Wednesday 23 November 2011


                      ఉయ్యాల
ఉయ్యాలండి  ఉయ్యాల  ఊగే  తూగే  ఉయ్యాల
ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
పురిటి కందుకి  ప్రప్రధమంగా పట్టు చీరతో ఉయ్యాల
పాపలు పెరగగా తల్లులుపాడుతూ  ప్రేమగ కట్టే ఉయ్యాల
చిలుకలపందిరి  ఉయ్యాల, గిలకలు కట్టిన ఉయ్యాల
ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే  తూగే  ఉయ్యాల
ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
మైదానాల్లో , పాథశాలల్లో  పిల్లలు ఊగే ఉయ్యాల
పొలం గట్లపై , చెట్టుకు కట్టి తల్లులు ఊపే ఉయ్యాల
పనులుచేస్తూ పాపలనూపే పల్లె తల్లుల ఉయ్యాల
పాటలతోటలోపాపలు తిరిగేబంగరుబాల్యపుఉయ్యాల
ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే  తూగే  ఉయ్యాల
ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
ఊడలుపట్టుకు ఉరకలువేసే యువకులు ఊగే ఉయ్యాల
పండెంవేసుకు పడతులు ఊగే పరువపు,,గరువపు ఉయ్యాల
వసారాలలో ,,నడవాలలో, వ్రేలాడే గొలుసుల ఉయ్యాల
పిన్నలు పెద్దలు ప్రేమగా ఊగే, పలుపుల, వలపుల ఉయ్యాల
ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే తూగే  ఉయ్యాల
ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
పెద్దనవంటి కవులు ముద్దుగా ,ప్రే మగకోరే ఉయ్యాల
వరూధీనంటి వన్నెలాడుల ,విలాసాల ఉయ్యాల
ఆకాశానికి కాళ్ళు తాకునని ఆశగా ఊగే ఉయ్యాల
అందని వాటిని అందాలనుకోను ఆశలపల్లకి ఉయ్యాల
ఉయ్యాలండి  ఉయ్యాల  ఊ గే  తూగే  ఉయ్యాల
ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల
డోలాయాం అని  భక్తులు దేముని  గొప్పగా ఊపే ఉయ్యాల
ఊపే భక్తుల నోరకంటితో  దేముడు బ్రోచే ఉయ్యాల                                                                         
ఆనందంతో అందరు ఊపే ఆదిదేముని ఉయ్యాల
జగతిని ఊపే దేముళ్ళను అనసూయూ పిన ఉయ్యాల                                                                              అమ్మతొ గూడి హాయిగ శివుడు అలరించుచుఊగే ఉయ్యాల
జగతిని  ఏలిన  జగన్నాధుని  ప్రతిరోజూపే  ఉయ్యాల.
ఉయ్యాలండి  ఉయ్యాల  ఊగే  తూగే  ఉయ్యాల
ఊపే  కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల.                                                                                ఉయ్యాలండి  ఉయ్యాల  ఊగే  తూగే  ఉయ్యాల
ఊగే కొలది  ఉత్సాహాన్ని  ఒంట్లో నింపే ఉయ్యాల.
=============================



No comments:

Post a Comment