మారామ ప్రియసఖివా?
రసమయమ్మీ జగతి అంటూ ప్రేమ జూపెదవా ?
కర్మచారిణివయి మెలగుచు
సహకరించెదవా?
సాహితీలోకములో తిరుగుచు
అనుసరించెదవా?
ఆత్మీయ దరహాసముద్రతో
హాయి గొల్పెదవా ?
ఆనందజలధిలో తేలిపొతూ
అనురాగమిస్తావా ?
పెద్దవాళ్ళను పలకరిస్తూ
దగ్గ రౌతావా?
చిన్నవారిని చేరదీసే వౌతావా?
స్నేహ శీలీ ,ప్రేమ మూర్తీ
చేలిమిచేస్తావా?
చెలిమి కో రి చేరు వారిని
చేరదీస్తావా?
నవతకోరే యువతతో
స్నేహమ్ము జేస్తావా?
పాతకొత్తల మేలు కలయక కొమ్మవౌ తావా?
పుత్తడిబొమ్మవౌతావా?
జగతికి అమ్మ వౌ తావా ?
-------------------------
విశ్వమాత , జగద్ధాత్రి కి ,విశాలాక్షి .నివేదనం.
No comments:
Post a Comment