కాటుక కళ్ళతో , కురుచ కొమ్ములతో
గాలికి కదిలే గంగ డోలుతో
పొట్టిగా మట్టసంగా గోధుమరంగు మచ్చలతో
పూర్ణ కుంభం లాంటి పొదుగుతో
పారాడే పసిపిల్లలు పాదాల్లో పడినా
పక్కకి తప్పుకొని పోయే
పరమశాంత మూర్తి
భూమాతంత సహనంగల గోమాత నందిని .
అర్ధ రాత్రి అవసరార్ధం వెళ్ళిన వారికి
అన్నో ఇన్నో పాల చుక్కలిచ్చి
ఆదుకొనే ఆనందిని దూడ కపిల .
రంగు ,రూపం ,గుణం అంతా అమ్మలాగే
ఆదుకొవ డ౦ లో ఆమ్మే అయినా
సహనం పాలు చాలా తక్కువ
పాలివ్వ లేదని పలుపుతో కొట్టినా
ఎ గ జే పిందని వెదురు తో బాదినా
కట్టు కొర్రూడబీక్కొచ్చి కాళ్ళతో తొకుమ్మి
కొమ్ము లతో పొడుస్తుంది
సహనంపాలు సగంతక్కువే
ఎంతయినాకపిల ఈ తరంది కదా ! విశాల .
--------------------------------
గాలికి కదిలే గంగ డోలుతో
పొట్టిగా మట్టసంగా గోధుమరంగు మచ్చలతో
పూర్ణ కుంభం లాంటి పొదుగుతో
పారాడే పసిపిల్లలు పాదాల్లో పడినా
పక్కకి తప్పుకొని పోయే
పరమశాంత మూర్తి
భూమాతంత సహనంగల గోమాత నందిని .
అర్ధ రాత్రి అవసరార్ధం వెళ్ళిన వారికి
అన్నో ఇన్నో పాల చుక్కలిచ్చి
ఆదుకొనే ఆనందిని దూడ కపిల .
రంగు ,రూపం ,గుణం అంతా అమ్మలాగే
ఆదుకొవ డ౦ లో ఆమ్మే అయినా
సహనం పాలు చాలా తక్కువ
పాలివ్వ లేదని పలుపుతో కొట్టినా
ఎ గ జే పిందని వెదురు తో బాదినా
కట్టు కొర్రూడబీక్కొచ్చి కాళ్ళతో తొకుమ్మి
కొమ్ము లతో పొడుస్తుంది
సహనంపాలు సగంతక్కువే
ఎంతయినాకపిల ఈ తరంది కదా ! విశాల .
--------------------------------