ర సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై తిరుగుబాటు జెండా  రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర గాధ మనకు స్ఫూర్తిదాయకం ..జానపదులు ఆ స్వాతంత్ర వీరుని అమరుగాతను పాడుతూ మండల నేటికీ ఉత్తేజ పరుస్తున్నారు.

”రేనాటి సీమలో రెడ్డోళ్ళ కులములోనా  దొరవారి వంశాన ధీరుడే నరసింహారెడ్డి

 కోయల్ కుంట్ల  గుంటల వెంట కుందేరు వొడ్డు లెంట ,గుర్రమెక్కి నీవు వస్తే, కుంపిణికి గుండె దిగులు 

కాలికి సంకెళ్లు వేసి,,   చేతికి బేడీలు వేసి,,,  పారాతో పట్టి తెచ్చి  బంధికానాలో పెట్టిరీ 

 కండ్లకు గంతలు కట్టి నోటి నిండా బట్టలు పెట్టి , నిలువునా నీ తల్లికేమో  చావు శుద్ధి తెలిపినారు.

 కన్నకడుపే తల్లడిల్లే   గంగలోనా గంగ కలిసే,, దొరవారి నరసింహారెడ్డి  నీ దొరతనము కూలిపోయే

 రాజా నరసింహారెడ్డి,  అని ఆ స్వాతంత్ర పిపాసి  మహావీరుడైన సీతారామరాజు గాథలు పాడుతూనే ఉంటారు.


1వ యువకుడు :    మానధనుడైన మంగళ పాండే,, అహంకార ఆంగ్లేయ అధికారుల దురాగతాలపై తిరుగుబాటు చేసిన ప్రథమ ఉద్యమం, ప్రథమ భారత సంగ్రామానికి  ప్రాణం పోసింది. సిపాయిల తిరుగుబాటుక.

 రంగం సిద్ధం చేసింది. మన తెలుగువారిలో కూడా జాతీయోద్యమ స్ఫూర్తిని నింపి నడిపించింద..

2వ .యువకుడు :   అవునవును:మన తెలుగు స్త్రీలు కూడా అంత తెగు చూపెట్టడానికి, స్వాతంత్రోద్యమంలోనికి ఉరకడానికి  సిపాయి ఉద్యమంలో పాల్గొని,, శౌర్య ధైర్యాలతో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా, ఆంగ్లేయుల గుండెల్లో హడలు పుట్టించి, సింహ పరాక్రమంతో సోబిల్లి, వీరభరతనార్యై విజృంభించిన ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు తెగింపును కలగజేసింది..

3వ  యువకుడు : నిజం మిత్రమా:   నానాసాహెబ్,, తాంత్యాతోపే,,  వంటి మహా వీరుల వీరగాథలు ఎలా మర్చిపోగలం?. ప్రథమ భారత సంగ్రామం పరిస్థితులను సమీకరించుకుని, స్వాతంత్ర ఉద్యమ సాహసానికి పూనుకోవడానికి భారతీయులు పకడ్బందీగా వ్యూహరచన చేసుకున్నారు. 

ఇంకొక యువకుడు :“గ్రాండ్ ఓల్డ్ మాన్ అఫ్ ఇండియా గా గుర్తింపు పొందిన దాదాభాయ్ నౌరోజి” బ్రిటిష్ కంపెనీకి క్రమశిక్షణ గల  మేనేజర్ కావలసి వచ్చినప్పుడు,” మేనేజర్ గా కోటలో బాగా వేసి” భారతదేశానికి సాయం చేయాలని అక్కడ చేరారు. లండన్ లో అధ్వానంగా ఉన్న భారతీయుల స్థితిని మెరుగుపరచాలన." లండన్ ఇండియా సొసైటీ స్థాపించి” అందరినీ ఐక్యపరచి స్వాతంత్ర్య పిపాసను రగుల్కొల్పారు.

5వ యువకుడు :  స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాలగంగాధర తి లెక్క నినాదం స్వాతంత్రోద్యమానికి జవసత్వాలు కలిగించిందట కదా! 

6వ యువకుడు : “నిజం మిత్రమా!  స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్య చైతన్యం జాగ్రత్తగా ఉన్నంతకాలం నేను యువకుడినే.. నా విశ్వాసాలను ఏ అస్త్రము ఛేదింపజాలదు. ఏ అగ్ని దహింపజాలదు... ఏ ప్రవాహము దానిని కొట్టుకుని పోజాలదు . ఏ ప్రవాహము దానిని పెకిలింప జాలదు .  నా దేహానికి ముసలితనం వచ్చినా

 నా చైతన్యానికి ముసలితనం రాదు."  అన్నారట తిలక్.

1.యువకుడు: అందుకే ఆనాడు అతివాద త్రయముగా అభివర్ణింపబడిన లాల్ బాల్ పాల్ లు , తమ ప్రసంగాల ద్వారా తమ ప్రవర్తన ద్వారా  లక్షలాది మందిని ఉత్తేజపరచి భారత స్వాతంత్ర సంగ్రామాన్ని  చైతన్యవంతం చేశారు.మహనీయుల కృషి మరువలేనిది..

2.యువకుడు:  అవున మిత్రమా!  స్వరాజ్య ఉద్యమంలో సమరోత్సహంతో పాల్గొని యువతను ఉత్తేజపరిచిన దేశభక్తులు  మన ఆంధ్రదేశంలో  స్వాతంత్రోద్యమ వైతాళికులుగా, ప్రధమ ఆంధ్ర రాజకీయ ఖైదీగా, నిస్వార్థ నిరాడంబర ప్రజాసేవకులుగా, విద్యావేత్తగా, త్యాగమూర్తిగా గ్రంథాలయ స్థాపకునిగా, అనేక విధాల ముఖ్య అతి చెందిన శ్రీ గాడి చర్ల సర్వోత్తమ రావు గారిని భారత స్వాతంత్రోద్యమ త్రిమూర్తులలో ఒకరైన విపించంద్ర పాల్ గారు ఉపన్యాసం ఇదిగో ఈ రాజమండ్రి వేదికగా జరిగినప్పుడు ఆ ఉపన్యాస ప్రభావం వలన హరి సర్వోత్తమ రావు గారే కాకుండా వేలాదిమంది విద్యార్థులు వందేమాతరం అంటూ బ్యాడ్జీలతో తరగతి గదులకు వెళ్లారట.

బిళ్ళలు తీస్తే గాని కళాశాలలోనికి రానివ్వమని ప్రిన్సిపల్ నిషేధాజ్ఞలు జారీ చేసినా , కాలేజీ నుండి సస్పెండ్ చేసినా, విద్యార్థి నాయకుడైన హరిసర్వోత్తమ రావు గారు కొంచెం కూడా బెదరకుండా ఉద్యమాన్ని ఉధృతం చేశారట..

3.వ యువకుడు :: పంజాబ్ కేసరి లాల్వ లజపతిరాయ్ పౌరుషాగ్రేసరి కదా!

4. యువకుడ.:అదొక ఉద్యమాల కొరకే ఈ పవిత్ర గోదావరి నదిలో  స్నానం చేసి రాజమహేంద్రి విద్యార్థులు స్వరాజ్య సాధనా దీక్షా కంకణదారులైనరట…

5.యు.. స్వరాజ దీక్ష తీసుకున్నారని గాడిచర్ల హరిసరివోత్తమరావు గారిని బంధించి జైల్లో పెట్టారట…

6.యు..ఆ సమయంలోనే, హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకొని పొట్టి శ్రీరాములు గారు ప్రచారం చేసేవారట. మండుటెండర్లో కాళ్లకు చెప్పులు గొడుగు లేకుండ., జాతీయ ఉద్యమాన్ని చాటుతూ ప్రచారం చేసేవారుట. ఆ దేశభక్తున్ని సామాన్యులు” పిచ్చి శ్రీరాములు అనేవారట”.

 అవును ఆయనకు దేశాభ్యుదయం అనే పిచ్చి పట్టిందట.

1.యువ.   అందుకే మహాత్మా గాంధీ, పట్టుమని పదిమంది పొట్టి శ్రీరాములు వంటి మహా వ్యక్తులు ఉంటే మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్రం తెచ్చి పెట్టగలను అన్నారట..

2వ.యు. దేశ భాషల సమున్నతికి ఆత్మబలిదానం గావించిన అద్భుత దేశభక్తులు శ్రీరాములు గారు.