Sunday 29 January 2012

అక్షర మాలిక


                   
అ అంటే అమ్మరా ,ఆ అంటే  ఆవురా
అమ్మపాలవంటిది  మన కమ్మనైన  భాషరా
ఇ అంటే ఇల్లురా, ఈ  ఈశ్వరుడురా
ఇంటిని కాపాడేది  ఈశ్వరుడు నిజమురా
ఉ అంటే ఉషస్సురా ఊ అంటే ఊళరా
ఊళ లేస్తూ ఉషస్సులో ఉదయాన్నే తిరగాలిరా
ఋ అంటే ఋషి రా ఋూక రా
ఋషులను ఋూకలను కొలుచు జాతీ మనదిరా
ఎ అంటే  ఎలుకరా ఏ అంటే ఏనుగురా
ఎలుక, ఏనుగు వాహనాలు నిజమురా
ఐ, అంటే ఐరావతం, ఓ అంటే ఒకటిరా
ఐరావతం ఒక్కటే అత్యుత్తమ గజమురా
ఓ అంటే  ఓడరా, ఔ అంటే ఔషదమురా
ఓడలలో ఔషదాలు ఒకప్పుడు వచ్చేవిరా.
అం  అంటే అంబర అః విసర్గరా 
అంబ దయతో అక్షరాలు  అన్నిటిని నేర్వరా.
,
క అంటేకలమురా, ఖ అంటే  ఖడ్గమ్ము రా 
ఖడ్గమ్ము  కంటే ,కవి కలము గొప్పరా !

గ  అంటే  గంగ రా  ఘ అంటే  ఘనతరా
గంగా  నది కంటే  ఘనమైన నదే లేదురా
జ్ఞా అంటే జ్ఞాన  మూర్తి  సరస్వతీ దేవిరా                                                                     జ్ఞానానికి  జగతిలో ఏ  ఎదురు లేదురా !

చ అంటే  చదువురా ఛ అంటే  ఛత్రమ్మురా.
చదువులలోముందుంటే  ఛత్రపతి కావచ్చు రా
జ అ౦టే  జలమురా ఝ అంటే  ఝషమురా
జలములోన నివసించే   ఝవముపేరే చేప రా!
ఞ అంటే  జ్ఞానిరా జ్ఞానులదీ భూమిరా 
ఈ భూమిపైన జన్మించుట పూర్వ పుణ్య ఫలమురా !

ట అంటే టంక రా  ఠ ఠాగూర్  రా
టంకాధ్యయుద శివ భక్తుడు ఠాగూర్  విశ్వకవి రా 
డ అంటే  డమరురా ఢ అంటే ఢక్కరా   ఢ ఢమరుకమురా                                                                                                                               ,ఢక్కఢమరుకము అద్భుత వాద్యములురా ,
ణ తో కణకణ లురా,  నటరాజ నృ త్యమ్మురా
వర్గయుక్కులు శివుని ఢమరుకంలో పుట్టాయిరా౧

త అంటే తల్పంమురా థ అంటే కథలురా
తాతా,బామ్మ చెప్పేటి కథల రుచే వేరురా !
ద అంటే  దయే రా ధ అంటే ధనము రా
దయతో దానము చేయని ధనము విలువ తెడురా !
న అనే  నగమురా హిమన్నగము గొప్పరా
హిండుదేశ సౌందర్యం హిమన్నగము నుందిరా
ప అంటే  పండురా ఫ అంటేఫలమురా
ప౦డుఅన్నా ఫలమన్నా ఓకే అర్ధమ్ము రా
బ అంటే బంతి రా భ అంటే భక్తిరా
బంతి లాంటి భూమిని భక్తీ తోడ మ్రోక్కరా !
మ అంటే మట్టిరా మట్టి బ్రతుకు మనదిరా
మట్టిని నమ్మిన వాడు మహిలో చెడి పోడురా

య అంటే యతి రా యతి మేలుజేయురా
ర అంటే  రక్షణకై దక్షత తో మేల్గురా
ల అంటే లహరి రా లహరితోడి కదలిరా
ళ అంటే ప్రళయములో జలముతో ముంచెత్తు రా
వ అంటే వనమురా వనములలో జనమరా
వనములేక జనము బ్రతుకు వ్యర్ధ్ధమ్మిది నిజమురా

శ అంటే శరమురరా శరవేగపు బ్రతుకురా
ష  అంటే వేషమేసి మోసముచేయొద్దురా
స అంటే  సరమురా సరముసొగసు లీ నురా

సరములోని సుమములల్లె మనుషు లుండ వలెనురా