Monday 2 December 2013

పిల్లలముందు పదేపదే విమర్శిస్తూ ప్రేమలేకుండా చేసావు అన్నీసహించి౦ది
కోడళ్ళువచ్చాక నీకోపం తగ్గక వియ్యాలవారిముందు నీవీరంగం భరించలేక 
సహనపుసరిహద్దులు నువ్వేదాటించాక.తనుసరిహద్దులుదాటి సంతోషంవెతుక్కుంటూ వెళ్ళిపోయింది 
ఎంత కరవనిపామయినా కాలువేసినేరిమితే ఊరుకుంటుందా ? అసలు నోటమాట రాణి ఇల్లాలు  నీఇంటి నేకాదు భాద్యతలని దేశాన్నివదిలి .వంటమనిషిగా ఇంటిమనిషిగా కాదు .ఆప్యాయంగా అమ్మానాతోవస్తావా /?
అన్న పిలుపుకి పులకరి౦చివెల్లిందంటే .అమ్మఅన్నపిలుపులో  ఆప్యాయతేకాదు                                                               .అమ్మగా ఆదరణ పొందాలన్న ఆరాటంకూడా.
అరవై వయస్సులో  అవ్వ !ఆడది పారిపోవదమ్మ అని పంచాయతీలుపెడుతున్ననీవు పరిశీలించుకో .                     సహజగుణం చంపి  సుషుప్తినున్దిమేల్కొనిచూడు శిధిలమై న  ఆమె ఆలోచలు కనిపిస్తాయి

సహనానికి సరిహద్దు .

అమ్మ  ఆదిపరాశక్తే
           అరాచకం                                                                                                                                               అతిగా మారినప్పుడు
.
 బస్  లో బాక్స్  మరచి పోయానమ్మా
అరరే ! బస్సులో  బాక్స్ లో బాంబని
సాయింత్ర మయేసరికి
సకలచానళ్ళలో సంచలనవార్త వస్తుందేమోరా?
                         చిట్టికవితలు

చేతికి బోమ్మిచ్చానోలేదో
క్షణాలలో  భాగాలన్నీ విడగొట్టాడు
అవును వీడుగోప్ప  పరిశోధకు డౌతాడు.
పొంచి చూస్తున్నాడీ బుడుగు ఎప్పుడుపడుతుందో పిడుగు .
                                   


సహనం   చచ్చాక .

ఆమెశరీర గాయాలు చూసాక కూడా నీ కళ్ళ చెమ్మ నేచూడలేదు
ఎన్నో నిద్ర లేని  రాత్రులు గడిపిందో తెలిసికూడా  నీవు నిద్ర నటించావు
మనసును   మళ్ళీ మళ్ళీ కుళ్ళ బొడిచి  కౌకుదేబ్బలతో కుమిలి పొయిన ఆమె
కన్నీళ్ళు తుదవలేదు సరికదా  కామ పిశాచానివై కోరుక్కుతిన్నావు
సర్దుకు పోయే ఆమెతత్వాన్ని చేతకాని తనమన్నావ్ .
కలుపుగోలు తనాన్ని కాకా పట్టడమన్నావ్
అస్తి చర్మం  ఏకమై చాకిరీ చేసినా అది ఆమె భాద్యతని అణువంత చేయూతనివ్వలేదు
ఆమెను నీలోఅర్ధభాగమని మరచి అమా నుషంగా ప్రవర్తించావు
నీవాల్లముందు నిస్సాకారంగా మాటాడావు  మనుధర్మ సూత్రాలన్నీ మహా చక్కగావర్ణించావు

















Friday 17 May 2013

శ్రీమాత శుభాశ్శీసులు(s.m.s.లు)

అంచనాలు మించొచ్చు
ఆత్మవిశ్వాసం ఉంటే.
అడవిలో నైనా బ్రతకొచ్చు
అంతులేని ధైర్యముంటే
వంచనను జయించొచ్చు
ఇంకితజ్ఞానముంటే
విభేదాలు రానేరావు
ఒకరపుడు ఒదిగి  ఉంటే
మనిషిగా మిగలొచ్చు
మానవత్వమంటూఉంటే.
ఆనందము పొందొచ్చు
అసూయను వదిలేస్తే
విజ్ఞానము పొందొచ్చు
విస్తారంగా చదివితే
వాడనాడి గెలవొచ్చు
విషయపరిజ్ఞానముంటే
మంచితనం చూపోచ్చు
మమకారపు మనసుంటే

Tuesday 14 May 2013

visalabhaavaalu

అందరూ  నీ వాళ్ళు
అధికారం
నీ చేతిలో ఉంటే.

నందిని
పందన్నా చెల్లుతుంది
నడిమంత్రపు సిరి ఉంటే.

అవమానం
పొందాలిమరి
అహంకారులు
ఎదురైతే.

ఆత్మీయత                                                                                                                                                  లావిరౌతాయి
ఆర్ధిక మాంద్యాలు వస్తే .

తారతమ్యాలు
మారిపోతాయి
తరాల అంతరాలు మారితే .

చీత్కారముల్
పొందక్కర్లేదు
చిల్లరబుద్ధులు లేకుంటే

ప్రేమనేపొందగలవు
పగతోనీవు                                                                                                                                                రగలకుంటే

Saturday 11 May 2013



V

              చల్లని స్వామి- మన చందనస్వామి
 చల్లని స్వామి-మాచందనస్వామి  సింహగిరులపైనవెలసినాస్వామి
 చెయ్యెత్తి  మొక్కితే దీవించుసామి-ఆలకించి మామ్మాదుకొనుస్వామి
వరాహరూపానవెలసినాస్వామి-నరసింహరూపాన్ని కలిపినాస్వామి
నర మృగ  అవతార  నృసింహస్వామి చెయ్యెత్తి  మొక్కితే దీవించుసామి
 చల్లని స్వామి-మాచందనస్వామి- చెయ్యెత్తి  మొక్కితే దీవించుసామి. 
వరాహావతారంగా హిరణ్యాక్షు ద్రుంచి, .భూమినిరక్షించి బ్రోచినావపుడు
హిరణ్యకశిపుడు నిలదీసిఅడుగ-బాలప్రహ్లాదుని, ధర్మాన్నిగావ,
స్తంభం నుండొచ్చి రక్కసునిజంపి, ఉగ్ర రూపముతోడ ఊగునినుజూచి
బ్రహ్మాదిదేవతలు ,రుద్రుడు, మునులు, శాంతిపజూసినా చల్లబడకుండా,
భక్తుడగు ప్రహ్లాదు ప్రార్దనకుకరిగి- సింహగిరిపై వెలసి  సేవలందేవు
కృతయుగ కాలపు గాధలివియ౦ట, దేవతలు గుడికట్టి కొలచినారంట.
బ్రహ్మోత్సవాలు చేసినారంట, సకలవైభవాలు చాటినారంట.
ఆనాటి ఆ కథలు ఆనందమంటా.అఖిలలోకాలు ముదమందునంట.
వైశాఖ శుద్ధ తదియనా డ౦ట,వరాహనరసింహునవతారమంట
ప్రహ్లాదుని బ్రోచివెలసినాస్వామి- తరతరాలట్లు సేవలందినాడంట
చల్లని స్వామిమనచందనస్వామి , సింహగిరులపైనవెలసినాడంట
యుగములంతరి౦చి జగములు పోవ, ఆరాధనలు లేక అదృశ్యమయ్యి.

  కృతయుగానా తీరు కోలువైనస్వామి- కాలచక్రముతిరుగకన్నుమరుగయ్యె.
 ఆరాధనలులేక ఆకొండపైన, పుట్టలోపలయుండెతూర్పుకనుమలలో
 ఆరుగురు గొప్ప చక్రవర్తులలో-  అదృష్టవంతుడగు ఆపురూరవుడు
దివ్యవిమానములో తిరుగాడు చుండి, బంగాళాఖాతపు తీరాన యున్న
సింహగిరులలోతిరుగాడుచుండ,అదేమిమహిమాయో అద్భుతమోగాని
విమానమటనుండి కదలనేలేదు ,విస్తుపోయిన రాజు పురూరవుండు
విషయమేమిటని ఊర్వశిని అడుగ ,దివ్యదృష్టితో చూచినప్సరస
దేవదేవుడు  ఆ నృసింహస్వామి,  వరహమూర్తిగా వెలసినాడయ్య  
స్వామిని వేడుకో శుభమునీకనిన ,అట్లేజేసెను ఆ పురూరవుడు.
ఆనాటిస్వప్నాన ఆరాజు కలలో, వరాహనరసింహ స్వామికన్పించి 
పుట్టలో ఉన్నాను బయిటకు తీయు, పూజలుజరిపించి ప్రఖ్యాతిపొందు 
అనిచెప్ప  ఆరాజు సంతోషమంది ,.మహద్  భాగ్యమని మదిలోన తలచి
సహస్ర కలశముల జలములతోను, పంచామృతములతోపుట్టను తడిపె.
జ్ఞానచక్షువుకు గోచరించేను. వరాహస్వామతని కానతిచ్చేను.
ఆజ్ఞనౌద లదాల్చిఆపురూరవుడు - మట్టితొలగించినంతమంచి గంధమును.                                                               స్వామిపైపెట్టి శాంతిజరిపాడు- తొమ్మిదిమణుగుల గంధముపెట్టాడు.
ఆనాటినుండి ఆ పద్ధతిలో ముమ్మారు స్వామికి మూడుమణుగులలో
హరి చందనమునుపెట్టి అద్దుతుంటారు.వైశాఖపున్నమికి ఒకటవ సారి
జ్యేష్టపున్నమికి రెండవసారి .ఆషాడపున్నమికి మూడవసారి
శ్రీచందనమును శిరసునపెట్టి .నిత్యమూ చందనపు పూతలుపూసి
స్వామినిగొల్చుట సంప్రదాయముగా-  చేసాడుఆనాడుపురూరవుండు.                                                                            ఘనముగా గోపురములన్ని కట్టించి, స్వామికి ఎన్నెన్నో సేవలుజేసే
వైశాఖ శుద్ధతదియ శుభదినము -చందనోత్సవమని శాసనముజేసి 
పూజలు జరిపెనాపురూరవుడు- అనుచుస్థలపురాణము చెప్తోందిమనకు.
ఆనాటినుండి చందనోత్సవము- ఆ  తిధిని జరుపుట ఆచారమయ్యే
సింహవల్లిగా లక్ష్మి సేవించు చుండ- ఆదినారాయణుడుఅవనిపాలించు
అంతియేగాక ఆచరిత్రజూస్తే, ఈనాటి ఆలయము  క్రీస్తు పూర్వమున                                                            తొమ్మిదవశతాబ్ది నాటికుందనుచు ,                                                                                                                              పదమూడవశతాబ్దిప్రారంభమందు
పునరుద్ధరి౦ప బడినదని చరిత్రగలదు,                                                                                                                                   పాంచరాత్రాగమనపద్ధతిలోన                                                                                                                                      పూజలుచేస్తారు పురుషోత్తమునకు ,.ఉత్సవామూర్తిగా గోవిందరాజు
శయనమూర్తిగామదన గోపాలుడున్ను.స్నపనమూర్తివేణుగోపాలస్వామి                                                                      బలిమూర్తిగా యోగానారశి౦హుడును, .చక్రపెరుమాళ్గాసుదర్శనుడును
కొలువుతీరగా మన నృశి౦హస్వామి-కన్నులపండుగ జేయు చున్నాడు .
స్వామిమహిమలు పొగడ శేషునికైనా, శక్యంబుగాదు మానవులదెంత?
బ్రహ్మాదిదేవతలు మునులు దిగివచ్చి- కొలిచినస్వామికి మనకోలుపులెంత ?
అయిననూ ఆస్వామి అప్పన్న అనుచూ- అమాయకముగా అనిననూగాని
తలచినాకోలిచినా తృప్తిని చెంది -కోరిన వరములు కురిపించుతాడు’
పుష్కరిణిలోమునిగి- గన్నేరుపూలు వేసినా వెంటనే కరుణించు తాడు.
గంగ ధారలలోన స్నానాలుజేసి, ఘనముగా స్వామికి పూజలుజేసి
తులసిమాలలు వేయ తృప్తినిపొందు, అర్చనలు జేయగా ఆశీర్వదించు’  
చందనమునుపూసి సంపెంగపూల పూజలు చేసినా పొంగిపోతాడు
హరిహరీ నారాయణాది .నారాయణఅనిభజనలుజేయగాసంతసిస్తాడు                                                                               శక్తికొలదీపూజ భక్తితోమ్రొక్కు- మ్రొక్కగాకోర్కెలు తీర్చుతుంటాడు
కప్పస్తంభము నెల్లి కౌగలించుకొని- కోరితే కోరికలు తీర్చుతుంటాడు
కోడెదూడ నొదిలి  కొత్తపంటలను-  అర్పించి సేవింప ఆదుకుంటాడు
సంపెంగపూలతో పూజింప స్వామీ మనపై దయను వెదజల్లుతాడు
గిరిప్రదక్షనముచేయ గురుతుపెట్టుకొని అప్పన్న అనగానే ఆదరిస్తాడు ..
రూపమేకోపము మనసెంతో వెన్న- వరాహనరశింహస్వామియేమిన్న
నిజరూపదర్శనము నిత్యమూగాదు,ఏడాది కొకసారే చందనోత్సమున
చల్లనిస్వామి మా చందన స్వామి- తలచినా కొలచినా దయచూపుతాడు .
ఈ చరితమువిన్న చదివినా స్వామి- సకలశుభములుగూర్చి రక్షించుతాడు .
దండాలు దండాలు దండాలు స్వామీ దయగల తండ్రిమానరసింహ స్వామి
పిల్ల పాపలనంత చల్లగా భ్రోచి కాపాడుచుండుమా కడదాకా మమ్ము.
                                                                         
              ------------శుభం--------------------
     ఆర్యా! నమస్కారములు.
చల్లని స్వామి-మాచందనస్వామి  సింహగిరులపైనవెలసినాస్వామి   అనే  ఈ గేయకవిత  నా ఊహాజనితం .ఎవరినీ
అనుకరించి  అనుసరించి  వ్రాసినది కాదు.నాస్వంతమని విన్నవించు కొంటున్నాను.
                                                                       ఇట్లు
                                                కవయిత్రి /రచయిత్రి,  శ్రీమతి .దామరాజు .విశాలాక్షి
                                      ఇంటినెం; 4/199, విద్యానగర్.గోపాలపట్నం,                                                                                                          విశాఖపట్నం-27.damaraju.visalakshi@gmail.com.                                                                                                                                        
                                                                                       
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              

Saturday 12 January 2013

సంక్రాంతిసంబరాలు



సంక్రాంతిసంబరాలు
  ధనుర్మాసమనడంతో  
 సంబరాలుప్రారంభం                                                                  
రంగురంగులతో రమణులు దిద్దే
రంగవల్లులతో ఆరంభం
తిరుప్పావై ప్రవచనాలతో  
  గోదా సేవలు ప్రారంభం     
ముద్దులొలుకు  ముగ్దలుదిద్దే  
ముత్యాల ముగ్గులు  ప్రారంభం       
  ఇంటిని ఒంటిని అలంకరించుట
ఇంతుల కెంతో ఆనందం
గొబ్బిల్లంటూ గంతులేయడం
కన్నె పిల్లలకు సంతోషం
పండుగ కోసం పిండివంటలు
చేసే గృహిణుల సందోహం
అల్లుళ్ళతో  కూతుళ్ళతో
ఇల్లిల్లు సందోహం
 కానుకలిచ్చి  పంపించుటలో
అత్తమామలకు ఆరాటం
                          

పంటల కోతలు కుప్ప నూర్పులతో
రైతుల ఇళ్ళలో సంతోషం
గంపలకొలది దానముచేయుట
ఘనమని రైతులవిశ్వాసం
 బుడబుక్కలతో కొమ్మదాసరులతో
పల్లెవీదులలో సందోహం
హరిదాసులతో మేలుకోలుపులతో   
తెల తెల్లవారే తీరంద౦  
మరదలి వెంట పరుగులు పెట్టీ
బావల తీరు ఒక చందం  ఒకఅందం
బావాబావా పన్నీరంటు
తిప్పలు పెట్టుట ఒక అందం 
బంతి  పూలతో చేమంతులతో
పౌష్య లక్ష్మికి పేరంటం
 సంప్రదాయము ప్రతిబింభించే
సంక్రా౦తి పండుగ ఆనందం  
పెద్దలకోలుచుట,                                                                                                                                                                                                                              పధ్ధతి  నీర్చుట                
పండగ జరుపుట లసలర్ధం
ఒకరిని  ఒకరు గౌరవించుట
ఈ పండుగ లోని పరమార్ధం .
 చీరలు నగలు చూపుతు చూసే  
స్త్రీలలో ఎంతో ఉత్సాహం
పది మందితో పంచుకు తినుటే
 ఈ పండగలోని  పరమార్దం .
రావణకాష్టం రగుల్చుట కోసం
పిడకల దండల  పరిహారం