మహాకవికి నివాళి .....
- కొత్తపాతలమేలుకలయిక
- కొమ్మేరుంగులు జిమ్మునంటూ
- మంచిచెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండు యంచు పట్టుబట్టి భాష భావం
- మార్చనెంచి , మార్పుజేసి మనుష్యులలో మాయామర్మపు
- మంచుతెరలు తొలగించి చూపిన మహాకవి గురజాడకివియే
- మనః పూర్వక నివాళు లందాం .
- లోకహితము సాహిత్యమనెడి
- నానుడిని నిజంచేసిన నవభావముల వృద్ధ్హ యువకుడు నవయుగ వైతాళికుడై
- అడుగుజాడను వదిలి వెళ్ళిన గురజాడకు నివాళు లందాం.
- ముదమారగాముత్యాలసరములు ఏర్చి కూర్చిజాతికిచ్చి
- కన్యాశుల్కపు కార్చిచ్చులో
- కాలిపోవు బ్రతుకులను గని
- కలం వైద్యం జేసి మూఢ మతుల
- బ్రతుకులు బైట పెట్టిన
- సంస్కర్త మనగురజాడ వారికీ
- జేజేలు పలికి నివాళు లిద్దాం.
- అందవిశ్వాసాలనేడు అగ్నికి ఆహుతయ్యేడిఅతివల బ్రతుకుల
- ఉద్ధరించగ నడుం కట్టిన
- విజయనగరపు కవికి ,రవికి నివాళు లందాం.
- సమాజంకుళ్ళె నంటూ
- చొచ్చచ్చని చొంగకార్చి
- చేతనైనది చేయువారికి చేతికికడ్డయి కాళ్ళ కడ్డయి
- అవాకులు చవాకులతో
- అవరోధము కల్పించు వారల
- నందరిని ఎదిరించినిలచి
- అభ్యుదయమార్గముల నడచిన
- మార్గదర్శి మన గురజాడ కు నివాళులందాం ఘన నివాళులందాం.
- ------------------------------------
- దామరాజు .విశాలాక్షి .
- 2011 novemberr 30 .మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా అంజలి ఘటిస్తూ దామరాజు .విశాలాక్షి .విశాఖపట్నం.
Tuesday 29 November 2011
మహాకవికి నివాళి
రసమయి
మారామ ప్రియసఖివా?
రసమయమ్మీ జగతి అంటూ ప్రేమ జూపెదవా ?
కర్మచారిణివయి మెలగుచు
సహకరించెదవా?
సాహితీలోకములో తిరుగుచు
అనుసరించెదవా?
ఆత్మీయ దరహాసముద్రతో
హాయి గొల్పెదవా ?
ఆనందజలధిలో తేలిపొతూ
అనురాగమిస్తావా ?
పెద్దవాళ్ళను పలకరిస్తూ
దగ్గ రౌతావా?
చిన్నవారిని చేరదీసే వౌతావా?
స్నేహ శీలీ ,ప్రేమ మూర్తీ
చేలిమిచేస్తావా?
చెలిమి కో రి చేరు వారిని
చేరదీస్తావా?
నవతకోరే యువతతో
స్నేహమ్ము జేస్తావా?
పాతకొత్తల మేలు కలయక కొమ్మవౌ తావా?
పుత్తడిబొమ్మవౌతావా?
జగతికి అమ్మ వౌ తావా ?
-------------------------
విశ్వమాత , జగద్ధాత్రి కి ,విశాలాక్షి .నివేదనం.
Thursday 24 November 2011
జగదభిరామం
సోదరి ఆత్మీయ ప్రశంస |
మొజాయిక్ మెరుపులా లోపల
మేఘ సదృశగళం ఉరుముతుంది
మెరుస్తుంది.సాహితీ జల్లులు కురిపిస్తూ
సభాసదులను సంతోష సంభ్రమాలలో ముంచెత్తుతుంది .
విశ్వాన్నివిహంగ వీక్షణం గా విజ్ఞాన తృష్ణతో చుట్టేస్తూ సాహితీసభాల్లో సంద్రమైపొంగుతూ ప్రాచీనతను పరిశీలనగా చూస్తూ
ఆధునిక సాహిత్యాన్నౌ పోసన పడుతూ
ఆత్మీయతతో అందరినీ పలకరిస్తూ జగదభి రాముడు మండే మొజాయిక్ లో
మహార్ణవంలా దర్శన౦ మహానందమౌతుంది.
ఈ కవిత 10-10- 11 న మొజాయిక్ ప్రథమవార్షికోత్సవానికి వ్రాసినది .
ఆత్మీయ ప్రశంస . సోదరి విశాలాక్షీ .దామరాజు.
Wednesday 23 November 2011
ఉయ్యాల
ఉయ్యాలండి ఉయ్యాల ఊగే తూగే ఉయ్యాల
ఊగే కొలది ఉత్సాహాన్ని ఒంట్లో నింపే ఉయ్యాల
పురిటి కందుకి ప్రప్రధమంగా పట్టు చీరతో ఉయ్యాల
పాపలు పెరగగా తల్లులుపాడుతూ ప్రేమగ కట్టే ఉయ్యాల
చిలుకలపందిరి ఉయ్యాల, గిలకలు కట్టిన ఉయ్యాల
ఉయ్యాలండి ఉయ్యాల ఊ గే తూగే ఉయ్యాల
ఊగే కొలది ఉత్సాహాన్ని ఒంట్లో నింపే ఉయ్యాల
మైదానాల్లో , పాథశాలల్లో పిల్లలు ఊగే ఉయ్యాల
పొలం గట్లపై , చెట్టుకు కట్టి తల్లులు ఊపే ఉయ్యాల
పనులుచేస్తూ పాపలనూపే పల్లె తల్లుల ఉయ్యాల
పాటలతోటలోపాపలు తిరిగేబంగరుబాల్యపుఉయ్యాల
ఉయ్యాలండి ఉయ్యాల ఊ గే తూగే ఉయ్యాల
ఊగే కొలది ఉత్సాహాన్ని ఒంట్లో నింపే ఉయ్యాల
ఊడలుపట్టుకు ఉరకలువేసే యువకులు ఊగే ఉయ్యాల
పండెంవేసుకు పడతులు ఊగే పరువపు,,గరువపు ఉయ్యాల
వసారాలలో ,,నడవాలలో, వ్రేలాడే గొలుసుల ఉయ్యాల
పిన్నలు పెద్దలు ప్రేమగా ఊగే, పలుపుల, వలపుల ఉయ్యాల
ఉయ్యాలండి ఉయ్యాల ఊ గే తూగే ఉయ్యాల
ఊగే కొలది ఉత్సాహాన్ని ఒంట్లో నింపే ఉయ్యాల
పెద్దనవంటి కవులు ముద్దుగా ,ప్రే మగకోరే ఉయ్యాల
వరూధీనంటి వన్నెలాడుల ,విలాసాల ఉయ్యాల
ఆకాశానికి కాళ్ళు తాకునని ఆశగా ఊగే ఉయ్యాల
అందని వాటిని అందాలనుకోను ఆశలపల్లకి ఉయ్యాల
ఉయ్యాలండి ఉయ్యాల ఊ గే తూగే ఉయ్యాల
ఊగే కొలది ఉత్సాహాన్ని ఒంట్లో నింపే ఉయ్యాల
డోలాయాం అని భక్తులు దేముని గొప్పగా ఊపే ఉయ్యాల
ఊపే భక్తుల నోరకంటితో దేముడు బ్రోచే ఉయ్యాల
ఆనందంతో అందరు ఊపే ఆదిదేముని ఉయ్యాల
జగతిని ఊపే దేముళ్ళను అనసూయూ పిన ఉయ్యాల అమ్మతొ గూడి హాయిగ శివుడు అలరించుచుఊగే ఉయ్యాల
జగతిని ఏలిన జగన్నాధుని ప్రతిరోజూపే ఉయ్యాల.
ఉయ్యాలండి ఉయ్యాల ఊగే తూగే ఉయ్యాల
ఊపే కొలది ఉత్సాహాన్ని ఒంట్లో నింపే ఉయ్యాల. ఉయ్యాలండి ఉయ్యాల ఊగే తూగే ఉయ్యాల
ఊగే కొలది ఉత్సాహాన్ని ఒంట్లో నింపే ఉయ్యాల.
=============================
పసికందు
తూర్పుతల్లి గర్భాన్నిచీల్చుకువచ్చిస
ప్రభాత భానునిలాంటి పసికందు
ఆతల్లిపేగునుండి విడివడి తుళ్ళిపడి లేచి
రక్తపుగడ్డలా౦టి ముఖంతో రాగం లంకించుకుని.
రాజభోగాలనుభవిస్తూ పురిటిశిశువు
రాజసంగా మనసుదోస్తూంటే
వంతులవారిగాసేవాలు చెస్తూ
ఒకరినిమించోకరు వాత్సల్యం కురిపిస్తుంటారు .
ఆనందార్ణవంలో ఓలలాడే అందాల అరవిందంలాంటి పసికందు
ఆ నింగిలోని జాబిల్లి
నేలపైన సిరిమల్లి
ఆమ్మానాన్నల కంటిపాప
ఇంటివెలుగు కలలపంట.
చిన్నారి సూర్యునికిమల్లె
చిట్టిచేతులు విప్పిన చిన్నారి
అరచేతి స్పర్సే అమర సుఖం
అందంగానవ్వితే ఇంద్రలోక దర్శనం
ప్రభాత భానునిలాంటి పసికందు
ఆతల్లిపేగునుండి విడివడి తుళ్ళిపడి లేచి
రక్తపుగడ్డలా౦టి ముఖంతో రాగం లంకించుకుని.
రాజభోగాలనుభవిస్తూ పురిటిశిశువు
రాజసంగా మనసుదోస్తూంటే
వంతులవారిగాసేవాలు చెస్తూ
ఒకరినిమించోకరు వాత్సల్యం కురిపిస్తుంటారు .
ఆనందార్ణవంలో ఓలలాడే అందాల అరవిందంలాంటి పసికందు
ఆ నింగిలోని జాబిల్లి
నేలపైన సిరిమల్లి
ఆమ్మానాన్నల కంటిపాప
ఇంటివెలుగు కలలపంట.
చిన్నారి సూర్యునికిమల్లె
చిట్టిచేతులు విప్పిన చిన్నారి
అరచేతి స్పర్సే అమర సుఖం
అందంగానవ్వితే ఇంద్రలోక దర్శనం ఏదిఏమైనా పసికందు ను పాలకుండను చూడడం
పరమానందం ప్రమోద దాయక0 దామరాజు విశాలాక్షీ ఏదిఏమైనా పసికందు ను పాలకుండను చూడడం
పరమానందం ప్రమోద దాయక0 దామరాజు విశాలాక్షీ
ఉచ్చు - గొలుసు
ఈ పూలెంత పరిమళమో ! అన్నాను .
అవి నీవు నాటిన మొక్కల పూలే అన్నడన్నయ్య.
ఆవకాయద్భుతంగా ఉందమ్మా! అన్నాను
అది నీవు నాటిన టెంక వృక్షమై
ఇచ్చిన కాయల ఆవకాయే అన్నది అమ్మ .
మంచం మహా బాగుంది . నాన్నా! అన్నాను .
అది మన పెరటిలోని టేకు చెట్టు కొమ్మలతో
చేసిన మంచామమ్మా !అందుకే, అన్నారు నాన్న .
ఇదుగోనమ్మా ! నీ పోలం కౌలు డబ్బులతో చేయించిన గోలుసు అన్నాడు బాబాయ్.
కౌలు డబ్బు తో ఇంతపెద్ద గోలుసా ?
ఆశ్చర్యంగా అన్నాను ?గొలుసు ధరించి .
అదేనమ్మా ! మీ పెరట్లో మొక్కలు కలప అడితీ కి అమ్మగా వచ్చిన డబ్బు
అన్నయ్య డబ్బన్నయ్య కిచ్చేసాను
నీ దబ్బు నీకనీ వెళ్లాడు బాబాయ్.
గొంతు పూడుకు పోయి గొప్పదైన భారం గుదిబదలా
గుండెలపై వ్రేల్లాడ దీసినట్లు మెడలో
ఆచెట్లమొదళ్ళు ముడివేసి వేసుకున్నట్లు
మనసంతా మహాపరాధనాభావంతో కుచించుకుపోతూ.
మన్నించండి వ్రుక్షరాజాల్లారా ! మేము మనుషులం
మహోపకారులైన మీ మనుగడ లేకుడా చేసి
మాగోతులు మేమే త్రవ్వు కుంటున్నాము
పచ్చని వనాల్లో ఛిచ్చు పెట్టి మా బ్రతుకులకు
ఉచ్చులు మేమే బిగించు కుంటున్నాం అనుకున్నా గొలుసు లాకర్లో పెట్టి
గురుతుల ఆనవాళ్ళు వెదుక్కొంటూ. ----- దామరాజు.విశాలాక్షి
Friday 11 November 2011
మట్టిలో మాణిక్యాలు
అంతా అస్తవ్యస్త౦గాఉంది ఆలోచి౦చే కొలది అయోమయంగాఉంది నిన్నటి వరకూ నిర్మానుష్యంగా ఉన్నరోడ్లు
నేడు నిశ్చేష్ట పరుస్తూ ,నిర్వేదాన్ని మిగులుస్తూ
ప్రాణ భయంతో పరుగులుతీసే వారితో ,
అవసరార్ధం అటుఇటుతిరుగుతున్నవారితో
అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆందోళనతో అనుక్షణం భయపడే వారితో ,ఆందోళనదారులతో ,
అవకాశవాదులతో
నేరం చేసినవాడు నిస్సిగ్గుగా నవ్వుతూ , ఏమితెలియనివాడు ఎరకు బలై ఏడుస్తూ .
ఏమవుతోందో తెలియని స్థితి ఎవరినడగాలో అర్ధం కాని పరిస్థితి.
హంతకునకు వెంటనే బెయులు
నిర్దోషికి జీవితఖైదు నైరాశ్యంలో కొందరు
నెట్టుకు వెళ్ళలేకకొందరు
నిశ్చ్ ష్టులై ,నిర్వేదం లో కొందరు .కారణభూతమైనవాడు, కనిపించక పరారైతే
చుట్టంలాచూడవచ్చినవాడు , దెయ్య౦లా పీడిస్తుంటే
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన అగ్రరాజ్యాల్లో సమస్యకైనా
ఊళ్ళళ్ళో బాంబులు పేలతాయి .,వాతావరణాన్ని ఉదృక్త పరుస్తాయి ..
అనుక్షణం భయంతో ,ఆందోళనతో ,ఆవేదనతో, ఉద్యమాల ఊబుల్లో, రాజకీయరొచ్చుల్లో
ముందుజనం, ,వెనుకమనం అనే నాయకుల నేతృత్వం లో , ప్రజలు , నడకనడత మరచి
అరఛి ,అరచి అలసిసొలసి , సందుల్లో గొందుల్లో
మందుతాగి ,చిందులేసి , నమ్మినోల్లనందరిని నట్టేట ముంచేసి నరకమువైపు నడుస్తున్నారు .నరకయాతన పడుతున్నారు
నమ్మినవాడునట్టేట ముంచి పొతే ఏదుస్తూ , నెట్టేసిననేరాన్ని నెత్తినుండి ది౦పలేక నిస్సహాయుడై’నెత్తినొరూ మొత్తుకుంటూ గోలపెడుతూ న్యాయ స్థానం వైపు నడుస్తూ ,,పరుగులెడుతు చెయ్యని నేరానికి చెఱశాలలో మ్రగ్గి పోతూ శూన్యం లోకి చూస్తూ ,సాయాన్ని అర్ధిస్తూ ప్రాణభయం మానభయం బ్రతుకంటే భయంభయం
Subscribe to:
Posts (Atom)