Saturday 16 May 2015

పాలకడలినురుగు పసిడివన్నెలజిలుగు
కలబోసిజేసిన  ప్రతిమవోలె
పూలపై పుప్పొడులు గాలిలో గంధములు                                                                                                         కలిపి అద్దిన  చిత్తరువువోలె
వేల సూర్యులవెలుగు కోటి చంద్రుల మెరుగు
కలగలిపి అద్దిన కాంతివోలె
మణిద్వీపమధ్యమున
మా అమ్మ లలితమ్మ
మహా శివుని గూడి
వెల్గొందుచుండు.