Wednesday 20 June 2012

శ్రీమాతా

శ్రీ కరంబయినట్టి శ్రీ మాత నామమును
చింతన జేయు మానవుల నె పు డు
సిరి సంపదలను సౌ భాగ్యము ల నొసగి
చల్లగా తల్లియై సాకు  చు౦డు

శ్రీ మాత శ్రీ లక్ష్మీశ్రీ విద్య రూపమై
సృష్టి స్థితి లయలు జరుపు తల్లి
సన్నుతించు వారి సర్వకాలములందు
సంరక్షించు చుండి శాంతి నొసగు

శ్రీ  కంఠుని గూడి శ్రీ మేరు గిరి పైన
చిదగ్నిలో చిన్ముద్ర తోడ 
శివుని పర్యంకాన స్థిరముగా కూర్చుండి
 చల్లని తల్లిగా  కాపాడు  చుండు.

అమ్మ గా జగతిని ఆ దరించి బ్రోవ
అయ్యచే గరళాన్ని త్రా గించె  జనని
అమ్మ ప్రేమకెపుడు అవధులులేవనుచు
అమ్మచాటెను గదా అవని లోన
.
అమ్మ అయ్య లోని అర్ధ భాగము నొంది
అన్నియును తానయి ఆదరించు
అఖిల రూపములలో ఆవరించిన తల్లి
ఆద.రి౦చును జగతి నహర్నిశము   

Sunday 10 June 2012

సూర్యోదయం

నిత్యం చూస్తున్నా  నిష్చేష్టితులను జేస్తుంది

ప్రతి ఉదయం ప్రకృతిని పులకరింప.జేస్తుంది. 

జడమైన ప్రకృతిని చైతన్య  పరుస్తుంది 

స్వర్ణమయ కిరణాలను సర్వత్ర పరుస్తుంది

సుందరంగా జగత్తును  చూసి మురిసి పోతుంది
.
తూరుపు కనుమల పొత్తిళ్ళలో తొంగి చూస్తూ

ప్రతినిత్యం ప్రసవమైన  శిశువులా గుంటుంది.

తొలకరి

తొలకరి జల్లులు

మృగశిర  కార్తె  వచ్చింది
ముత్యాలజల్లులే తెచ్చింది

గ్రీస్మతాపము  తోడ
గోలపెట్టే జనుల
దాహార్తిని  తీర్చదలచింది

మబ్బులదండాన్ని                                                                                                                                                                                         మంత్రమేసికదిపి
మట్టి వాసనలనే తెచ్చింది
రైతన్న.కలలను
నిలబెట్టతనవంతు
సేవ జేయగా ముందుకొచ్చింది
చిటచిటలాడినా
చిరు జల్లులే తెచ్చి
మనసులను
మురిపింప జేసింది.