తొలకరి తొలకరిలో నాతలపు తొంగి చూసింది
జ్ఞాపకపు దొంతరలు తిరగదోడింది
భావనల బంధాల బరువు దింపింది
క్రొత్త చినుకులకు సాహిత్య భూమి మురిసింది
తొలకరి చినుకు పడి తొడిమ మురిసింది తొడిమ మురిపముజూసి చినుకు నవ్వింది
వాటిఆటలు జూసి వనము నవ్వింది
తొలకరి జల్లులకు తడిసి పోయింది .