Sunday, 13 October 2024

GaMtakutagga bomta

 గంతకు తగ్గ బొంత.....

గొప్పల గోవిందరావును , అబద్ధాల అనుష సీతారాంపురంలో

 శ్రీరామనవమి  కళ్యాణ ఉత్సవంలో కలిసింది. కళ్ళు మెరిసేటట్లున్న ఖరీదైన నగలతో, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న అనూష, అంతట తానై అన్నిట తానై  అతి ఉత్సాహంతో తిరుగుతుంటే, ఆ తీర్థం జరగడానికి, తీర్థ ప్రసాదాలు పంచడానికి ప్రధాన కారణమైన తిరుణామాల రాజు గారి  భార్యను అమ్మ అమ్మ అంటూ, అన్ని సేవలు చేస్తుంటే వారి సంతానం అనుకున్నాడు గోవిందరావు…

అందరూ తీర్థంలో స్వామిని చూస్తూ ఉంటే తను మాత్రం అనూషను చూస్తూ, హమ్మయ్య ఈ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. అబద్ధమో, సుబద్ధమో , తన ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి, ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపి, ప్రేమ పేరుతో పెళ్లికి ఒప్పించేలా చేయాలి. దాంతో తమ దరిద్రం దగ్ధం అయిపోతుంది అనుకున్నాడు గోవిందరాజులు.

వెంటనే టక్కు సరి చేసుకుని , టై సరిగ్గా సర్దుకుని, క్రాఫ్ దువ్వుకొని కొత్త పెళ్ళికొడుకులా తయారై, అమ్మగారికి ఆకు వక్కలు అందిస్తున్న అనుష్క పక్కన చేరాడు. 

తనను ఆరాధనగా చూస్తున్న గోవిందరాజులను చూసి, కుర్రాడు గొప్పగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడిలా కనపడుతున్నాడు, తను ఎలాగైనా ఇతన్ని పెళ్లికి ఒప్పిస్తే, “కోటలో బాగా వేసినట్లే అనుకుంది”... మీరు మా డాడీకి తెలిసిన వాళ్ల్లా ? నేను మీకు ముందే తెలుసా? అంత పరిశీలనగా చూస్తున్నారు అంది వయ్యారంగా.. మెలికలు తిరిగిపోయిన గోవిందరాజులు, మేము పక్క ఊరి పర్వత రాజు గారి కనిష్ట పుత్రులం. మీ ఊరు తీర్థం చూడ్డానికి వచ్చాము  మిమ్మల్ని కూడా చూసాము, సంతోష అన్నాడు. నాటక ఫక్కీలో .

ఓహో! మా మమ్మీ డాడీ మీకు ముందే తెలుసు అనుకున్నాను.

 సరే. ఈ డ్రింక్ తాగండి అని  అందించి, ఆ పెద్దావిడ చెవిలో ఏదో చెప్పి , పదండి అలా దూరంగా వెళ్లి మాట్లాడుకుందాం అంది.

అలా ఇద్దరూ చేరువై , ఆ ఊరి పొలిమేరలో కలుసుకుంటూ, 

వాళ్లే జమీందారికి వారసులైనట్లు ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటూ చాలు మధ్యలో మన రెండు ఊర్లకు ఉన్న శత్రుత్వం వలన మన పెద్దవాళ్లు మన పెళ్లికొప్పుకోరు ఏ శ్రీరామనవమి నాడు కలిసామో!

ఆ శ్రీరామనవమినాడే పెళ్లి చేసుకుందామని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.   హనీమూన్ కి అటు ఊటీ వెళదామా ?

ఇటు కూర్గ్  వెళదామా అనుకుని, అబ్బా అంత దూరం నేను ప్రయాణం చేయలేను , పరీక్షలకు చదువుకోవాలని గోవిందరాజులు గొప్పగా చెప్పడంతో అరకు వ్యాలీ వెళ్ళడానికి అన్నీ సర్దుకున్నారు.

అదిగో అప్పుడే ఎదురయ్యాడు ,, అనుమానాల ఆనందరావు..

అనుష్కను చూస్తూనే, నువ్వు సీతారాంపురం చిన్నజమిందార్ గారు ఇంట్లో  పని పిల్లవు కదా? ఒరేయ్ అప్పుల అప్పారావు కొడకా?

 మీ నాన్న చేసిన అప్పులకి తప్పించుకు తిరుగుతూ, డిగ్రీ కూడా కంప్లీట్ చేయకుండా దేశదిమ్మరి తిరుగుతూచివరికి ఈ పిల్లను పిల్లను పెళ్ళాడావా?అనేసరికి ఇద్దరికీ పట్టపగలు నక్షత్రాలు వినబడ్డాయి. నీ సూటు బూటు చూసి నువ్వు పెద్ద ఇంటి వాడివి అనుకున్నానని అనుష్క అంటే,

  నీ నగలు వగలు చూసి మమ్మీ డాడీ అంటూ ఉంటే నువ్వు వాళ్ళ ముద్దుల కూతురు అనుకుని మోసపోయాను అని గోవిందరాజులు జవాబు ఇచ్చాడు…

నా అందానికి నాకు రాజు గారి మేనల్లుడు వచ్చి ఎగరేసుకు పోతాడు అనుకుంటే, ముష్టి రాచవారి ీ ముద్దుల బిడ్డ నువ్వు తగిలేవా? నా కర్మ అంటూ నుదురు కొట్టుకుంది అనుష్క.

మా తాత ముత్తాతలు పేరు ఉన్న జమిందార్ లే .. జమీందారీ వంశంలో ఉన్న అమ్మాయి  జవహరీతో వస్తుందనుకుంటే,

 నకిలీ నగలు పెట్టుకొని నాలుగిళ్లలో పాచి పని చేసే ఆగమ్మ కూతురివి నువ్వు వచ్చావ్? నా కర్మ అని నుదురు కొట్టుకున్నాడు గోవిందరాజు. “గంతకు తగ్గ బొంత” అలాగే మూడు ముళ్ళు పడిపోయాయి కాబట్టి ముచ్చటగా కాపురం చేసుకోండని సర్దిచెప్పి

సంచి పట్టుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు  అనుమానాలఆనందరావు.


గంతకుతగ్గ బొంత.

 గంతకు తగ్గ బొంత.....

గొప్పల గోవిందరావును , అబద్ధాల అనుష సీతారాంపురంలో

 శ్రీరామనవమి  కళ్యాణ ఉత్సవంలో కలిసింది. కళ్ళు మెరిసేటట్లున్న ఖరీదైన నగలతో, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న అనూష, అంతట తానై అన్నిట తానై  అతి ఉత్సాహంతో తిరుగుతుంటే, ఆ తీర్థం జరగడానికి, తీర్థ ప్రసాదాలు పంచడానికి ప్రధాన కారణమైన తిరుణామాల రాజు గారి  భార్యను అమ్మ అమ్మ అంటూ, అన్ని సేవలు చేస్తుంటే వారి సంతానం అనుకున్నాడు గోవిందరావు…

అందరూ తీర్థంలో స్వామిని చూస్తూ ఉంటే తను మాత్రం అనూషను చూస్తూ, హమ్మయ్య ఈ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. అబద్ధమో, సుబద్ధమో , తన ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి, ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపి, ప్రేమ పేరుతో పెళ్లికి ఒప్పించేలా చేయాలి. దాంతో తమ దరిద్రం దగ్ధం అయిపోతుంది అనుకున్నాడు గోవిందరాజులు.

వెంటనే టక్కు సరి చేసుకుని , టై సరిగ్గా సర్దుకుని, క్రాఫ్ దువ్వుకొని కొత్త పెళ్ళికొడుకులా తయారై, అమ్మగారికి ఆకు వక్కలు అందిస్తున్న అనుష్క పక్కన చేరాడు. 

తనను ఆరాధనగా చూస్తున్న గోవిందరాజులను చూసి, కుర్రాడు గొప్పగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడిలా కనపడుతున్నాడు, తను ఎలాగైనా ఇతన్ని పెళ్లికి ఒప్పిస్తే, “కోటలో బాగా వేసినట్లే అనుకుంది”... మీరు మా డాడీకి తెలిసిన వాళ్ల్లా ? నేను మీకు ముందే తెలుసా? అంత పరిశీలనగా చూస్తున్నారు అంది వయ్యారంగా.. మెలికలు తిరిగిపోయిన గోవిందరాజులు, మేము పక్క ఊరి పర్వత రాజు గారి కనిష్ట పుత్రులం. మీ ఊరు తీర్థం చూడ్డానికి వచ్చాము  మిమ్మల్ని కూడా చూసాము, సంతోష అన్నాడు. నాటక ఫక్కీలో .

ఓహో! మా మమ్మీ డాడీ మీకు ముందే తెలుసు అనుకున్నాను.

 సరే. ఈ డ్రింక్ తాగండి అని  అందించి, ఆ పెద్దావిడ చెవిలో ఏదో చెప్పి , పదండి అలా దూరంగా వెళ్లి మాట్లాడుకుందాం అంది.

అలా ఇద్దరూ చేరువై , ఆ ఊరి పొలిమేరలో కలుసుకుంటూ, 

వాళ్లే జమీందారికి వారసులైనట్లు ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటూ చాలు మధ్యలో మన రెండు ఊర్లకు ఉన్న శత్రుత్వం వలన మన పెద్దవాళ్లు మన పెళ్లికొప్పుకోరు ఏ శ్రీరామనవమి నాడు కలిసామో!

ఆ శ్రీరామనవమినాడే పెళ్లి చేసుకుందామని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.   హనీమూన్ కి అటు ఊటీ వెళదామా ?

ఇటు కూర్గ్  వెళదామా అనుకుని, అబ్బా అంత దూరం నేను ప్రయాణం చేయలేను , పరీక్షలకు చదువుకోవాలని గోవిందరాజులు గొప్పగా చెప్పడంతో అరకు వ్యాలీ వెళ్ళడానికి అన్నీ సర్దుకున్నారు.

అదిగో అప్పుడే ఎదురయ్యాడు ,, అనుమానాల ఆనందరావు..

అనుష్కను చూస్తూనే, నువ్వు సీతారాంపురం చిన్నజమిందార్ గారు ఇంట్లో  పని పిల్లవు కదా? ఒరేయ్ అప్పుల అప్పారావు కొడకా?

 మీ నాన్న చేసిన అప్పులకి తప్పించుకు తిరుగుతూ, డిగ్రీ కూడా కంప్లీట్ చేయకుండా దేశదిమ్మరి తిరుగుతూచివరికి ఈ పిల్లను పిల్లను పెళ్ళాడావా?అనేసరికి ఇద్దరికీ పట్టపగలు నక్షత్రాలు వినబడ్డాయి. నీ సూటు బూటు చూసి నువ్వు పెద్ద ఇంటి వాడివి అనుకున్నానని అనుష్క అంటే,

  నీ నగలు వగలు చూసి మమ్మీ డాడీ అంటూ ఉంటే నువ్వు వాళ్ళ ముద్దుల కూతురు అనుకుని మోసపోయాను అని గోవిందరాజులు జవాబు ఇచ్చాడు…

నా అందానికి నాకు రాజు గారి మేనల్లుడు వచ్చి ఎగరేసుకు పోతాడు అనుకుంటే, ముష్టి రాచవారి ీ ముద్దుల బిడ్డ నువ్వు తగిలేవా? నా కర్మ అంటూ నుదురు కొట్టుకుంది అనుష్క.

మా తాత ముత్తాతలు పేరు ఉన్న జమిందార్ లే .. జమీందారీ వంశంలో ఉన్న అమ్మాయి  జవహరీతో వస్తుందనుకుంటే,

 నకిలీ నగలు పెట్టుకొని నాలుగిళ్లలో పాచి పని చేసే ఆగమ్మ కూతురివి నువ్వు వచ్చావ్? నా కర్మ అని నుదురు కొట్టుకున్నాడు గోవిందరాజు. “గంతకు తగ్గ బొంత” అలాగే మూడు ముళ్ళు పడిపోయాయి కాబట్టి ముచ్చటగా కాపురం చేసుకోండని సర్దిచెప్పి సంచి పట్టుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు  అనుమానాలఆనందరావు.


(1ఏదిజరిగినా మనమేలుకే)

                   ఏది జరిగినా మన మేలుకే!

             వెంకటాపురం గ్రామంలో  అంజన్న , అమ్మాజీ అనే దంపతులు ఉండేవారు. వారికి లేక లేక కలిగిన  కొడుకు వరప్రసాద్. తల్లిదండ్రుల గారాబం వలన వాడు అల్లరిగా తయారయ్యాడు.

 విపరీతంగా కొడుకుని ముద్దు చేయడం వలన , మూర్ఖంగా తయారయ్యాడని వాడి ప్రవర్తన చూసి   తల్లి తండ్రి భయపడటం ప్రారంభించారు.  

‘ మొక్కై వంగనిది మానై వంగునా?” అన్నట్లు ,తల్లిదండ్రులు ఎన్ని బుద్ధులు చెప్పినా,వేటినీ ఒంట పట్టించుకోకుండా, అల్లరి చిల్లరిగా తిరగసాగాడు ప్రసాద్. 

ఏదో పాడు పని చేయడం, ఎవర్నోఒకరిని బాధపెడుతూ ఉండడం, నోరువిప్పితే అబద్ధాలుచెప్పడం,

తనకన్నా బలహీనమైన వాటిని బాధపెడుతూ ఉండటం,

పసి పిల్లల్ని ,మూగజీవాలను హింసించడం  అలవాటుగా మారింది . అందరూ తమకొడుకు పై నేరారోపణలుచేస్తూ ఉంటే చాలా బాధపడిన ప్రసాద్ తల్లి,తండ్రి, వాడి బుద్ధి,మార్చడానికి  విశ్వ ప్రయత్నం చేసేవారు.

తల్లిదండ్రుల బలవంతం తో mukku tuu మూల్గుతూ, 

స్కూల్ కి వెళ్లేవాడు ప్రసాదు.. రోజుకు ఒక గొడవ తెస్తూ ఉంటాడు.                    చేతులు ఎప్పుడూ ఖాళీగా ఊరుకోవు..

 చేతిలో కర్రో,  తాడో , పట్టుకుని చెట్లను, జంతువులను కొడుతూ ఉంటాడు.

ఎవరినో బాధపెట్టి వాళ్లు బాధపడుతుంటే చూసి 

నవ్వుకుంటే గాని, వాడికి నిద్ర పట్టదు.      ‌ ‌                   చిన్న పిల్లల చేతిలో చిరుతిళ్లు లాక్కుని తినేయడం,

 ప్రహరీ గోడ మీద కూర్చుని ప్రశాంతంగా నిద్రపోతున్న పిల్లుల తోక పట్టుకులాగడం,

 ఇంటి ముందు విశ్రాంతి తీసుకుంటున్న కుక్కలను,

 రాళ్లతో కొట్టడం, గుంపులుగా వచ్చి గింజలు తింటున్న పక్షులను చెదరగొట్టడం లాంటి పనులు చేస్తూ పక,పకా నవ్వుతాడు.

ఆరోజు అలాగే స్కూల్ నుండి వస్తూ, చేతికొందిన కొమ్మలు విరిచేస్తూ, చేతిలో గల సన్నని రువ్వతో . అందిన చెట్టు కొమ్మలని కొడుతూ,వస్తున్నాడు.

ఒక్క చెట్టుకొమ్మను  కొట్టేసరికి ,ఆ కొమ్మకుపట్టిన కందిరీగలు పట్టు చెదిరిపోయి, కందిరీగలు వాడిని వెంబడించి కుట్టడం మొదలుపెట్టాయి .

వాడెంత తొందరగా పరిగెడుతూ ఉంటే,            అవి ఇంకా వేగంతో వాడిని వెంబడించి కుట్టసాగాయి.

వాడు కేకలు అరుపులు విని, పొలంలో పనిచేస్తున్న రైతులు వచ్చి, వాడిని పొలంలో నీటి గుంతలోకి తోసి కాపాడారు. కందిరీగలు పోయిన తర్వాత, వాడిని తీసుకొచ్చి ఇంట్లో పడేశారు.   ఒళ్లంతా కందిరీగలు ముళ్ళు విరిచాక,    

 కళ్ళు ,ఒళ్ళు వాచిపోయి,    నెల రోజులు మంచం  దిగలేక నరకయాతన పడ్డాడు ప్రసాద్. 

తల్లి తండ్రి రాత్రి పగలు అనక మందులు పోస్తూ,రాస్తూ 

సేవలు చేస్తూ, తేరుకునేలా చేశారు.

 ముసలిదైన నాయనమ్మ, వాడిగాయాలకు మందు పూస్తూ,

ఏ జీవిని అకారణంగా హింసించ కూడదు. 

ఎవరిని బాధ పెట్టినా, తప్పకుండా మనం ఏదో రోజు బాధపడి తీరుతాము అంటూ రోజూ నీతి కథలు చెప్పేది. 

   ఆ కథలు విని, వాళ్ల సేవలు చూసి, పరివర్తన చెందిన ప్రసాదులో  మంచి మార్పు వచ్చింది.

అప్పటినుండి అల్లరి మాని బుద్ధిగాచదువుకుని, 

వృద్ధిలోకి వచ్చాడు..

తల్లి తండ్రి నాయనమ్మ” ఏది జరిగినా మనమేలుకే “ అని సంతోషించారు.....


నారాయణరావు నవల అడవి బాపిరాజు గారు

 నారాయణరావు నవల అడవి బాపిరాజు గారు.

పాత్రల పరిచయం;  

నాయకుడు నారాయణరావు .ఇంటిపేరు  తటవర్తి వారు . గోత్రం కౌండిన్యస.

ప్రాథమిక పాఠశాల మొదలు బి .ఎల్. పరీక్ష వరకూ అన్నింటా ప్రథమునిగా నిల్చున్నాడు. సంగీత సాహిత్యాలపై పట్టుసాధించాడు గజ ఈతగాడు ..

గొప్ప మానవతావాది . లలిత కళలపట్ల మక్కువ గలవాడు .సున్నితమనస్కుడు సునిసిత  పరిశీలనా దృక్పథము గలవాడు ..  

         అందుకే జమిందారుగారు ,నారాయణుని ,బెజవాడ ప్లాట్ఫారం పై  పుస్తకాల దుకాణం కడ దూరముగా ఉన్నప్పుడే చూసిననూ,

 నారాయణరావునిలువెత్తు . విగ్రహము, పురుషత్వము  మూర్తిభవించిన తేజము, పటుత్వము కమ్మిచ్చి తీసినట్లున్నను అతని కనుబొమ్మలలో రేఖలు వెలుగు నిడిని ,చెవులతో సమమైన నాసికలో వనితాలాలిత్యము,

 వెన్నెల వలె ప్రకాశించి, ప్రవహించు చుండెడి ,స్తంభములనైననూ విరగగొట్టగల అతని చేతులు, దీర్ఘాంగులులతో మెత్తని తలములతో అందమైన ఎత్తైన విశాలమైన అతని పాలము, నల్లని దట్టమైన జుట్టు, పొదవుకున్న కారుమబ్బుల ఆక్రమించిన వెన్నెల తునకలవలే విరిసిపోయినది నారాయణరాయని యవ్వన సధృశ దృఢ దేహకాంతి .

 దీర్ఘ దేహ కాంతి ప్రవాహములో జమీందారు చిర పిపాస మగు హృదయమున ,తనివోలలాడ చూచినాడు .

అస్పష్టంగా నొక్కమారు , ఇతడే తన కుమార్తె శారదకు తగిన వరుడు అని హృదయాంతరాళములలో  నుండి నిశ్శబ్ద గీతాలాపన ప్రతిధ్వనించినది..

దానికి తోడు ఏలూరు నుండి తాడేపల్లిగూడెం స్టేషన్ వరకు,

 లక్ష్మీపతి శ్రవణ ప్రియముగా నారాయణనుని గుణ గణ వర్ణన చేయుచుండ, జమీందారు హృదయమారావినుచున్నారు ..

నారాయణ  మనసు మెత్తని వాడని , ఎదుటివారి బాధ చూడలేడని, చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఎవరైనా ఏడిస్తే వారి కళ్ళలోనీరుచ్హూసి , ఇతని కళ్ళలో గౌతమి తిరిగేదని, తన అందమైన వస్తువులను వాళ్ళకి ఇచ్చి ఊరడించడానికి ప్రయత్నించేవాడిని, ఎంతమంది నౌకరులున్నా, చెల్లెలుని అన్నగారే బిడ్డల్ని తనే ఎత్తు కుంటాడని, ఆ పిల్లలు తల్లిదండ్రులు కన్నా నారాయణ అంటే ఎక్కువ అభిమానిస్తారని ,అతని గొంతులో తీయదనము, కోపమోస్తే ఉరుముల గాంబీర్యము పెంచుకుంటాయని పాటలు పాడితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని, బళ్ళలో చదివేటప్పుడు తోటి వాళ్ళ  బాధపడకూడదు కదా అని పుస్తకాలు, బొమ్మలు, తినుబండారాలు,

 పంచి పడుతూ ఉంటాడని చెప్పాడు..

 ఎప్పుడూ ఏ పరీక్షా తప్పలేదు. ప్రతి తరగతిను మొదటి వాడే ఇంటర్ మూడు సబ్జెక్టుల్లో మొదటి మార్పులు బంగారు పతకాలు సాధించాడు ఇంతలో మహాత్మా గాంధీ గారి సహాయ నిదాకరణ ఉద్యమం వచ్చింది రాజమండ్రి కాలేజీ వదిలేసి దేశం కోసం పనిచేశాడు ఖైదుకు వెళ్ళాడు ఆరు నెలలు నిర్భయంగా కృష్ణ జన్మస్థానంలో గడిపాడు వచ్చాడు, స్వరాజ పార్టీ అంటే ఇష్టం లేదు, బిఎస్సిఆనర్స్ చదివాడు రెండోవాడుగా నెగ్గాడు లో మొదటి స్థానంలో వచ్చాడు అతని ఆస్తిపాస్తులు ఇద్దరు అన్నదమ్ములు 

320 ఎకరాల మాగానీ తోట  31 పైన వడ్డీ వ్యాపారం లో, లక్ష ఇరవై వేలకు పైన తిరుగుతున్నట్టు ధనము బ్యాంకు షేర్లతో పాటు రెండు లక్షలుఉన్నవని ఎంత లేదన్నా, 20వేలుదాకా నికరఆదాయంఉంటుందని, నారాయణ తండ్రి సుబ్బరాయుడు గారు మంచి గుణవంతులు, అత్తగారు జానకమ్మ గారు పార్వతీదేవని, నలుగురుకుమార్తెలకు వివాహములైనవని అని మంచి సంబంధాలు చేశారని చెప్పారు .

జమీందారు ; విశ్వలాపురం జమీందారు గారైన లక్ష్మీ సుందర ప్రసాదరావు గారు ఆరువేల నియోగి .  హైదరాబాద్ నవాబు గారి పరిపాలన లోకి వచ్చి, రాజమండ్రి సర్కారు దగ్గర నుండి వెండి తల బాలు, బంగారు పొన్ను కర్ర, ఇరువోదయదఊర్లకు వీరమిరాసీలు,వివాహం పొందుతూ,,’నిశ్శంక మహా  శంక సింహమాన సకల విధన ప్రముఖ సంస్థత అని బిరుదు పొంది తల్లాప్రగడ నన్నయ నాయని పవిత్రులుగా గౌరవంపొందినారు. 

ఆరు వీర మిరాశీలు క్రమక్రమముగా విస్తరించి చిన్న జమీగా పరిగణించినవి వారు నవాబులకు పన్ను పట్టుచుండిరి. రాజకార్య నిపుణతయును, వేగుతనమునకును, దక్షతతో పరిపాలించు పరిపాలించి ఐశ్వర్యవంతంగా చేయుచున్నందుకు నవాబులు మెచ్చుకొని బంగారు తలందాను రవ్వల ఒరగల నిశిత కరవాలము, శ్వేత చత్రము, బంగారు పల్లకి, బిరుదులిచ్చి శతాశ్విక దళమునకు దల వాయిగా నుంచిరి.

 విశ్వలాపురం ఈ మొగలి తుర్రు పరిపాలన క్రిందకు  వచ్చిన పిమ్మట నన్నయ్య మంత్రి వంశీకుడైన తల్లాప్రగడ గజపతిరాజు మొగలుతురు వారి కడ అమాత్యుడే .వీరిముత్తాత  రాజ్యము సర్వ విధముల విజృంభింప చేసుకొనెను అట్టి ఉత్తమ వంశములో జన్మించిన “శ్రీ రాజా లక్ష్మీ సుందర ప్రసాదరావు “స్వకల దీపకుడై, సదాచార సంపన్నుడై ,నూతన విజ్ఞాన ప్రకాశమున, తన హృదయమునుకాంతివంతము చేసుకొని ,

ఆమర విద్య నందును, వాడు సంస్కృతమును, బిఏ పరీక్ష యందుఉత్తీర్ణుడై  ప్రసిద్ధ పండితుల పాదముల కడ, సంస్కృత భాషా మృతమును సేవించి అమరభావ పులకితుడైనాడు .తాను జమీందారుడైయు రైతుల కష్టములు పటాపంచలై. వారు బాగు పడిననే కానీ, భావి భారత భాగ్యోదయము కాదని నిశ్చయించి, పూర్వపు శాసనసభలకు నూతన శాసనసభలకు కూడా, అధిక సంఖ్యకులగు ప్రజల ప్రతినిధిగా గుర్తింపబడి, ప్రభుత్వమునకు పక్కలో బల్లమై మెలగినాడు. రాజనీతి శాస్త్రమునన్యాపతి సుబ్బారావు పంతులు గారి ప్రియ శిష్యుడు. మాచర్ల రామచంద్ర రాయని ప్రియ స్నేహితుడు. “గాంధీ గారి ఆ సహాయోద్యమంచే దేశము విప్లవమున  పడిపోవునని ఆయన నమ్మడు .కావున శాసనసభలో స్వార్థ పరులకు ప్రజాద్రోహులకు ,ధర్మ ద్రోహులకు

 తనస్థానమైననుచిక్కకుండా చేయగలుగుటయే ,తాను చేయగల దేశసేవయని నమ్మిన సత్పురుషుడు అతడు.

లక్ష్మీ సుందర ప్రసాదరావు గారికి గంజాం జిల్లాలో ,నారికేల వలస జమీందారు గారు వీరభసవరాజవరధీశ్వర లింగంగారు తమ ప్రధమపుత్రిక “వరద కామేశ్వరిదేవిని” ఇచ్చి వివాహము చేసినారు. వారి గర్భమును ఇరువురు పుత్రికలు ఒక పుత్రుడు పవిత్ర మార్చినారు. ప్రథమ పుత్రిక శకుంతలా దేవిని నెల్లూరు జిల్లాలో, చిన్న జామిన్  కి ప్రభువైన భావనారాయణ గారి ప్రథమ పుత్రుడు విశ్వేశ్వరరావుకు ఇచ్చి వివాహము చేసినారు.

 పెద్దల్లుడు కుమార రాజా విశ్వేశ్వరరావు చాలా గర్వి. ఇంగ్లాండ్ కి పోయి ఆక్స్ఫర్డ్. లో లో ఎం .ఏ పట్టము పొంది, హిందూ దేశములో ఉద్యో సమపార్జించి చ అధి తా పై విన బ్ ఇండియా ఒక్క అ అతి భారత ఆ సహారా ఎడారి అయిపోవునని అతని భయము విశ్వేశ్వరరావు మామ గారితో హిందూ దేశాన్ని నాగరికతయే లేదని చుండును ఇంటిలో భార్యాభర్తలకు చుక్క ఎదురు. సంతతము ఎట్టి చిన్న విషయముల కైనను ఇరువురు మాట పట్టింపులు వచ్చి, ఒకరి కొకరు మాటలాడుటమాన్వేసే.  జమిందారు బిడ్డలుఇద్దరూ. జమీందారు బిడ్డలను అహంకారంతో, అభిమానముతో,

 మన: పదములు ఎల్లప్పుడూ జాగరితమైఉండి  చేపట్టుచుందురు .

వారి బిడ్డలు, తల్లిదండ్రుల సర్వవిధముల అనుసరించుచు .వారిలో వారు ,సేవకులతో, తల్లిదండ్రులతో, తోడి పిల్లలతో కలహమాడుచుందురు.

కలహములకు  వారిది పుట్టినిల్లు .అపశృతి బహు రాగముల కలయికతో, ఆ దేవి వారింట విచిత్ర నృత్యము గడుపుతుండెను.

 లక్ష్మీ సుందర ప్రసాదరావు గారి ప్రథమ పుత్రిక జామాత లిట్లు తిట్టఫలములు అయిపోయి, ఆయన హృదయమును తీరని కోరికల చే ,బాధాపూర్ణము చేసిరి. శకుంతలాదేవికి సంగీత సాహిత్యములు నేర్పించినాడు రాంమహేంద్రవరపుర నివాసియగు ఒక అమెరికన్ మిషనరీ భార్య కాడ ఆమె కాంగ్లము  జరిపించినాడు. ఈ విద్య ఆమెకు గర్వమును వృద్ధి చేసినది కళాభిజ్ఞత లేని జామాత, కళచ్హే రజనింపజేయు పిచ్చి పోకడలను, జిల్లా జడ్జిల భార్యల కడ ,కలెక్టర్ల సతుల కాడ పాడమని భార్యను ప్రోత్సహించు చున్న వాడు .ఆమె విరసముగా తనవి అన్నీ మరిచిపోయినానని చెప్పేది.

                జమీందారు గారి రెండవ కూతురు శారద చిన్నప్పటినుండియు శాంతవర్తన .మూగదేవుని వలే మాటలాడక విశాల నయనములతో చిత్రము వలె. అన్నియును పరికించినది .ఆమె ఒక్కసారి దేనిని విన్నను, మరి మరువదు. ఆమె మాటలలో సున్నితమై తేటై మధురము. చక్కని తెలివి తేటలు. నేటి యువతి వలె ప్రవహించు చుండును. వీణతీగలు కోయల గొంతు తో మీటి,  కొండ కోనలోని వేణు వు ల పాటలు కూడా పేలవముగా చేయగలిగినది. ఆమె కంఠము గాన మూర్తియగు శ్రీ రామయ్య గారి పాదముల కడ ఆమె సంగీతము నేర్చుకున్నది. శ్రీ రామయ్య గారు గాత్రములో భాగ్యనగరమున, దక్షిణా పదమున పేరెన్నికగన్న.

 ఆయనను మించిన వారు లేరు .తన కమాన్ కదల్చ లోని విశ్వ గీతా స్వరము నాయనమ్ శారద కమాన్ లోనికి ప్రవహింప జేసినారు .

శ్రీ త్యాగరాజమూర్తి కన్నుల మున్దు తనను తాను మరిచి శ్రీ సీతారాముల ప్రత్యక్షము చేసుకొని దివ్యగానంలో జనించిన తారకలకు, శృతులు ఆ సాంప్రదాయము,  శ్రీ రామయ్య గారు శారదకు ధారపోసిరి,

 శారద వినయశీలి .శ్రద్ధగావిద్య బాగుగా నేర్చుకున్నది .వీణ దక్షుడగు వేరొక ఉత్తమ ఒకవైణికునికడ నేర్చి నది .

శారదకు తండ్రి అన్న ప్రేముడి ఎక్కువ .ఆమె చిన్న తమ్ము నొక్క క్షణమైనను వదిలి ఉండదు. అచ్చముగా తన తల్లి పోలికైన శారదను చూచి ,జమీందారు గారికి అనురాగము ఉన్నది .ఆమె తన ఆశయములకు తగిన కుమార్తెయని ఆయన గర్వపడును.  చదువులలో చిత్ర మెల్ల చదివితి బాల అని ఆనంద భాష్పములతో  తన ను గాడాలింగను ముంచుకుని, ఒకనాడు జమీందారు గారి తన స్నేహితుల కడ అప్పటికి పదం ఏడేండ్ల ప్రాయము గల శారదచే సంగీత సాహిత్య సభ జేయించినాడు వృద్ధుడు శాంతమూర్తి తేజస్వియగు భాస్కరమూర్తిగా రామెకు నాలుగు భాషలు, చెప్పన్న విద్యలు నేర్పినారు,

 నేడు శారద పదునాలుగు సంవత్సరముల ఎల నాగ .అందాల ప్రోవు.

 సుగుణాల నిధి. చదువుల కన్న తల్లి ఆమెకు తప:ఫలమై జీవితకల్పమగు భర్తను కొని తేవాలని జమీందారు గారి వాంఛ.శారద స్కూల్ ఫైనల్కు ప్రైవేటుగా సిద్ధపడుచునున్నది.

సంఘ సంస్కరణాభిలాషియబు జమీందారు గారు శారదకు ఉన్నత విద్యలు చెప్పించవలెనని ఎంతకుతూహల పడినను ఆయన హృదయము మాత్రము పూర్వ సంప్రదాయ ఘంటా పదమును దాటలేక పోయినది. వయస్సు మీరిపోకుండా శారదకు వరుని తేవలెను. ఇదివరకు జమిందార్ కుటుంబముతో వేయమందినాడు ఆ సరదా తీరినది తల బొప్పి కట్టినది. ఈనాడు అనుంగు కూతురిని జమీందారుల కిరాతుల చేతికనమ్మ త్రిసూక్తిగా నమ్ము శారదా “అని హృదయమున శపథం చేసుకున్నాడు

  భార్య అయిన వరద కామేశ్వరి దేవి తన అన్నగారి కుమారుడు శ్రీ కొవ్విడి బసవరాజ జగన్మోహన్రావుకు సారధినిచ్చి వివాహము అనురూధింపవలెనని పట్టుబడినది అన్నగారు విశ్వేశ్వర ఆనంద సువర్ణదీశ్వర లింగం గారు విజయనగర వేశ్యవాటి సముద్ర జనిత మాయా అప్సరోమని నీచ శృంగార సమారాధనలో ప్రాణము కూడా ధారపోసి ఆస్తి అప్పుల పాలు చేసి పోయినాడు పూర్తఫ్ వాట్స్ వారు వ్యవహరించి అప్పులు నిశ్శేషంగా తీర్చి వేసి రెండు లక్షల రూపాయల నిలవతో ఇరువది ఎనిమిది ఎండ్ల వయసున జగన్మోహనరావుకు జమీ అప్పగించినారు ఈ చిన్న జమిందారును గూర్చి రహస్యములు కథలై దేశమంతటా ప్రాకుచున్నవి లక్ష్మీ సుందర ప్రసాదరావు గారి సంబంధం ఒక మాట భార్య కదిపినప్పుడు జుగుప్సపడినాడు

 అమ్మాయిని నరక కూపము లోనికి వేరే త్రోయనక్కరలేదు మన హృదయాలు పాషాణం చేసుకోవాలి మీ మేనల్లుడికి నా పిల్ల ఇవ్వాలంటే అన్నారు”శీఘ్రముగా కుమార్తకు వివాహము సంకల్పించి వరునికై ఆంధ్రదేశము నా వలలు వేసి వెతికించినాడు అభిజాత్యము కలవాడు అన్న వస్త్రములకు లోపం లేనివాడు మంచి తెలివైనవాడు రూపవంతుడు గుణవంతుడు చదువుకున్నవాడు కావలెను అల్లుడు సుప్రసిద్ధ నియోగి కుటుంబంలోని వెతికించినవాడు

 ఆ బ్రతుకులాటలో తారాజువ్వలు బాలురకు ధనం ఉండదు. ధనమున్నవారు విద్యార్ధ దరిద్రతలో మునిగి ఉన్నారు బాలికలకు రూపసంపద ఎరువు తీసుకుని రావలెను కొంచెం కొంచెంగా నీ మూడును ఏకీభవించిన నరులు విషకుంబ సమానులు జమీందారు గారికి విసుగ జనించి శారదకు తగిన భర్త దొరుకునా అనిపించింది. నారాయణుని బెజవాడ ప్లాట్ఫారం మీద పుస్తకాల షాపు కాడ చూసిసరికి జమీందారు గారి హృదయము ఒక్కసారిగా వేలను ద్రవించి పోయినది అస్పష్టముగా ఒక్క వాక్కు ఇతడే శారదకు తగిన వరుడు అని ప్రతిధ్వనించినది కేవలము వ్యవహారములకు వచ్చిన వారి తోడను తోటి వారితో మాత్రమే సంభాషించు జమీందారు గారు నారాయణరావు కడకేకి మీకు వివాహమైనదా అని ప్రశ్నించారు మొగలిరేకులు రాజేశ్వరరావు వలన నారాయణని గురించి వివరములు అడిగి తెలుసుకున్నాడు 

సుబ్బారాయుడు గారు నారాయణరావు తండ్రి ఊరు కొత్తపేట.

 సుబ్బారాయుడు గారు మంచి సరస్సుడు మాటకారి తేనలూరునట్లు వ్యవహారమునైనను తేటతల్లముగా వివరింపగలరు వ్యవహార దక్షులైన సుప్రసిద్ధ న్యాయవాదులే ఆయన మాటలు చెవులారా వినరు అప్పులు షావుకారులకందరకు తప్పనివ్వగు ధన సంబంధ వాక్యములలో తప్ప ఇతరములు ఎడ ఆయనను సంపర్కం ఏదియు లేకపోయిననూ చక్కని బుద్ధి సూక్ష్మత పరిశీలనా తక్షత కలవాడగుట ఏ సంబంధమైనను న్యాయ సూత్రముల పట్ల విచిత్ర ఆలోచన చేయగలడు సలహా చెప్పగలడు చదువుకొని పట్టాను పొందిన చెవు భాష్యం అయ్యగారు కాదని తెలివి ఈయనకు కలదు. హిందూ న్యాయ శాస్త్రంలో ఇదివరకు లేని కొన్ని సూక్ష్మములను వివరించి ఆయన అసంగిన సలహాల వలన ఒక దత్తత అభియోగము నెగ్గినదనియు నా వ్యవహారపు తీర్పే దత్తత న్యాయమును చాలా మార్చివేసినదని ఇవ్వు కోనసీమలోని పండిత పామరులందరును తెలియను

 పచ్చని దబ్బ పండు చాయ మనిషి.పొడగరి ఆజానబాహుడు తెల్లగా నచ్చటచ్చట నిరసన తల గడ్డం మీసంలా ఆయనకు వింత శోభన్ ఇచ్చెను పాలము దిమ్మ వంటి వక్షముతో వడ్రవలు పెరిగిన కండలు ఊరిగిన బహుసంపదతో కోలనై పింకములకు మోముతో విశాలమైన లోతైన కాటుక కనులతో విరివియై విశాలమైన పాలముతో తెల్లని యజ్ఞోపవీతముతో ఆయన ద్రోణాచార్యులు తలపించుచుండును సుబ్బరాయుడు గారికి ఎన్నికల వచ్చును లెక్కలేదు ఆయన చెప్పు కథలు పెద్దలు కూడా తనివో వెనుచుందురు కొంచెం ఎత్తు తక్కువగా అన్ని భాషలలోని గ్రంధములన్నియు ఆయన పఠించినారు కథల సందర్భానుసారముగా ఆయన కల్పించవలసి వచ్చినను కల్పించు ఒక్కసారి కల్పించిన కథను మరల ఎన్నటికీ మరచిపోదు ఆనాటి సాయంత్రం ఏడు గంటలకు తన నాలుగవ కుమార్తె ఊకొట్టుచుండగా కాశీ మజిలీ కథలలోని అదృష్ట దీపకుని కథ ఆయన చెపుతుండదు పెద్ద కుమారుడు అతని సంతానమగు ఇద్దరు కుమారులను కుమారులు కుమార్తెలు సుబ్బారాయుడు గారి భార్య జానకమ్మ గారు కొందరు రైతులు ఎరుగుపరుగు బ్రాహ్మణులు చుట్టములు కాళ్లు పట్టుచున్న మంగలి విసనకర్రతో వేచుచున్న చాకలి ఆ కథను వినుచుండు ఇంతలో కొన్ని బండ్లు వారి ఇంటి ముందు దాగిన చప్పుడైనది. నారాయణరావులోపలికి వచ్చినాడు 

   రాయబారం:  డిప్యూటీ కలెక్టర్ గారు తహసీల్దారు గారు రాజమహేంద్రవరంలోని పెద్ద వకీళ్లు జొన్న పట్టణం నుండి జమిందార్ గారి మేనల్లుడు ఆనందరావు గారు పదిమందిలో కటకట లాడుతూ నౌకరులతో చాకర్లతో ఒక్కసారిగా సుబ్బరాయుడు గారి ఇంటికి వచ్చినారు సుబ్బరాయుడు గారు చిట్టమ్మలు కానీ వేరే కట్టించి ఉంచిన మేడహాలలో పడక కుర్చీల మీద ప్రేమ కుర్చీల మీద కూర్చున్నారు కలెక్టర్ గారు సుబ్బరాయుడు గారు కలెక్టర్ గారు తాసిల్దార్ గారు మీరందరూ తమతో ముఖ్యమైన పనిమీద వచ్చినారు తమరది కాదనక నిర్వర్తించవలసినది మాకందరికీ సంతోషప్రదమైన సంగతి అన్నారు

 సుబ్బారావు చిత్తం సమర్ సెలవిస్తే నేను కాదనే వాడిని ఎప్పుడూ కాదండి డిప్యూటీ కలెక్టర్ ;తొందరపడి మాట ఇయ్యకండిమాట ఇస్తే మేము మరి వదలం, సుబ్బారాయుడు చిత్రం 

శ్రీరామ్ మూర్తి నారాయణరావు అన్నయ్య జమిందార్ గారి మేనల్లుడు ఆనందరావు నారాయణరావు గారి అన్నయ్య మద్రాసులో ఆ కాలేజీలో ఒకేసారి చదువుతున్నారు ఆనందరావు; మా మా మామయ్య గారు తమ హృదయపు త్రిక శారదను తమరి ద్వితీయ పుత్రుడు నారాయణరావుకు  

ఇచ్చి వివాహము చేయ సంకల్పించి మమ్మల్ని అందరినీ మిమ్మల్ని ప్రార్థించమని మీ వద్దకు పంపినారు

 ఎంత ఎంత మాట వారు జమీందారు మేము సామాన్య గృహస్తులు ఆగర్భ శ్రీమంతుల పిల్లను నా కుర్రవానికి ఇస్తామని మీరైతే అనుగ్రహించిన నేను చూస్తూ చూస్తూ ఎలా సాహసించను

 ఆనంద; తమరాల సెలవియ్యకండి భోగభాగ్యాలకేమి వారికున్నది వారికి ఉంది మీకున్నది నీకున్నది 


దైవనిర్ణయం కథ

 




                   దైవ నిర్ణయం 

                 —----------------.


“కూలి పోయిన గుడిసె ముందు నిలుచుని గుండెలవిసేలా ఏడుస్తున్న రజియా ని చూసి, చలించి పోయారు రావుగారు.

హోరుమనే ఆ గాలి వానలో .రైన్ కోటు వేసు కొని వెళ్ళి మరీ,రజియాకి  ధైర్యం చెప్పి,

 తన ఇంటికి తీసుకొచ్చారు ..

గోలగోల పెట్టి  గుండెలు పగిలేలా ఏడుస్తున్న రజియా ,రావుగారు చెప్పిన మాట వినగానే,అతని పాదాలు

 పట్టుకొని భోరునఏడ్చి ఆయనను అనుసరించింది . 

..... కొద్ది గంటల క్రితం నుండి  కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది.. 

ఏకధారగా కురుస్తున్న  వర్షానికి ఏర్లుగెడ్డలు ఏకమౌతున్నాయ్ …ఇంచుమించుగా రావుగారి కాంపౌండ్ వరకూ నీరు వచ్చేసింది .

మస్తానయ్య  మాంసం దుకాణం, వారిఇల్లనబడే గుడిసె కూలి పోయ్యాయి .

చుట్టు ప్రక్కల  చాలా గుడిసెలు ఎగిరి పోయాయి…

ఏమిటో ,ఈ ప్రళయం!  ..ఈ వర్షం ఇంకా ఎక్కువై పోతుందంట  .కారు, షెడ్డు అవీ ఎలా. ఉన్నాయో నని, 

చూసివెడదామని వచ్చిన రావు,తమ షెడ్డు ముందర ఎత్తైన  గట్టు మీద వేసిన రేకు కింద,వర్షానికి తడవకుండా, 

చిన్న చెల్లెలిచేయిపట్టుకుని నిలబడి , ఏడుస్తున్న దాన్ని ఓదార్చుతూ మస్తాన్ కొడుకు  పదేళ్ల షరీఫ్ ..

వాడిని గట్టిగా పట్టుకుని వెక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్న మస్తానయ్య కూతురు..

ఆ పిల్లల్ని చూసి ,అరే!ఈ గాలి వానలో ఇక్కడ ఏమి చేస్తున్నారర్రా ?

 ఇంటికి పొండి. ?మీ అమ్మా, నాన్న  వెతుక్కుంటారు అన్నారు ..

 ఆ అమ్మాయి ముంతాజ్ బోరుమని ఏడుస్తోంది ..అబ్బాయి కళ్ళుతుడుచుకుంటూ,

 చెల్లెలిని దగ్గరకులాక్కుంటూ ,అదుగో !ఇప్పుడే మా ఇల్లు పడిపోయింది.సార్!

 ,భయం  వేసి చెల్లిని తీసుకుని పరిగెత్తుకొని వచ్చేసాను సార్ !

   ఈ  గాలి రానప్పుడు మా అమ్మ .మా చెల్లెలు ఆకలని ఏడుస్తుంటే,

పొయ్యి అవీ తడిసి పోయాయని ,మమ్మల్ని మా డాడీకి  అప్పజెప్పి, రోడ్డవతల ,తను పని జేస్తున్న  

 అమ్మగారింట్లో  మాకు తినడానికేమైనా అడిగి తెస్తానని వెళ్ళింది సార్ …

వర్షం తగ్గాక వెళ్ళి పోతాము.మమ్మల్ని ఇక్కడ  ఉండనీయండి సార్ .

ప్లీజ్ సార్ । చిన్ని చేతులు వాడి చెల్లెలు చేత్తో కలిపి  జోడించాడు వాడు.

రావు గారికి జాలి వేసింది .మరి ,మీ నాన్న ఏమయాడురా ? అన్నారు... 

మమ్మల్ని కూర్చోండి .ఇప్పుడేవస్తానని చెప్పి ,అమ్మ ,దాచుకున్న డబ్బులు పట్టుకొని తాగడానికి వెళ్ళి పోయాడు సర్... గాలికి మా ఇల్లు కదులుతుంటే భయం వేసి మీ షెడ్ కి వచ్చాం సర్  .

మేము ఏమీ తీయ లేదు. దొంగలం కాదు. మేము వచ్చాక మా ఇల్లు మొత్తం  పడిపోయింది.   .

మా చెల్లెలు అసలే ఆకలితో ఏడుస్తోంది .చెల్లెలి చేతులు వాడే జోడించి మళ్ళీ మొక్కాడు…

అయ్యో! మిమ్మల్ని ఏమీ చెయ్య నర్రా ।  ఈ గాలీ వానలో ఇక్కడ వద్దు .. 

మా ఇంటిరండని , పిలుచు కెళ్ళి ,వరండాలో ఉండమని లోపలికి వెళ్ళారు. 

పొడి తువ్వాళ్ళు తెచ్చి ఇచ్చి, తల తుడుచుకోమని ,తన బిస్కెట్స్ డబ్బాలోంచి కొన్ని బిస్కెట్స్ తెచ్చి ఇచ్చి తింటుండండి,ఇప్పుడే వస్తానని ఇంట్లోకివెళ్లారు రావుగారు …

అబ్బ! ఎక్కడికి వెళ్లారండీ ?ఈ గాలివానలో!     వేడివేడిఉప్మా  ,జీడిపప్పు వేసి చేసాను .చల్లాిరి పోతోంది .

మీ కోసం చూసి చూసి మామయ్యగారికిచెప్పి, ఆయనకు టిఫెన్ పెట్టి, మనిద్దరికీ ఆ హాట్ పాక్లో పెట్టాను. మీరు తినేయండి. .నేను“దేవీ భాగవతం”పారాయణ చేసుకొని తింటాను అన్నారు అనంతలక్ష్మి... 

“భర్త. మాట్లాడకుండా వెళ్ళి ,రెండు పేపర్ ప్లేట్లు తీసుకొచ్చి. ఉప్మా  వాటిల్లో సర్దుతుంటే ,ఆశ్చర్యంగా! అడిగారు ” .....ఏమిటది !ఎవరికి ,మీ స్నేహితు లెవరైనా వచ్చారా ? అని .

  మన పొరుగు మస్తాన్ ఇల్లు కూలిపోయింది ..పాపం అతని పిల్లలు భయపడి వచ్చి ఆ గాలివానకు మన షెడ్డులో   తలదాచుకున్నారు .. పాపం ఆ పిల్ల ఆకలికి గుక్కపెట్టి ఏడుస్తోంది .  తినడానికేదైనా తెస్తానని

వర్షం రాకముంద  వాళ్ళమ్మ వెళ్ళిందట ,ఈ గాలివానలో ఎక్కడ చిక్కుకుందో? ఇంకా రాలేదుట .

ఆ తాగుబోతు మస్తానెటో పోయాడట ,అన్నారురావుగారు,మంచినీళ్ళ బాటిల్ లో నీరు పడుతూఅన్నారు.. ఏమిటి ?మనకి పెద్ద సమస్యగా తయారయిన మస్తానయ్య,మనశ్శాంతి లేకుండా చేస్తున్న మస్తానయ్య ,

వాడి దుకాణంలో మాంసపు ముద్దలు  కాకులూ, గద్దలూ ,ఇటుపడిస్తుంటే ,నేను అడిగానని ,తాగి వాగి  పెద్దగొడవపెట్టిన మస్తానయ్య..ఇంత చక్కని ఇల్లు కట్టుకున్న ఆనందం మిగలనీయని ఆ మస్తానయ్య పిల్లలకోసం ,మీ కెంతో ఇష్టమని జీడిపప్పు నెయ్యివేసి. ప్రత్యేకంగా చేసిన ఉప్మా పెట్టేస్తారా? ఆ రోజు అతడేమి వాగాడో, మీ నాన్నగారు విన్నారు అడగండి ..అలాంటివాడి పిల్లల కోసం  ఫలహారం పట్టుకు పోతారా ?కావాలంటే రాత్రి మిగిలిన అన్నం  అని, ఆమె. ఏదో అనబోతుంటే .!వద్దు అనంతా ! వాడి తండ్రి ఏదో చేస్తే! పసిపిల్లలేమి చేస్తారు?

అయినా !ఆరోజు నుండి వాళ్ళమ్మ వచ్చి. ఏదైనా పడగానే శుభ్రం చేస్తోందిగదా..।

ఒకటి ఆలోచించు. పిల్లలు భగవద్ స్వరూపాలని నీవేఅంటావు కదా..  మొన్న నవరాత్రి పూజల ని అమ్మవారి రూపాల ని,రెండేళ్ళ నుండి పిల్లలి కోసం వెతికి వెతికి తెచ్చి, రకరకాల పిండి వంటలతో  భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పూజలు చేసావు... ఆపిల్లలంతా ఆగర్భ శ్రీమంతులు ..ఆకలి తెలియనివారు .ఈ పిల్లలు ఆకలితో  అల్లాడుతున్నారు ?వీరు అమ్మవారి  స్వరూపం కాదా ? మస్తాన్  కూతురు ఆడపిల్ల అమ్మ  ఆ అంశం  కాదా?   ఆలోచించు.ఈ పిల్లలు తిని సంతోషిస్తేనే,  అమ్మవారు నిన్ను ఎక్కువ అనుగ్రహిస్తుంది ,ఏమో? అని, ఆ ప్లేట్లు పెద్ద ప్లేట్లొపెట్టి  ,నీళ్ళ సీసా పట్టుకుని వెళ్ళారు  రావుగారు 

భర్త  బయిటకెల్తుంటే,  నోటమాట రాక అతనన్న ప్రతి మాట నిజమని పించినా ?మస్తాను వాళ్ళసలు మనదేముడినే నమ్మరు కదా ,మామయ్యా !అంటున్న అనంత లక్ష్మితో.  ....

మామగారన్నారు . ఆకలి తీర్చడానికి  మంచి మనసు, మానవత్వం కావాలమ్మా...మతం కులం కాదు

వాడు పూజలు వ్రతాలు చెయ్య డని మనం అనుకుంటా మమ్మా” !  ఆత్మశుద్ధి లేని ఆచారాలనునమ్మడు ,

కానీ!.ఆత్మశుద్ధితో అంతరాత్మ చెప్పింది చేస్తాడు” ..వెళ్ళు, వెళ్ళి మంచిని అనుసరించు అంటే 1

నివ్వెరపోయి భర్తననుసరించారు  అనంతలక్ష్మి.....

అనంతలక్ష్మిని  పిల్లల దగ్గరుండ మని, కిటికీలోంచి రజియా రావడం చూసి వెళ్ళి, పిల్లలుతన దగ్గర క్షేమంగా ఉన్నారనిచెప్పి ,తీసుకొచ్చారు రావుగారు. తన పిల్లలుటిఫెన్  తింటూ, అనంతలక్ష్మితో కబుర్లు చెబుతుంటేచూసి ,ఆమె పాదాలపై పడి.,  మీరు దేవత ,అయ్యగారు దేముడూ నమ్మా....

కాపాడి కన్నతల్లిలా ఆదరిస్తున్నారు..మీ మేలుజీవితంలోమరువనమ్మా  అని కన్నీళ్ళు పెట్టుకుంది రజియా ..

  అయ్యో !క్షేమంగా నీ పిల్లలిని చేరుకున్నావు ..ఇదిగో ,ముత్తయుదువు కిద్దామని పెట్టిన చీర .

అమ్మ వారు నీరూపంలో వచ్చిందనుకుంటాను .ఆ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకో ...తల బాగా తుడుచుకో …

అసలే వట్టి మనిషివికావు ..  నీ పిల్లలకి  మా మనుమలి బట్టలు వేసారు   మీ అయ్యగారు ..నేను టీకాచి.   తెస్తాను అని లేచారు అనంతలక్ష్మి.   

“పిల్లలిని పొదివి పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది రజియా బేగం .

తండ్రి ఎలా వెల్లాడో,  ఇల్లెలా కూలిందో,   చెల్లీ ।ఎలా  తను   రావుగారింటికిఎలా వచ్చారో.  వివరంగా చెప్పాడు  అబ్బాయి...ఆయన  ఆదరించడం ,అన్నీ కొడుకు వర్ణించి చెప్తుంటే,  ఒక  నిశ్చయానికి వచ్చిన రజియా   రావు గారితో అంది ..నా తండ్రి కంటే మీరు నయం బాబూ .....మా  తండ్రి.  తాగుడు  వ్యసనం వలన 

మస్తాన్   దగ్గర. డబ్బులు వాడేసి.    అప్పు తీర్చమని గొడవ పెడితే. నన్ను ఇచ్చి పెళ్ళి చేసాడు .తర్వాత తెలిసిందయ్యా... అప్పటికే రెండు పెళ్ళిల్లు  చేసుకుని స్థిరం లేక తిరుగుతాడని ..తిరుగుతాడని...కానీ।ఏంచేసేది. అప్పటికే. పిల్లడు కడుపున పడ్డాడు..అతగాడికి ఆ తాగుడు తప్ప, ఏమీ  పట్టదు బాబూ! ఇన్నాళ్లూ భరించాను..

ఇక నా వల్ల కాదు...ఈ రోజు  మీరు లేక పోతే నా పిల్లలు నాకు కాక పోదురు బాబూ!నా బతుకెలాగూ నాశనమైంది.ఇంకా నే నతని తోనే ఉంటే. పిల్లలు పాడయి పోతారండీ  బాబుగారూ !ఎవరికైనా అమ్మేస్తాడు .

ఇప్పుడే! నేను పనిచేస్తున్న అమ్మగారు అడిగారు బాబూ,వాళ్ళఊరురమ్మని.. 

ఆమెగారు, ధనవంతురాలైనా ,చదువుకున్నదైనా నాలాగే, ఒకడి వలన మోసపోయారు..ఆమెకు పిల్లలు లేరు ..  

ఆమె  తండ్రికి పెద్ద  స్కూల్, హోస్టలు, ఉన్నాయిట ..ఆమెతో పాటు వచ్చి , నన్ను హోస్టల్. లో పిల్లలకు   వంటపని చూసుకోమన్నారు.పిల్లల్ని ఆస్కూల్లో చదివించుకోమన్నారు .నాకు ఉండడానికి ఇల్లు ఇస్తామన్నారు ..

పిల్లల బ్రతుకైనా బాగుంటుంది .నేను వెళ్ళిపోతానమ్మా !వర్షం తగ్గాక. ఆ అమ్మగారింటికి వెళ్ళి పోతామమ్మా ! 

ఎక్కడున్నా  మీమేలు మరువనమ్మా। అంటూ నమస్కరించింది  రజియాబేగం ..

ఇంతలో పరిగెత్తుకుంటూ రజియా ప్రక్క గుడిసెలో రిక్షా రాముడు వచ్చాడు. .రజియక్కా । మీ మస్తాను. కల్లు పాకదగ్గర తాగేసి పడిపోయాడట .ఆప్రక్కన పాతగోడ కూలి మీదపడ. చనిపోయాడట ..అందరూ, నీకో సం వెతుకుతున్నారట.పదక్కా!.నా ఆటో లో తీసికెల్తాను .అన్నాడు..

అయ్యో । అని గుండెలు బాదుకుంటూ  పిల్లలనుతీసుకొని  మమ్మల్ని దిక్కు లేని వాళ్ళను చేసావా ? అల్లా అని ఏడుస్తూ  రాముడిన  అనుసరించింది రజియా .. “దైవ నిర్ణయం “ ఇది అని నిట్టూర్చారు  రావుగారిదంపతులు ..



                       .................సమాప్తం................




        ..


 

  


     



 


 





తాడు తెగింది

        తాడు తెగింది...

“ మాసిన చిరుగులచీర, జాకెట్టు,  పిచ్చిపిచ్చిగా ముందుకు వెనక్కు ఎగురుతున్న జుట్టు, ఒంటినిండా గాయాలు,

మనిషి గుర్తుపట్టలేనంతగా కాటుక ,మసి పూసుకుని.ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టుకళ్ళతో ఒకామె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు

రోడ్డుప్రక్కనున్న  మర్రిచెట్టు కిందకూర్చుని  ఏడుస్తూఉంది. . 

పోలీసు స్టేన్ వైపు చూస్తూ బొట్టు చెరుపుకుంది..చేతి గాజులు పగల కొట్టుకుంటోంది...మెడలో తాడు తెంపేసుకుని విసిరేసింది.

.చేతిలో గుడ్డసంఛి  గుడ్డతో చుట్టినపెద్ద దిష్టిబొమ్మ, కర్ర  ఉన్నాయి,, 

ఆ కర్రతో ఆ బొమ్మను కొడుతూ   నన్నిలాగే కొట్టావు కదరా !

“ చావరా చావు చచ్చినోడా.!నన్ను చావగొట్టావుకదా ?చూడు నేను కూడా నిన్ను ఎలా కొడుతున్నానో!

 చూడు అని ,ఆ బొమ్మని కొడుతూ,చేతులు కాళ్ళు వెనక్కి విరిచేస్తూ ,  పకపకా నవ్వుతూ, మళ్లీ అంతలోనే తల బాదుకుని ఏడుస్తూ,

 నాకిలా కావాల్సిందే! నా వాళ్ళని వదిలి మోసం చేసి నీతో వచ్చేసాను కదా! అందుకు నాకు

 ఇలా జరగాల్సిందేఅని ఏడుస్తూ,,తనలో తనే ఏదో గొణుక్కుంటూ, శూన్యంలోకి చూస్తూ, కోపంగా అరుస్తూన్నది.

చూడగానే పాపం ఎన్ని బాధలు పడిందో? ఎవడు మోసం చేసాడో?! పాపం పిచ్చిది అయిపోయింది

అని , ఆ తోవన  పోయేవాళ్ళు జాలి పడుతూ  , తినడానికి ఎవరైనా ఏదైనా పెడితే ,

అక్కడ తిరుగుతున్న కుక్కలను  రండమ్మా రండి,కడుపునిండా తినండి. .హాయిగా తిరగండి. 

మీకేనయం విశ్వాసం ఉంది. అంటుంది..ప్రేమగా దగ్గరకు తీసుకుని ఒళ్ళు నిమురుతుమంది .

 పాపం పిచ్చిదనిత్రోవనపోయే  జనాలు జాలిపడుతున్నారు..

.కాని స్టేబుల్ వచ్చి ,ఎవరమ్మానువ్వు ?నీపేరేంటి ? అంటే , గాల్లోఖీ చేతులుజోడీంచి దండంపెట్టింది. 

నీపేరేంటి అంటే ? నిప్పు .నిప్పు కాలుస్తుంది అంది..అతడు విసుగ్గా....పోమ్మ ,పో !ఇక్కడ కూర్చోకూడదు. 

ఇది పోలీస్ స్టేషన్.. ఇక్కడ కూర్చోకూడదు అని అదిలించాడు.. తనకేమీ పట్టనట్టు ఒక వీధి కుక్కను దగ్గరగా తీసుకొని,ఇదే మన ఇల్లు ఇక్కడ ఉందామా? 

నాకు తోడు ఉంటావా తమ్ముడు..ఇడుగో వీడు పొమ్మన్నాడు .

 అని భోరున ఏడుస్తూ,,ఆ కుక్క వెళ్ళిపోతే అయ్యో !నన్ను వదిలి పోతున్నావా ?అని శోకాలు పెడుతుంది..

 ఏయ్ ! ఇక్కడనుండి పోతావా ,పోవా ?అని అరిస్తే,, మాఅమ్మతో చెప్తానుండని గట్టిగా ఏడూస్తోంది … “ త్రోవనపోతున్న వారు, లోఫలికి వస్తున్న మీడీయావారు అడిగారు ..

.ఏమి పోలీసువయ్యా!?ఇలాటీవారికి ఏదో ఆశ్రయం చూపి ,రక్షించేది పోయి, పాపమ్ ఆపిచ్చిదాన్ని పొమ్మంటావేం?     

నిరాశ్రయులుమీద నీ ప్రతాపమా అని నిలదీసాడు”..

:”నాకు చచ్చే చావువచ్చింది.. ఈరోజు కమిషనర్ గారు,, ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు..  

మా ఎస్ఐ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారట:.. అసలే మా ఎస్ఐ ఇవాళ స్టేషన్ కిచుట్టుపక్కల ఎవరూ రాకుండా కాపలాకాయు అన్నారు.ఎస్సై

.ఽతడీకసలే అనుమానం..ఈ పిచ్చిది చూస్తే ఎక్కడి నుండి కదలడం లేదు’.

.పబ్లిక్ మీడియా ఇలాటి సలహాలిస్తున్నారు అనిమనసఉలో అనుకుని.. ..వాళ్ళముదరే..

  హేయ్ ,అమ్మా! ఇక్కడ కూర్చో.. సిఐ గారు వచ్చి వెళ్ళిపోయాక నేను నిన్ను హోమ్ లో చేరుస్తాను అన్నాడు జాలిగా.   

తనకు ఏమీ పట్టనట్లు తల గోక్కుంటూ  ఎటో చూస్తూ కొనుక్కుంటుంది ఆమె.

 కమీషనర్   వచ్చారు. ఇన్స్పెక్షన్ ఎంక్వయిరీలు అయ్యాయి..

 “ఆ అమ్మాయిల  మిస్సింగ్ కేసు విషయంలో నీ హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి ., 

 ఇది నిజం కాదని నాలుగు రోజుల్లో రుజువు చేసుకోకపోతే, నిన్ను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి, 

 విసురుగా బయటకు వచ్చాడు చంద్రగుప్త..

ఎస్సై ఏకాంబరం ఏదో చెప్పబోతూ, అది కాదు సార్ అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నారు .

నాకు ఏ పాపం తెలియదు అన్నాడు.అలాగా !అదే నిరూపించుకో ,అని విసురుగా బయటకు వచ్చారు 

అతను.. కారు ఎక్కబోతున్న  కమీషనర్ గారి  దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలు పట్టుకుందాపిచ్చిది,, 

ఎవర్రా ! దీన్ని లోపలకిరానిచ్చారు ?బయటకు తరమండీ.అన్నాడు ఎస్.ఐ ఏ ఏకాంబరం ఆందోళనగా…

.ఆమె ను చూస్తే అతడీకేదో అనుమానమ్ వచ్చింది .పోలీసులు అదిలిస్తున్నా.

ముందుకు పరిగెత్తి కమీషనర్ గారి  కారుదగ్గరకు పరిగెత్తుకొచ్చిన ఆ పిచ్చిదాన్ని చూసి 

ఎస్సై ఏకాంబరం ఏదో అనుమానం బలపడీ, బలవంతంగా లాగుతున్నా,,ఏడుస్తూ ,

పాత గుడ్డ మూట కమిషనర్ గారికి  ఇచ్చి   ,మా బాబే ,మా నాయనే,ఇవి నీకోసమే దాచాను.ఎవరికీ  ఎవరికి ఇవ్వకేం!.. 

దొంగలు పట్టుకొని పోకుండా చూసుకో. ఈ డబ్బంతా నీకోసమే  దాచాను..దాచుకో   నీకే అని చెప్పి ,

ఏకాంబరం ని చూపించి,అమ్మో !నన్ను చంపిస్తాడని చూసి భయపడుతూ ,కమీషనర్ గారి  వెనకాతల దాక్కుంది 

ఆ పిచ్చిది..

ఆమె జబ్బ పట్టుకుని బలవంతంగా లాగుతున్న ఏకాంబరం పై విరుచుకుపడ్డారు కమిషనర్ గారు. …

ఆపవయ్యా !ఆపునీ జులుమ్..నీ ప్రతాపమంతా పిచ్చి వాళ్ళ మీద, పేద వాళ్ళ మీద,బలహీనుల మీద నా? 

 పనిలో చూపెట్టు.. నీ మీద ఎన్ని కంప్లైంట్లు వచ్చినా,మారతావని టైం ఇచ్చి చూశాను,, నిన్న ఆ జర్నలిస్టు కేసులో మీడియా కోడై కూస్తోంది. 

 అమ్మాయిలు మిస్సింగు కేసులో నిన్ను నువ్వు, నిరూపించుకోకపోతే, తర్వాత నేను ఏమి చేయలేను అన్నారు. ఎస్  సర్ .

 ఽఅగుడ్డామూటా కమ్పు కొడూతోంది. ఇలా ఇవ్వండీసర్ .బయిటా విసిరేస్తాను 

 అన్న ఏకాంబరాన్ని ఎగాదిగా చూసి  ఇమ్తకన్నా కంపు కొడూతున్న వ్యవస్టను బాగుచెయ్యడానికి 

 ఈరంగంలో దిగిన వాడీని  ఈ పిచ్చితల్లి గుడ్డలమూట కంపు లెక్కేమిటి?..నీవు నీసంగతి చూసుకోనేను ఈ పిచ్చితల్లిగురించి చూసుకుంటాను అని ,

 నాతొ రా ,అమ్మా !నీకు భయం లేదు అని ,అందరూ ఆశ్చర్య పోతుంటే,కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు,కమిషనర్ చంద్రగుప్త గారు.  

 ********************************************************88

 “ఆయన ఈ పట్టణానికి వచ్చి ఆరు నెలలు అయినా, చిన్న కుర్రాడే అయినా!.

నిజాయితీగల మంచి మనసుగల  ఐ .పి.ఎస్. పోలీస్ ఆఫీసర్. మానవత్వం గల వ్యక్తిగా  చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.

గొప్ప ధైర్యసాహసాలు గల ఐపీఎస్ ఆఫీసర్. ఎవర్ని ఎక్కడ ఉంచాలో, అక్కడ ఉంచుతారు . ఏకాంబరం గురించి ఎన్నో కంప్లైంట్లు వెళ్ళినా, 

సమయంకోసమ్ చూసి ఈరోజు నిర్ధారించుకున్నా.రు..

   “ఈరోజు ఉదయాన్నే జాగింగ్ చేసుకుంటున్న,అతని దగ్గరకు, ఏకాంబరం బార్ నుండి తప్పించుకుని పరిగెత్తి 

వచ్చిన ఓ యువతి చెప్పిన సమాచారం విని .కోపంతో ఊగిపోయారు. ఆ అమ్మాయి చెప్పింది శ్రద్ధగా విన్నారు.

ఆడవాళ్ళని ,పిల్లలను దుబాయి పంపే ముఠాలతో పెద్ద సంబంధం ఉందని ముందే  ఏకాంబరం మీద ఎంక్వయిరీ కి వస్తున్నట్లు నిన్ననే సమాచారంపంపారు.అతనిపై నిఘా పెట్టారు కమీషనర్ గారు

              —------------------------------------------------------------------------------------------

  కమిషనర్ గారికారు ఆటు వెళ్లగానే  పరుగు పరుగున ఇంటికి వెల్లాడు ఏకామంబరం.. 

 వీధితలుపుకువేసిన తాళం వేసినట్లు ఉండడంతో హాయిగా ఊపిరి పీల్చుకుని, తాళం తీసుకుని లోపలికి వెళ్లి ఇల్లంతా వెతికిన ఎస్ఐ ఏకాంబరం తలపట్టుకు కూర్చుండి పోయాడు..

ఇల్లంతా వెతికినా తన భార్య దుర్గ కనబడలేదు. పెరటి వైపు ఎప్పుడూ వాడనిస్టోర్ రూమ్ పడిపోతున్న కిటికీ తొలగించి  బయటపడి పారిపోయింది. 

ఎంత పని చేసింది?. అంత ధైర్యం ఎలా వచ్చింది?ఆ జర్నలిస్టు పిల్ల ఏదో నూరిపోసి ఉంటుంది.. పళ్ళు పటపట కొరికాడు ఏకాంబరం.. 

పరార్ అయిపోదామని బేగ్ సర్దుకొని బయటకు వచ్చిన ఏకాంబరం, ఎదురుగా పోలీస్ బందోబస్తు తో తనను కస్టడీలోకి తీసుకున్న సీఐ చిన్నారావుతో 

,కమిషనర్ గారు నన్ను రుజువు చేసుకోమన్నారు కదా?

అందుకోసమే వెళుతున్నాను.. ఆధారాలేవి ? అరిచాడు ఏకాంబరం..

ఇవిగో, ఆధారాలు ..ఇవిగో నీటెర్మినేషన్ ఆర్డర్. ఇవి గానీ బేడీలు అంటూ వరుస మీద అన్నీ చూపెట్టాడు చిన్నారావు.               

 ఆ ఫోటోలు చూసిన ఏకాంబరం బుర్ర గిర్రున తిరిగి భూమిలోకి వెళ్ళిపోయింది.

పబ్బులో, క్లబ్బులో, తన శృంగార లీలలు.. తనపై తన  అరాచకాలపై  దుమ్మెత్తి పోస్తున్న ఆడావాళ్ళు,

తన చేతిలో దెబ్బతిన్న మహిళల వీడియోలు .. ఇవన్నీ ఎలా ఎలా వచ్చాయి?

ఇదంతా ఫేక్ .గొణుగుతున్నట్టగా అన్నాడు ఏకాంబరం.. 

            అవునా? పాపం . నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాల్సిన అవసరం ఉందని, 

నీ చేత ఈ చండాలం పనులన్నీ చేయించిన నీ రాజకీయ రక్షకులే చెప్పారట. 

నీతో వాళ్ళకేం సంబంధాలు లేవని అన్నారట.. విను, అని అది కూడా వినిపించాడు సీ.ఐ ..

చేసేదిలేక చేతులతో మొహం కప్పుకుని జీపు ఎక్కాడు ఏకాంబరం…

—-----------------------------------------------------------------------

     ‘తనతో కారెక్కిన  పిచ్చిదాన్ని అడిగారు కమిషనర్ చంద్ర గుప్త గారు.నువ్వెవరో నాకు తెలుసమ్మా!

” అమ్మా! మా ఇంటికి వస్తావా? మా అమ్మ చాలా పెద్దది. మా అమ్మకి సేవ చేస్తూ మా ఇంట్లో ఉండి పోతావా ?

నీకు ఏ భయం లేకుండా నేను చూస్తాను.అనునయంగా అన్నారు. 

అలాగే అన్నట్లు తల ఊపి. వెంట తెచ్చుకున్న భయం పోయి,ఆశ్చర్యమ్ ఆనందంతో ఒకేసారి వెక్కిళ్ల రూపంలో దుఃఖం బయటకు వచ్చింది. 

ఆమెనలాగే ఏడవ నిచ్చి తనైంటికి  తీసుకుపోయారు చంద్ర గుప్త గారు.

     ఇంట్లో కి వెళ్ళాక. నువ్వెవరో నాకు తెలుసు.  ఆ పోలీస్ స్టేషన్ ముందు నువ్వు ఉంటావని కూడా తెలుసు.

.ఆ అమ్మాయి అంతా చెప్పింది.నీకు నా ఇంట్లో ఎలాంటి ఆపదా రాదు. నా అక్క చెల్లెలుగా 80 ఏళ్ల మా అమ్మకు సేవలుచేస్తూ ఇక్కడే ఉండి పో. 

అమ్మ ఆరోగ్యంగానే ఉంది  తిరుగుతుంది లే. ఆమెకు సహాయం గా ఉంటే చాలు.నా భార్య కూడా పోలేసు ఆఫీసరే.....

ఆ దుర్మార్గుడు నిన్ను ఏమీ చెయ్యలేడు.జీవితం లో ఇక  బయటకు రాడు.   

       అదుగో! అమ్మ హాల్ పక్కన అమ్మ గది .ఆపక్కన నీ గది.. ఆ గదిలో ఉంటూ రేపటినుండి అమ్మనుచూసుకుందువు.

       ఈ రోజు స్నానం చేసివిశ్రాంతి తీసుకో.. మీ గదిలోకి భోజనం పంపించుతాను .తిని నిద్రపో అమ్మా! నాకు చాలా పని ఉంది అని అన్నారు చంద్ర గుప్త గారు.

 కన్నీటితో ఆయన పాదాలపై పడి. కృతజ్ఞతలు చెప్పుకొన్నది ఆమె..      

లే లే! నీ తమ్ముడు లాంటి వాడిని అని చెప్పాను కదా!               ఆ నరకాసురుడు జైలు పాలవుతాడు.

 ఇక నీ జీవితంలో నిత్యం దీపావళిపండగే. నీకు జరగవలసిన న్యాయం జరిగేలా నేను చూస్తాను    అని వెళ్లిపోయారు.

.....................................................................................................................

‘పని అమ్మాయి వచ్చి ఆ గది చూపెట్టి, మీరు స్నానం చేయండి. నేను టీ తెస్తాను అని వెళ్ళిపోయింది.’

స్నానం చేసి వచ్చినతర్వాత ఆమెను చూసి విస్తుపోయిందిఅమ్మాయి..

 వంటినిండా గాయాలున్నా,”కడిగిన ముత్యంలా ,బక్క చిక్కిన బంగారు బొమ్మలా ఉంది.”

ఇందాక చూసిన ఆ పిచ్చి రూపుకు,స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ రూపానికి పోలికే లేదు..

మిమ్మల్ని నేను ప్రశ్నలు వేయకూడదని సార్ చెప్పారు.  మీరేనా? ఎలా నటించారు? ఎలా మారిపోయారమ్మా?వావ్.. .

అమ్మో! సార్ తో ఇలా అన్నాననవద్దు. ఆశ్చర్య పోయి అన్నాను అంతే! అని ,

ఆ అమ్మాయకొబ్బరి నూనె, గాయాలకు ఆయింట్మెంట్ తెచ్చి  ఇక్కడ పెట్టాను. నేను మందురాయనా?అంది..  

వద్దులేమ్మా! నాకు ఎప్పుడూ వేషాలు వేయడం తెలియదు. కానీ తప్పనిసరై ఈరోజు మా ఇంటి పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లో గ్రీజు ఇంట్లో కాటుక .నల్ల రంగు. అన్ని కలిపి పూసుకున్నాను.అందువల్లనే ప్రాణాలతో మిగిలాను అంది ఆమె

. పోనీలే!ఇక నీకు నటించాల్సిన అవసరంరాదు ...నన్ను కూడా ఒక నరకం నుండి తప్పించి, నాకెంత మంచి బతుకు కల్పించిన మహానుభావుడు ఇతను. ఈ బాబు చల్లని నీడలో ప్రశాంతంగా బతుకుతున్నాను. 

నీవు కూడా ఏ చింతలూ పెట్టుకోకుండా జరిగింది పీడకల మరచిపోయి అమ్మ గారి సేవలు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకు. మనం బయటికి వెళ్ళినా భద్రత ఉండదు.మన బతుకులకు వేరే దేవుడు లేడు... ఈ కమిషనర్ బాబే అని నమస్కరించి వెళ్ళిపోయి,,భోజనం తెచ్చిపెట్టింది ఆఅమ్మాయి ..

ఆ అమ్మాయి వెళ్ళిపోయాక చాలా కాలం తర్వాత కడూపునిండా తిని ,తలుపులేసుకుని పడుకున్న ఆమె సినిమా రీలులా గతమ్ కళ్ళ ముందు కదులుతూ ఉంటే, ఆ భయానక దృశ్యాన్ని తలుచుకుంటేనే భయపడిపోయింది..

అయినా మనసు   మాటవినదు ,గతాన్ని మరువనివ్వదుకదా !

---------------------------------------------

ఒళ్ళు తెలియకుండా అర్ధరాత్రి దాటే వరకూ తాగి, మంచానికి అడ్డదిడ్డంగా పడుకొని తెల్లవారకముదే లేచిన ఆ దుర్మార్గుడు, లేస్తూనే తాళం వేసిన గదిలోకి వెళ్లి ,బయటకు వచ్చి ,పడుకున్న తనను పొట్టలోతన్ని ,

తోకతొక్కిన త్రాచులా బుస్సుమన్నాడు . ఎంత ధైర్యం నీకు? దాన్ని వదిలేసావా? అందువల్ల నా ఉద్యోగం పోతుంది అని తెలుసు కదా? అయినా తాళం తీసి వదిలేసావా? మాటాడావేమే,,ముంగీ  ? ఈరోజు వాకమిషనరు వస్తున్నాడు నా పాలిటనా మీద ఎంక్వయిరీ కి.. ఆ పిల్లవాడిని కలిస్తే బతుకు బద్దలై పోతుంది. అసలు నువ్వు నాపెళ్ళానివేనా? నా శత్రువువా?అని కోపంతో ఊగిపోతూ బెల్ట్ తీసి“కొట్టినంతసేపు కొట్టి, తన్నినంతసేపు తన్ని, ,కర్రతో పశువు ని బాదినట్టు బాది, ఉబ్బిన కళ్ళతో ఉరిమి చూస్తూ, పొడుచుకొచ్చిన పొట్ట, క్రింద పడిన కర్ర తీయడానికి కూడా ఒళ్ళు వంగనీయనంతగా అడ్డోస్తుంటే ,ఆయాస పడుతూ,,,అడ్డమైన కూతలూకూస్తూ,ఈ జర్నలిస్టు..ఆ పిల్ల దొరక్కపోతే  ఈ రోజు నా చేతుల్లో నీకు చావు తప్పదు.  దొంగ ముండా !నా జేబులో పడవలసిన 50 వేల రూపాయలు, నీవలనే అందకుండా పోయాయి.. ఆరోజు పసిపిల్లలను తప్పించేశావు.నాకుతెలుసు నువ్వే ఈరోజు ఈ పిల్లను    తప్పించావు.వేసిన తాళం వేసినట్లు ఉంచి ఆపిల్లను ఎల్ఎలాతప్పించావు ? ఆ బక్కపిల్ల కిటికీ ప్రేము తీసే గలదా? మెకానిక్ షాప్ కాడ ఎవడినో పిలిచిఆ చువ్వలు వంచీమని ఉంటావు...ఆడెవడో తెలుసుకూంటాను ..తర్వాత నిన్నుచంపి సమాధి చేస్తాను..

పాతికతులాల  బంగారం తో వచ్చిన, నా పెౡ పెళ్ళానే పాతిపెట్టిన వాడిని... .ప్రేమ పేరుతో  పాతిక వేలుతో వచ్చిన నిన్ను చంపడం నాకు ఒక లెక్కా.. నువ్వుచస్తే నాదే బాధ్యతని   మీ అయ్య మున్దే కేసు పెట్టాదు గాబట్తటి ఆలోచిస్తన్నాను .ఇవాళ తీసుకెఌ ఏతట్లో ఇసిరేస్తాను .మదనష్టపుధాన  నీ మొఖం చూడాలి అంటే నే అసహ్యం .

అని బూటు కాళ్లతో బలంగా తన్ని, అసలు ఈ రోజు అకస్మాత్తుగా ” కమిషనర్ .వస్తున్నాడన్న హడావిడిలో ఉన్నాను”. లేకపోతే నీ ప్రాణమైన తీసి ఆ పిల్లని ఎక్కడికి పంపావో ,నీ చేత చెప్పించే వాడిని .

ఏమయింది ,ఆపిల్ల .?..నావి  నా స్నేహితుడువి గుట్టు మట్లన్నీ ,వీడియో తీసింది ..అందుకే వెంబడించి పట్టుకుని మత్తు మందు చూపెట్టి తెచ్చాను.దాని మత్తు దిగిన తర్వాత దాన్ని ఏం చేయాలో చేద్దాం అనుకున్నాను.

ఈ లోపం నాకు మొద్దు నిద్ర పట్టేసింది. ఆ పిల్లని నువ్వు తప్పించేసావు. ఆధారాలన్నిదాని దగ్గర ఉన్నాయి.

 “ కల్లు తాగిన కోతిలా చిందులు వేస్తున్నాడు ఎస్ .ఐ. ఏకాంబరం.

అన్ని దెబ్బలు తింటూ,భయంకరమైన ఆ బాధను భరిస్తూ ఆ అమ్మాయి కిటికీ కర్టెన్ వెనకాతల అమర్చిన వీడియో కెమెరా గురించి, తన చేతికి ఇచ్చిన వీడియో గురించి, సెల్ ఫోన్ గురించి పెదవి విప్పి చెప్పలేదు . అంత బాధను పళ్ల బిగువున ఓర్చుకుంటూ నాకేమీ తెలియదని ఏడుస్తూనే ఉంది...

కమీషనర్  విజిట్ అయిపోగానే వచ్చి నీపని పడతాను ముందు ఆపిల్ల ఆచూకీ తెలుసుకోవాలని అని విసురుగా వీధి తలుపు తాళం వేసుకునివెళ్ళిపోయాడు ఎస్ ఐ. ఏకాంబరం”…

     “ఏడ్చి ఏడ్చి అలా ఎంత సేపు ఉండి పోయిందో తనకే తెలియదు. శక్తినంతా కూడదీసుకుని లేచింది..

“. నువ్వు కాదురా! ఈరోజు నీ అంతం నేను తేలుస్తాను. ఇన్నాళ్ళగా  పరువు మర్యాదలకు పాకులాడేను.

 నా పండంటి బతుకు నీ పాపిష్టి చేతిలో పెట్టాను”. నమ్మినందుకు నా గొంతుకోయడమే కాదుఎందరి ఆడ పిల్లల ఉసురు పోసుకుంటున్నవో?నీ బతుకు చెడ,. ఆ వుద్యోగం కాస్త ఉడిపోతే.. కుక్కలు కూడా నిన్ను చూడవు .”

నీ డబ్బులకు ఆకర్షింపబడి,నీ పోలీస్ ఉద్యోగానికి భయపడి,  నీ కామాగ్ని చల్లార్చు తున్న  ఆడవాళ్లు,

 చీపుర్లతో కొట్టి ,చేటలు నీ మెడలో వేసి ఊరేగించే రోజు రాకపోతే నేను నేను బెజవాడ దుర్గనే కాదు”..

 ప్రేమ పేరుతో నమ్మించి ,నావారందరికీ దూరం చేసావు ..మూడేళ్ళకే మోజు తీరిపోయి ,కాల్చకు తినడం మొదలు పెట్టావు . పిల్లలు ల్eకుండాఆ ఆపరేషన్ చేయించావు  ...కట్టుకున్న పెళ్ళాన్ని, నా ముందే కులటలతో కులుకుతూ నాచేత చాకిరేచేయించు కోని, తాగి తందనాలు ఆడుతూ, పెళ్లయి పదేళ్లు దాటిన నా పుట్టింటినుండి తెచ్చిన డబ్బులింకా చాలవని చావగొడతావు ...కాపలాకాయు కావలసిన నువ్వే,   కాలం మీద ఉన్న పిల్లలను కాని పనులు చేస్తున్నట్లు కేసులు పెట్టికాసులకు అమ్ముకుంటున్నావు. కొందరిని నీకామానికి బలి చేస్తున్నావు..

పసిపిల్లలు  నీపాలబడితే తెలివిగా తప్పించాను.

నిన్న  ఆ  జర్నలిస్టు. నీ మీదా, , నీలాగే అడ్డగోలుగా సంపాదించి అడ్డమైన వ్యసనాలకు లోనై న దుర్మార్గులైన నీ స్నేహితులమీద , కలిసి అరాచకాలు చేస్తున్నావని వీదియోలు తీసిందని, ఏదో పేపర్ లో రాసి, చానల్లో ప్రసారం చేసిందని పగబట్టిప్లాన్ వేసి, డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్న ఆ పిల్లను బలవంతంగా జీప్ ఎక్కించిమత్తుమందిచ్చి  మన ఇంటికి తీసుకు వచ్చావ్..తాగి తూలుతూ లోపలకు వచ్చి,ఆ పిల్ల ని ఆ గదిలో పెట్టి తాళం పెట్టి నన్ను కాపలా పెట్టావు.నువ్వు స్నానం చేసి వచ్చేలోపున  నీ తిదడిలోనిద్రమాత్రలు నాలుగుంటే కలిపాను .అర్ధరాత్రి దాటాక తెలివొచ్చిన   ఆ పిల్లగోల ఏడుపు వినలేక నేను తలుపు తీసేసాను.ఒకనెంబరిచ్చి  ఫోన్ చేయమంటే చేశాను..ఒకతనువచ్చి  బయటినుండి ఆ కిటికీ చువ్వలు తీసి ఆ పిల్లను తీసుకుపోయాడు.

ఆ పిల్ల నాకన్నీ ఇచ్చి వాడీ కంట పడనీయవద్దని చెప్పి   ఆకెమేరాలు బిగించి ,నన్నుకూడా పారిపొమ్మని  ,

అర్ధరాత్రి దాటాక పారిపోయింది... 

నేను పారిపోదాం అనుకునే సరికి  ,నీవు అరుస్తున్నావ్..నిద్ర లేచావు అనుకుని ధైర్యం చేయలేదు.పడుకున్నట్టు నటిస్తూంటే నిజంగానే నిద్ర పట్టేసింది.పొద్దున్నలేచి చూసి నీవల్ల  నేతప్పించుకుందని నన్నుచావబాదావు.. 

ఇదుగోఈ ఆపిల్ల అమర్చిన కెమేరాలోనన్ను పెట్టీన బాధలున్నాయి ఽమ్తేకాదు నువ్వు నీనోటితోనేచెప్పిన ,

నీచండాలమైన చరిత్ర ఉంది .. ఎలాగైనా  కమిషనర్గారికి దీన్ని అందజేస్తాను .నీపాపం బద్దలు గొడతాను ..

అని శక్తినంతా  కూడాగట్టుకొనిలేచి నిలబడి…పిచ్చిదాని వేషం వేసుకుని.పెరటివైపున్న కిటికీలో నుంచి బయటపడ్డాను.. చుట్టుపక్కల ఎవరూ గుర్తుపట్టలేనంతగా మెకానిక్ షెడ్ లో మసి పూసుకొని ,

పోలీస్ స్టేషన్ చేరాను..స్వగతంలోచెప్పుకొని , ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడమే నా జీవితంలో స్వర్ణ యుగం ప్రారంభమైంది.

 అదే ఈ చంద్రగుప్తుని చేతుల్లో స్వర్ణయుగం ప్రారంభమైమ్ అనుకుంది. హిస్టరీ తో బి ఏ చదివి ,ఎంతో తెలివైన పిల్లగా గుర్తింపు పొంది ‘ప్రేమ పేరుతో ,పెను ప్రమాదం లో చిక్కుకున్న' దుర్గ ..  

కమిషనర్ చంద్రగుప్త ద్వారా విమోచనం పొందిన  ఎస్సై ఏకాంబరం భార్య దుర్గ అమావాస్య చీకట్లు పోయి   అమ్మవారి ముఖం వోలె ప్రకాశిస్తున్న అష్టమిచంద్రుని చూస్తూ హాయిగానిద్రపోయింది......

                                        —-------------------------------------