Thursday 22 December 2011

కపిల

కాటుక     కళ్ళతో  ,  కురుచ  కొమ్ములతో
 గాలికి కదిలే   గంగ డోలుతో
 పొట్టిగా  మట్టసంగా  గోధుమరంగు మచ్చలతో
 పూర్ణ కుంభం లాంటి  పొదుగుతో
పారాడే పసిపిల్లలు పాదాల్లో పడినా
పక్కకి తప్పుకొని  పోయే
పరమశాంత మూర్తి
భూమాతంత సహనంగల గోమాత  నందిని .
అర్ధ రాత్రి  అవసరార్ధం  వెళ్ళిన వారికి
అన్నో ఇన్నో పాల చుక్కలిచ్చి
ఆదుకొనే ఆనందిని దూడ కపిల .
రంగు ,రూపం ,గుణం అంతా అమ్మలాగే
ఆదుకొవ డ౦ లో ఆమ్మే అయినా
సహనం పాలు చాలా తక్కువ
పాలివ్వ లేదని పలుపుతో కొట్టినా
ఎ గ జే పిందని  వెదురు తో  బాదినా
కట్టు కొర్రూడబీక్కొచ్చి కాళ్ళతో తొకుమ్మి
                                                                                                                                                           కొమ్ము లతో  పొడుస్తుంది
సహనంపాలు  సగంతక్కువే
ఎంతయినాకపిల ఈ  తరంది కదా !                                                          విశాల .
                                            --------------------------------


Tuesday 29 November 2011

మహాకవికి నివాళి

  • మహాకవికి   నివాళి .....




  • కొత్తపాతలమేలుకలయిక
  • కొమ్మేరుంగులు జిమ్మునంటూ
  • మంచిచెడ్డలు లోకమందున                                                                                         ఎంచి చూడగా రెండు యంచు                                                                                       పట్టుబట్టి భాష భావం
  • మార్చనెంచి , మార్పుజేసి                                                                             మనుష్యులలో మాయామర్మపు
  • మంచుతెరలు తొలగించి చూపిన                                                                            మహాకవి గురజాడకివియే
  • మనః పూర్వక నివాళు లందాం .
  • లోకహితము సాహిత్యమనెడి
  • నానుడిని నిజంచేసిన                                                                                         నవభావముల వృద్ధ్హ యువకుడు                                                                        నవయుగ  వైతాళికుడై
  • అడుగుజాడను వదిలి వెళ్ళిన                                                                         గురజాడకు నివాళు లందాం.
  • ముదమారగాముత్యాలసరములు                                                                                             ఏర్చి కూర్చిజాతికిచ్చి
  • కన్యాశుల్కపు కార్చిచ్చులో                                                                                  
  •  కాలిపోవు బ్రతుకులను గని
  • కలం వైద్యం జేసి మూఢ మతుల
  • బ్రతుకులు బైట పెట్టిన
  • సంస్కర్త మనగురజాడ వారికీ  
  • జేజేలు పలికి నివాళు లిద్దాం.
  • అందవిశ్వాసాలనేడు అగ్నికి                                                                                ఆహుతయ్యేడిఅతివల బ్రతుకుల
  • ఉద్ధరించగ నడుం కట్టిన
  • విజయనగరపు కవికి ,రవికి                                                                                       నివాళు లందాం.
  • సమాజంకుళ్ళె నంటూ                                                                                 
  •  
  • చొచ్చచ్చని చొంగకార్చి
  • చేతనైనది చేయువారికి                                                                                          చేతికికడ్డయి  కాళ్ళ కడ్డయి
  • అవాకులు చవాకులతో
  • అవరోధము కల్పించు వారల
  • నందరిని ఎదిరించినిలచి
  • అభ్యుదయమార్గముల  నడచిన
  • మార్గదర్శి మన గురజాడ కు                                                                                 నివాళులందాం ఘన నివాళులందాం.
  •                      ------------------------------------
  •                              దామరాజు .విశాలాక్షి .
  • 2011 novemberr 30 .మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా  అంజలి ఘటిస్తూ                             దామరాజు .విశాలాక్షి .విశాఖపట్నం.

    రసమయి





    రామ ప్రియ సఖివా........






    జగతినేలే  జగద్ధాత్రి  రామప్రియసఖివా,
    మారామ ప్రియసఖివా?
    రసమయమ్మీ జగతి అంటూ                                                                                      ప్రేమ జూపెదవా ?
    కర్మచారిణివయి   మెలగుచు
    సహకరించెదవా?
    సాహితీలోకములో తిరుగుచు
    అనుసరించెదవా?
    ఆత్మీయ దరహాసముద్రతో
    హాయి గొల్పెదవా ?
    ఆనందజలధిలో తేలిపొతూ
    అనురాగమిస్తావా ?
    పెద్దవాళ్ళను పలకరిస్తూ
    దగ్గ రౌతావా?
    చిన్నవారిని చేరదీసే వౌతావా?
      స్నేహ శీలీ  ,ప్రేమ మూర్తీ
       చేలిమిచేస్తావా?
    చెలిమి కో రి చేరు వారిని
    చేరదీస్తావా?
    నవతకోరే యువతతో                                                                                    
    స్నేహమ్ము జేస్తావా?
    పాతకొత్తల మేలు కలయక                                                                                       కొమ్మవౌ తావా?
    పుత్తడిబొమ్మవౌతావా?
    జగతికి అమ్మ వౌ తావా ?                 
              -------------------------
    విశ్వమాత , జగద్ధాత్రి కి   ,విశాలాక్షి  .నివేదనం.

    Thursday 24 November 2011

    జగదభిరామం


    సోదరి ఆత్మీయ ప్రశంస




    మొజాయిక్ మెరుపులా లోపల
    మేఘ సదృశగళం ఉరుముతుంది
    మెరుస్తుంది.సాహితీ జల్లులు కురిపిస్తూ
    సభాసదులను సంతోష సంభ్రమాలలో ముంచెత్తుతుంది .
    విశ్వాన్నివిహంగ వీక్షణం గా విజ్ఞాన తృష్ణతో చుట్టేస్తూ                                   సాహితీసభాల్లో సంద్రమైపొంగుతూ ప్రాచీనతను   పరిశీలనగా  చూస్తూ
    ఆధునిక సాహిత్యాన్నౌ పోసన  పడుతూ
    ఆత్మీయతతో   అందరినీ పలకరిస్తూ                                                                         జగదభి రాముడు మండే మొజాయిక్ లో
    మహార్ణవంలా  దర్శన౦  మహానందమౌతుంది.
      ఈ కవిత  10-10- 11 న మొజాయిక్  ప్రథమవార్షికోత్సవానికి   వ్రాసినది .
                                  ఆత్మీయ  ప్రశంస .   సోదరి విశాలాక్షీ .దామరాజు. 

    Wednesday 23 November 2011


                          ఉయ్యాల
    ఉయ్యాలండి  ఉయ్యాల  ఊగే  తూగే  ఉయ్యాల
    ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
    పురిటి కందుకి  ప్రప్రధమంగా పట్టు చీరతో ఉయ్యాల
    పాపలు పెరగగా తల్లులుపాడుతూ  ప్రేమగ కట్టే ఉయ్యాల
    చిలుకలపందిరి  ఉయ్యాల, గిలకలు కట్టిన ఉయ్యాల
    ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే  తూగే  ఉయ్యాల
    ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
    మైదానాల్లో , పాథశాలల్లో  పిల్లలు ఊగే ఉయ్యాల
    పొలం గట్లపై , చెట్టుకు కట్టి తల్లులు ఊపే ఉయ్యాల
    పనులుచేస్తూ పాపలనూపే పల్లె తల్లుల ఉయ్యాల
    పాటలతోటలోపాపలు తిరిగేబంగరుబాల్యపుఉయ్యాల
    ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే  తూగే  ఉయ్యాల
    ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
    ఊడలుపట్టుకు ఉరకలువేసే యువకులు ఊగే ఉయ్యాల
    పండెంవేసుకు పడతులు ఊగే పరువపు,,గరువపు ఉయ్యాల
    వసారాలలో ,,నడవాలలో, వ్రేలాడే గొలుసుల ఉయ్యాల
    పిన్నలు పెద్దలు ప్రేమగా ఊగే, పలుపుల, వలపుల ఉయ్యాల
    ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే తూగే  ఉయ్యాల
    ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
    పెద్దనవంటి కవులు ముద్దుగా ,ప్రే మగకోరే ఉయ్యాల
    వరూధీనంటి వన్నెలాడుల ,విలాసాల ఉయ్యాల
    ఆకాశానికి కాళ్ళు తాకునని ఆశగా ఊగే ఉయ్యాల
    అందని వాటిని అందాలనుకోను ఆశలపల్లకి ఉయ్యాల
    ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే  తూగే  ఉయ్యాల
    ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
    డోలాయాం అని  భక్తులు దేముని  గొప్పగా ఊపే ఉయ్యాల
    ఊపే భక్తుల నోరకంటితో  దేముడు బ్రోచే ఉయ్యాల                                                                         
    ఆనందంతో అందరు ఊపే ఆదిదేముని ఉయ్యాల
    జగతిని ఊపే దేముళ్ళను అనసూయూ పిన ఉయ్యాల                                                                              అమ్మతొ గూడి హాయిగ శివుడు అలరించుచుఊగే ఉయ్యాల
    జగతిని  ఏలిన  జగన్నాధుని  ప్రతిరోజూపే  ఉయ్యాల.
    ఉయ్యాలండి  ఉయ్యాల  ఊగే  తూగే  ఉయ్యాల
    ఊపే  కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల.                                                                                ఉయ్యాలండి  ఉయ్యాల  ఊగే  తూగే  ఉయ్యాల
    ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల.
    =============================



    పసికందు


    తూర్పుతల్లి గర్భాన్నిచీల్చుకువచ్చిస
    ప్రభాత  భానునిలాంటి    పసికందు 
    ఆతల్లిపేగునుండి  విడివడి తుళ్ళిపడి లేచి
    రక్తపుగడ్డలా౦టి ముఖంతో రాగం లంకించుకుని.
    రాజభోగాలనుభవిస్తూ పురిటిశిశువు
     రాజసంగా మనసుదోస్తూంటే
    వంతులవారిగాసేవాలు చెస్తూ
    ఒకరినిమించోకరు వాత్సల్యం కురిపిస్తుంటారు .
    ఆనందార్ణవంలో  ఓలలాడే                                                                                                                              అందాల  అరవిందంలాంటి పసికందు
    ఆ   నింగిలోని  జాబిల్లి
    నేలపైన  సిరిమల్లి
    ఆమ్మానాన్నల  కంటిపాప
    ఇంటివెలుగు  కలలపంట.
    చిన్నారి  సూర్యునికిమల్లె
    చిట్టిచేతులు విప్పిన చిన్నారి
    అరచేతి స్పర్సే అమర సుఖం
    అందంగానవ్వితే ఇంద్రలోక దర్శనం        
    ప్రభాత  భానునిలాంటి    పసికందు 
    ఆతల్లిపేగునుండి  విడివడి తుళ్ళిపడి లేచి
    రక్తపుగడ్డలా౦టి ముఖంతో రాగం లంకించుకుని.
    రాజభోగాలనుభవిస్తూ పురిటిశిశువు
     రాజసంగా మనసుదోస్తూంటే
    వంతులవారిగాసేవాలు చెస్తూ
    ఒకరినిమించోకరు వాత్సల్యం కురిపిస్తుంటారు .
    ఆనందార్ణవంలో  ఓలలాడే                                                                                                                              అందాల  అరవిందంలాంటి పసికందు
    ఆ   నింగిలోని  జాబిల్లి
    నేలపైన  సిరిమల్లి
    ఆమ్మానాన్నల  కంటిపాప
    ఇంటివెలుగు  కలలపంట.
    చిన్నారి  సూర్యునికిమల్లె
    చిట్టిచేతులు విప్పిన చిన్నారి
    అరచేతి స్పర్సే అమర సుఖం
    అందంగానవ్వితే ఇంద్రలోక దర్శనం                                                                                                       ఏదిఏమైనా  పసికందు ను                                                                                                         పాలకుండను చూడడం
    పరమానందం  ప్రమోద దాయక0                                                                                                                                                                                            దామరాజు  విశాలాక్షీ                                                                                                ఏదిఏమైనా  పసికందు ను                                                                                                         పాలకుండను చూడడం
    పరమానందం  ప్రమోద దాయక0                                                                                                                                                                                            దామరాజు  విశాలాక్షీ  

    ఉచ్చు - గొలుసు



    ఈ పూలెంత   పరిమళమో  ! అన్నాను .
    అవి నీవు నాటిన మొక్కల పూలే అన్నడన్నయ్య.
    ఆవకాయద్భుతంగా  ఉందమ్మా! అన్నాను
    అది నీవు నాటిన టెంక   వృక్షమై
    ఇచ్చిన కాయల ఆవకాయే అన్నది అమ్మ .
    మంచం మహా బాగుంది . నాన్నా! అన్నాను .
    అది మన పెరటిలోని టేకు చెట్టు కొమ్మలతో
    చేసిన  మంచామమ్మా !అందుకే, అన్నారు నాన్న .
    ఇదుగోనమ్మా  ! నీ పోలం కౌలు డబ్బులతో                                                  చేయించిన గోలుసు  అన్నాడు బాబాయ్.
    కౌలు డబ్బు తో ఇంతపెద్ద గోలుసా ?
    ఆశ్చర్యంగా అన్నాను ?గొలుసు ధరించి .
    అదేనమ్మా ! మీ పెరట్లో మొక్కలు                                                        కలప అడితీ కి అమ్మగా వచ్చిన డబ్బు
    అన్నయ్య డబ్బన్నయ్య కిచ్చేసాను
    నీ  దబ్బు నీకనీ వెళ్లాడు  బాబాయ్.
    గొంతు  పూడుకు పోయి గొప్పదైన భారం గుదిబదలా
    గుండెలపై  వ్రేల్లాడ దీసినట్లు మెడలో
    ఆచెట్లమొదళ్ళు ముడివేసి  వేసుకున్నట్లు
    మనసంతా మహాపరాధనాభావంతో కుచించుకుపోతూ.
    మన్నించండి వ్రుక్షరాజాల్లారా ! మేము మనుషులం
    మహోపకారులైన మీ మనుగడ లేకుడా చేసి
    మాగోతులు మేమే త్రవ్వు కుంటున్నాము
    పచ్చని వనాల్లో ఛిచ్చు పెట్టి మా బ్రతుకులకు
    ఉచ్చులు మేమే బిగించు కుంటున్నాం                                                         అనుకున్నా గొలుసు  లాకర్లో పెట్టి                                                                                                                                                                                                   
    గురుతుల ఆనవాళ్ళు  వెదుక్కొంటూ. -----              దామరాజు.విశాలాక్షి

    Friday 11 November 2011

    మట్టిలో మాణిక్యాలు

             అంతా అస్తవ్యస్త౦గాఉంది                                                                                                                        ఆలోచి౦చే కొలది అయోమయంగాఉంది                                                                                                                                                                                                                    నిన్నటి  వరకూ  నిర్మానుష్యంగా  ఉన్నరోడ్లు  
    నేడు నిశ్చేష్ట  పరుస్తూ  ,నిర్వేదాన్ని మిగులుస్తూ
    ప్రాణ  భయంతో  పరుగులుతీసే వారితో ,
    అవసరార్ధం   అటుఇటుతిరుగుతున్నవారితో
    అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆందోళనతో                                                                                                                           అనుక్షణం  భయపడే  వారితో                                                                                                        ,ఆందోళనదారులతో ,
    అవకాశవాదులతో
    నేరం చేసినవాడు  నిస్సిగ్గుగా  నవ్వుతూ   ,                                                                                                ఏమితెలియనివాడు ఎరకు బలై  ఏడుస్తూ .
    ఏమవుతోందో  తెలియని స్థితి                                                                                                          ఎవరినడగాలో  అర్ధం కాని పరిస్థితి.
    హంతకునకు వెంటనే  బెయులు
    నిర్దోషికి  జీవితఖైదు                                                                                                                          నైరాశ్యంలో కొందరు
    నెట్టుకు వెళ్ళలేకకొందరు
    నిశ్చ్ ష్టులై ,నిర్వేదం లో కొందరు .
    కారణభూతమైనవాడు,  కనిపించక పరారైతే
    చుట్టంలాచూడవచ్చినవాడు  , దెయ్య౦లా పీడిస్తుంటే
    ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన అగ్రరాజ్యాల్లో సమస్యకైనా
    ఊళ్ళళ్ళో బాంబులు  పేలతాయి .,వాతావరణాన్ని ఉదృక్త పరుస్తాయి ..
    అనుక్షణం  భయంతో ,ఆందోళనతో ,ఆవేదనతో,                                                                                                         ఉద్యమాల ఊబుల్లో, రాజకీయరొచ్చుల్లో
    ముందుజనం, ,వెనుకమనం అనే                                                                                                      నాయకుల నేతృత్వం లో ,                                                                                                                              ప్రజలు , నడకనడత మరచి
    అరఛి ,అరచి అలసిసొలసి  ,                                                                                                              సందుల్లో గొందుల్లో
    మందుతాగి ,చిందులేసి ,                                                                                                      నమ్మినోల్లనందరిని  నట్టేట ముంచేసి                                                                                 నరకమువైపు నడుస్తున్నారు                                                                                                       .నరకయాతన పడుతున్నారు
    నమ్మినవాడునట్టేట ముంచి పొతే  ఏదుస్తూ                                                                                   ,                  నెట్టేసిననేరాన్ని నెత్తినుండి  ది౦పలేక                                                                                          నిస్సహాయుడైనెత్తినొరూ మొత్తుకుంటూ గోలపెడుతూ                                                                                                 న్యాయ స్థానం  వైపు   నడుస్తూ ,,పరుగులెడుతు                                                                                                    చెయ్యని  నేరానికి చెఱశాలలో మ్రగ్గి పోతూ                                                                                              శూన్యం లోకి  చూస్తూ ,సాయాన్ని అర్ధిస్తూ                                                                                             ప్రాణభయం మానభయం బ్రతుకంటే భయంభయం                                                                                                                                                                       

    Saturday 24 September 2011

    ఎంపిక


                                       

    యధాప్రకారం చెట్టు మీదినుండి దింపి, భేతాళుని  భుజాన  వేసుకున్నాడు  విక్రమార్కుడు..
    మార్గాయాసం  తెలియకుండా  నీకో మంచి కధ చేప్తాను, .తెలిసి సమాధానంచెప్పకపోతే  నీతల వేయి వ్రక్కలవుతందన్నాడు భేతాళుడు.   సరేనన్నాడు  విక్రమార్కుడు .
    భేతాళుడు కథ  మొదలుపెట్టాడు                                                                        రాజా!  ఉజ్జయిని   రాజ్యమునకు   రాజు సుధర్ముడు .   రాజ్యమునకు     ఉత్తముడు మేధావి  అయిన మంత్రి  సుమంతుడు  మరణించాడు. రాజు  సుమంతుని మనుమడు ,, యోగ్యుడైన  విద్యాసాగారుని,మంత్రిగా  నియమిస్తానని, అతడాపదవికి  అర్హుడని ,, రాణితో  చెప్పాడు                                                                                                                             రాణి  వీల్లేదు ..నాపుట్టింటి నుండి అరణం వచ్చిన   విభూతి భట్టునే , మంత్రిని  చేయాలంది. .                  .రాజు  రాజ్యానికి ఎలాటి మంత్రి  కావాలో తనే  నిర్ణయించాలన్నాడు . విద్యాసాగారుని వారసుడన్నాడు. అలిగిన రాణికి ,అన్ని విధాలా నచ్చ జెప్పాడు   మొండికెత్తిన రాణితో , వాదించాడు  రాజు , .నావాడేమంత్రంటే ,నావాడేమంత్రని  ఇద్దరూ  వాదించు కున్నారు ,                                                                                            ఇంతలో రాజగురువు వచ్చి,కలగజేసుకొని ,విషయం తెలుసుకొని  ,మీఇద్దరికీ  సమ్మతమైతే ,  నేను  మీరనుకొనే  వ్యక్తులిద్దరికి  పరీక్షలు  పెడతాను . అందులో నెగ్గిన వారినే మంత్రిగా నియమిద్దాము. అంగీకారమేనా? అన్నారు రాజగురువు. రాజు,రాణి  అందుకు   ఒప్పుకున్నారు                                                                                                                    
    మరుచటిరోజు., రాజు,రాణి   సమక్షంలో,  ఆ వ్యక్తులిద్దరినీ  రప్పించిన  రాజగురువు ,                                                   ఇద్దరికీ  చెరొక ఐదు వరహాలు, ఇచ్చి  తాంబూలం  వేసుకురమ్మన్నారు..
    గంట తర్వాత వచ్చిన  రాణి గారిమంత్రి  , ఒకపెద్ద బుట్టడు  తమలపాకులు , మరొక ఒకపెద్ద బుట్టడు  వక్కలు, పెద్ద సున్నపుకుండ, డబ్బాడు కాచు,  జాజికాయలు కొంచం  ,కొంచం కుంకుమపువ్వు తెచ్చి, రాజా ! మీరుతాంబూలముకై ఇచ్చిన డబ్బు ,  మేము నెలరోజులు  తాంబూలం వేసుకోవచ్చు.  మీ రిలా ఖర్చుచేయ రాదు..  మాకయితే , ఎలాఖర్చు చేయాలో  అర్ధం  కాలేదన్నాడు.,ఆబుట్టలు ముందుపెట్టి.
    ఇంతలో రాజుగారి మంత్రి  వచ్చాడు. ఒక ఒకతాంబూలం వేసుకొని , మరొకటిచేత్తో పట్టుకొని. .రాజుతో అన్నాడు . మహారాజా !   చాలారోజులతర్వాత మంచి తాంబూలం వేసుకొని , సంతోషించాను. రాత్రిభోజనమయాక  లక్షణంగామరొకటివేసుకుంటాను. ఆరోగ్యకరమైన  ఔషధ గుణాలుగల తాంబూలం వేసుకోవాలన్న కోరిక, ప్రభువులవలన తీరింది. దన్యవాదములు. ఇందులోబడిన ,  తమలపాకులు, వక్కలు ,కాచు,సున్నం ,జాజికాయలు , జాపత్రి, జాతి కుంకుమపువ్వు ,ఆరోగ్యభస్మం , అన్నీఆరోగ్యకరమైనవి. ఇలాటి తాంబూలం  .మీరూ నిత్యం వేసుకొని ఆరోగ్యంగాఉండండి . మహారాజా!అన్నాడు వినయంగా ..                                                                                    సరేవెళ్ళి, రేపు  రండి  అన్నాడు   రాజగురువు .
    మరుచటిరోజు రాజు,రాణి సమక్షంలో  ఆ వ్యక్తులిద్దరికీ   త్రోవలో  వెళ్తున్న   కొన్ని  నాటు బండ్లు చూపి ఆ బళ్ళు ఏ ఊరినుండి  ఏ ఊరు వెళ్తున్నాయో ?అడిగి  రాజుకు  చెప్పమన్నాడు  రాజ గురువు.. 
    సరే అని వెళ్ళిన రాణీగారిమంత్రి , వెంటనే వచ్చి, బళ్ళు, ఏ ఊరినుండి  ఏ ఊరు వెళ్తున్నాయో , అడిగి వచ్చానని  ఆఊర్లపెర్లు  చెప్పాడు .
     గంటతర్వాతవచ్చిన  రాజుగారి మంత్రి , ఆ బళ్ళు ఏ ఊరినుండి  ఏ ఊరు వెళ్తున్నాయో  , ఆ బళ్ళుసరుకులు  ఎక్కడికి తిఇసుకేల్తున్నాయో, ఎంతకు అమ్ముకుంటారో , ఆదేశం నుండి   ఏ,సరుకుతెస్తారో, వ్యాపారంలో  ఎంత  లాభాలు  గడిస్తారో, ప్రభుత్వానికి  ఎంత  పన్ను కట్టాల్సి ఉంటుందో ,వాళ్ళు  పన్నుచేల్లింపక  ,ఎన్నాళ్ళయిందో, వివరాలు వ్రాసి  తెచ్చాడు  ఇలాటి వ్యాపారుల ద్వారా  ఖజానాకు ఎంత ఆదాయం  న్యాయంగా పొందొచ్చో,వివరించాడు.
    =  సరేవెల్లి  రేపు  రండి  అన్నాడు రాజగురువు .                                                      మరుచటి రోజు రాజు,రాణి సమక్షంలో  రెండుపొట్లాలు  ఇద్దరికీ ఇచ్చి, రాజుగారి  మిత్ర -రాజ్యంలో  రాణిగారి  మంత్రిని,  రాజుగారి   శతృరాజ్యంలో, రాజుగారిమంత్రిని ,ఆ  పొట్లాలు ఇచ్చి రమ్మన్నారు రాజగురువు .
    రాజుగారి ,మిత్ర రాజ్యంవెళ్ళిన , రాణిగారిమంత్రి ,మారాజుగారిమ్మన్నారని ఆపొట్లం ఇచ్చాడు. మిత్ర రాజుకి.  ఆ పొట్లం  చూచిన మిత్రరాజు ,  ఏమిటివి ? మీ రాజేమన్నా యజ్ఞంచేసారా?  అని,  అడిగాడు .ఆపొట్లాంవిప్పిచూసి ..అబ్బే !  అలాటిదేమిలేదే ? అయోమయంగా ఆన్నాడు రాణిగారిమంత్రి., మిత్రరాజు కోపంతో, ఇందులో బూడిద, వాడిన పువ్వులు, వెంట్రుకలు ,పంపి మీరాజు నన్నుఅవమానపరిచాడు . ఈ రోజు నుండి  మా మధ్య మిత్రత్వం పోయిందని  చెప్పమని ,తిట్టి  పంపాడు .,ఏడుస్తూ వచ్చి  రాణి గారి మంత్రి రాజుకి  చెప్పాడు.. రహస్యంగా రాజగురువుపంపినవ్యక్తి  వెళ్ళి అయ్యా!మారజుగారు  యజ్ఞం చీస్సారు.సంభావనకోసం ఈ తెలివి తక్కువ  బ్రాహ్మడు  నాచేతిలోనివి తీసుకొని  మీకిచ్చాడు  క్షమించండి అంటే మిత్రరాజు  శాంతించాడు .                               
          శత్రురాజ్యం  వచ్చిన రాజు గారి మంత్రి ,ఆ పొట్లం శత్రురాజుకి  చూపాడు  ఆ పొట్లం  చూచిన శతృరాజు ,.మండిపడుతుంటే, క్షమించండి రాజా!  మా రాజు గారు శాంతి యజ్ఞం చేసి ,మనమధ్య  శత్రుత్వం సమసి పోవాలని బలిచ్చారు. ఆబలిపశువు వెంట్రుకలు ,యాగ --నిర్మాల్యం పువ్వులు, గుండం లో బూడిద ,ప్రసాదంగా మీకు పంపారు . మన రాజ్యాలు సఖ్యం గా  ఉండాలని ఆయన  కోరిక .అన్నాడు వినయంగా .  శత్రురాజు సంతోషించి తెచ్చిన ఇతనికి కానుకలు ఇచ్చి మర్యాదచేసి , ఈ రోజునుండి మీరాజు నేను మిత్రులం అని  మీ రాజుగారికి చెప్పు   అనిచెప్పి పంపాడు .
    శత్రురాజ్యం నుంచి సంతోషంగా క్షేమంగావచ్చాడు రాజు గారి మంత్రి. .సరేవెల్లి రేపు రండి అన్నాడు రాజ గురువు
     మరుచటిరోజు మామ్మూలుగా వచ్చిన వారిద్దరి  చేతుల్లో, చెరో బుట్టా పెట్టి, రాణిగారి మంత్రిని ,రాజుగారి తల్లికి , రాజు గారి మంత్రిని , రాణిగారి తల్లికి ఇచ్చిరమ్మని చెప్పారు  అంతేకాదు  దారి  బత్యాలివ్వలేదు.  మేమిచ్చినవి లెక్కసరిపోయాయో,  లేదో , లేఖ  తెమ్మన్నారు.             అలాగేనని  వెళ్లారు  వారిద్దరూ .
    త్రోవలో రాణిగారి మంత్రికి   విపరీతం  ఆకలేసింది . తనకిచ్చిన బుట్టవిప్పి,గొప్పవాల్లిందులోవి  ఒక్కొక్కటీ  లెక్కపెడతారా ? ఏంటి ? అనుకొని , నాలుగు  మినపసున్ని ఉండలుతిని ,నదిలో  నీళ్ళు  త్రాగి నడకసాగించాడు. అతడు వెళ్ళివచ్చి  ఆఉత్తరము చూపడం,రాజగురువు  రాణికి  చూపడంతో , అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది..రాజు గారి మంత్రికీ  ఆకలేసింది తనకిచ్చిన  బుట్ట  విప్పి  ,  ఆలోచించి ,మొలలోన  కత్తితీసి,  పోలంలోంచి  ఒక  అరిటాకు  తెచ్చుకొని,  ఒక్కొక్క మినప సున్నుండను    కొద్దికొద్దిగా  గీకి వచ్చిపోడిని తిని , మల్లీ అలాగే  బుట్టకట్టి  రాణి గారి తల్లి   దగ్గరకెళ్ళాడు .అతడు వెళ్ళివచ్చి  ఆఉత్తరము, రాజగురువుకు  చూపడం, రాజగురువు  రాణికి  చూపడంతో రాణీ ముఖం    ఆశ్చర్యానందాలతో  వికసించింది . రాజగురువు     మీకు  పెట్టిన  పరీక్షలయి పోయాయి. రాజుగారు  రేపటి సభలో మంత్రిని ప్రకటిస్తారు వెళ్ళిరండి అన్నారు .
    మరుసటిరోజు  రాజు ఎంపికచేసిన  విద్యాసాగారుడే   మంత్రిఅని  ప్రకటించారు.అని కద చెప్పి ,
    రాజా! రాజు గారి మంత్రి   అనుకున్న  వ్యక్తీ రాణీ  గారికి  ఇష్టం లేదు౮ కదా ?  అతనుతెచ్చిని  ఆఉత్తరము,
    చూసి రాణీ ముఖం    ఆశ్చర్యానందాలతో  వికసించింది గదా ?  ఎందుకు? అస్సలుమంత్రిగా  రాణీ  గారికి  ఇష్టం లేని  రాజు ఎంపికచేసిన  విద్యాసాగారుడే   ఎలా అయ్యాడు ?  తేసి  సమాధానం  చెప్పక పొతే
    భేతాళుడంటూ ఉండగానే   ఇందులో  ఆశ్చర్యమేముంది ?
    రాణికిపుట్టింటి నుండి అరణం వచ్చిన ,  విభూతి భట్టునే  మంత్రిని  చేయాలనుంది .కానీ ,ఆమె  విజ్ఞురాలే .భర్తవారసత్వంగా పదవి  ఇవ్వకూడదనుకుంది  గానీ,మంచి వాడు మేధావి మంత్రి కావాలని ఆమెమనసులో ఉంది .అందుకే పురోహితుని చేత నీవు పంపిన నలుబది  ఇదుఉండలు అందాయని రాజుగారి  తల్లివ్రాసిన ఉత్తరం ,
    చూచి రాజు తల్లిదండ్రుల  దృష్ఠి లో విభూతిభట్టు   స్థానంకేవలం  పురోహితుడని గ్రహించింది              అభిమానంతో  అత్తగారు, పంపిన  కానుకలు  చూచి  , రాణి  ముఖం    ఆశ్చర్యానందాలతో వికసించింది  మంత్రిగారిచే  మీరు  పంపిన పదార్దాలు లెక్కగా అందాయని ,లేఖ వ్రాస్తూ ,, ,ప్రతిగా  తల్లి  పంపిన  కానుకలు  చూచి  , రాణి  ముఖం    ఆశ్చర్యానందాలతో  వికసించింది,  భర్త  ఎంపిక మీద  విశ్వాసమేర్పడింది  తనెంపిక తప్పని తెలిసి అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది. రాజగురువుమాత్రం   ,మొదటిపరీక్షలో , చెప్పినపని  చెప్పినట్లు  చేసే నేర్పరితనం, ఆరోగ్యసుత్రాలమలు జరపడంలో , అతని శ్రద్ధ రాజు  ఆరోగ్యంగా ఉండాలని  కోరిక  గమనించాడు.
    రెండవ పరీక్షలో  విద్యాసాగారునికి గల వ్యవహారజ్ఞానం, రాజకార్యములుకూలంకుషంగాతెలుసుకోవడం ,  ఖజానా నింపే , దక్క్షత  గమనించాడు.
    మూడవ పరీక్షలో విద్యాసాగారునికి గల  సమయస్పూర్తి,  రాజసభలో  మెలిగే  పధ్ధతి ,శాంతి,కాముకత్వం గమనించాడు.
    ఇకనాలుగో పరీక్షలో,  ఆకలితీర్చుకొనెందుకయినా ఆలోచన ఉండాలని, ,ఒకనమ్మకముతో  పంపినవారి నమ్మకము ,వమ్ము చేయరాదని ,తనప్రాణాన్ని  జాగ్రత్తగాకాపాడుకొంటూ,  రాజు పరువు  నిలపాలని,  అనుక్షణం  నమ్మకస్తుడు,  విశ్వాస పాత్రునిగా  అప్రమత్తతతో  మెలగాలని ,మంత్రాగంతెలిసి రాజుని, రాజ్యాన్ని  రక్క్షిస్తుండాలని విద్యాసాగరునిచే, ఋజువుచేసాడు.  అతనిపై  నమ్మకముతో రాజగురువు  విద్యాసాగారునిఎంపికచేశారు .    అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది రాజుతోపాటు రాణి కూడా సమర్ధించింది .అనిచెప్పాడు విక్రమార్క మహారాజు.
    విక్రమార్క మహారాజు.  మేధాశక్తిని  ప్రశంసిస్తూనే  మౌన భంగమైనందున ,మళ్ళీమాయమై చెట్టెక్కిక్కిపోయాడు  భేతాళుడు .
    పట్టువదలని  విక్రమార్కుడు మళ్లి   తనప్రయట్నం  మొదలు  పెట్టాడు .   

    సమాప్తం.

          రచన.   దామరాజు .విశాలాక్షీ.
          గోపాలపట్నం ,విశాఖపట్నం.