Wednesday 23 November 2011

ఉచ్చు - గొలుసు



ఈ పూలెంత   పరిమళమో  ! అన్నాను .
అవి నీవు నాటిన మొక్కల పూలే అన్నడన్నయ్య.
ఆవకాయద్భుతంగా  ఉందమ్మా! అన్నాను
అది నీవు నాటిన టెంక   వృక్షమై
ఇచ్చిన కాయల ఆవకాయే అన్నది అమ్మ .
మంచం మహా బాగుంది . నాన్నా! అన్నాను .
అది మన పెరటిలోని టేకు చెట్టు కొమ్మలతో
చేసిన  మంచామమ్మా !అందుకే, అన్నారు నాన్న .
ఇదుగోనమ్మా  ! నీ పోలం కౌలు డబ్బులతో                                                  చేయించిన గోలుసు  అన్నాడు బాబాయ్.
కౌలు డబ్బు తో ఇంతపెద్ద గోలుసా ?
ఆశ్చర్యంగా అన్నాను ?గొలుసు ధరించి .
అదేనమ్మా ! మీ పెరట్లో మొక్కలు                                                        కలప అడితీ కి అమ్మగా వచ్చిన డబ్బు
అన్నయ్య డబ్బన్నయ్య కిచ్చేసాను
నీ  దబ్బు నీకనీ వెళ్లాడు  బాబాయ్.
గొంతు  పూడుకు పోయి గొప్పదైన భారం గుదిబదలా
గుండెలపై  వ్రేల్లాడ దీసినట్లు మెడలో
ఆచెట్లమొదళ్ళు ముడివేసి  వేసుకున్నట్లు
మనసంతా మహాపరాధనాభావంతో కుచించుకుపోతూ.
మన్నించండి వ్రుక్షరాజాల్లారా ! మేము మనుషులం
మహోపకారులైన మీ మనుగడ లేకుడా చేసి
మాగోతులు మేమే త్రవ్వు కుంటున్నాము
పచ్చని వనాల్లో ఛిచ్చు పెట్టి మా బ్రతుకులకు
ఉచ్చులు మేమే బిగించు కుంటున్నాం                                                         అనుకున్నా గొలుసు  లాకర్లో పెట్టి                                                                                                                                                                                                   
గురుతుల ఆనవాళ్ళు  వెదుక్కొంటూ. -----              దామరాజు.విశాలాక్షి

No comments:

Post a Comment