Saturday 24 September 2011

ఎంపిక


                                   

యధాప్రకారం చెట్టు మీదినుండి దింపి, భేతాళుని  భుజాన  వేసుకున్నాడు  విక్రమార్కుడు..
మార్గాయాసం  తెలియకుండా  నీకో మంచి కధ చేప్తాను, .తెలిసి సమాధానంచెప్పకపోతే  నీతల వేయి వ్రక్కలవుతందన్నాడు భేతాళుడు.   సరేనన్నాడు  విక్రమార్కుడు .
భేతాళుడు కథ  మొదలుపెట్టాడు                                                                        రాజా!  ఉజ్జయిని   రాజ్యమునకు   రాజు సుధర్ముడు .   రాజ్యమునకు     ఉత్తముడు మేధావి  అయిన మంత్రి  సుమంతుడు  మరణించాడు. రాజు  సుమంతుని మనుమడు ,, యోగ్యుడైన  విద్యాసాగారుని,మంత్రిగా  నియమిస్తానని, అతడాపదవికి  అర్హుడని ,, రాణితో  చెప్పాడు                                                                                                                             రాణి  వీల్లేదు ..నాపుట్టింటి నుండి అరణం వచ్చిన   విభూతి భట్టునే , మంత్రిని  చేయాలంది. .                  .రాజు  రాజ్యానికి ఎలాటి మంత్రి  కావాలో తనే  నిర్ణయించాలన్నాడు . విద్యాసాగారుని వారసుడన్నాడు. అలిగిన రాణికి ,అన్ని విధాలా నచ్చ జెప్పాడు   మొండికెత్తిన రాణితో , వాదించాడు  రాజు , .నావాడేమంత్రంటే ,నావాడేమంత్రని  ఇద్దరూ  వాదించు కున్నారు ,                                                                                            ఇంతలో రాజగురువు వచ్చి,కలగజేసుకొని ,విషయం తెలుసుకొని  ,మీఇద్దరికీ  సమ్మతమైతే ,  నేను  మీరనుకొనే  వ్యక్తులిద్దరికి  పరీక్షలు  పెడతాను . అందులో నెగ్గిన వారినే మంత్రిగా నియమిద్దాము. అంగీకారమేనా? అన్నారు రాజగురువు. రాజు,రాణి  అందుకు   ఒప్పుకున్నారు                                                                                                                    
మరుచటిరోజు., రాజు,రాణి   సమక్షంలో,  ఆ వ్యక్తులిద్దరినీ  రప్పించిన  రాజగురువు ,                                                   ఇద్దరికీ  చెరొక ఐదు వరహాలు, ఇచ్చి  తాంబూలం  వేసుకురమ్మన్నారు..
గంట తర్వాత వచ్చిన  రాణి గారిమంత్రి  , ఒకపెద్ద బుట్టడు  తమలపాకులు , మరొక ఒకపెద్ద బుట్టడు  వక్కలు, పెద్ద సున్నపుకుండ, డబ్బాడు కాచు,  జాజికాయలు కొంచం  ,కొంచం కుంకుమపువ్వు తెచ్చి, రాజా ! మీరుతాంబూలముకై ఇచ్చిన డబ్బు ,  మేము నెలరోజులు  తాంబూలం వేసుకోవచ్చు.  మీ రిలా ఖర్చుచేయ రాదు..  మాకయితే , ఎలాఖర్చు చేయాలో  అర్ధం  కాలేదన్నాడు.,ఆబుట్టలు ముందుపెట్టి.
ఇంతలో రాజుగారి మంత్రి  వచ్చాడు. ఒక ఒకతాంబూలం వేసుకొని , మరొకటిచేత్తో పట్టుకొని. .రాజుతో అన్నాడు . మహారాజా !   చాలారోజులతర్వాత మంచి తాంబూలం వేసుకొని , సంతోషించాను. రాత్రిభోజనమయాక  లక్షణంగామరొకటివేసుకుంటాను. ఆరోగ్యకరమైన  ఔషధ గుణాలుగల తాంబూలం వేసుకోవాలన్న కోరిక, ప్రభువులవలన తీరింది. దన్యవాదములు. ఇందులోబడిన ,  తమలపాకులు, వక్కలు ,కాచు,సున్నం ,జాజికాయలు , జాపత్రి, జాతి కుంకుమపువ్వు ,ఆరోగ్యభస్మం , అన్నీఆరోగ్యకరమైనవి. ఇలాటి తాంబూలం  .మీరూ నిత్యం వేసుకొని ఆరోగ్యంగాఉండండి . మహారాజా!అన్నాడు వినయంగా ..                                                                                    సరేవెళ్ళి, రేపు  రండి  అన్నాడు   రాజగురువు .
మరుచటిరోజు రాజు,రాణి సమక్షంలో  ఆ వ్యక్తులిద్దరికీ   త్రోవలో  వెళ్తున్న   కొన్ని  నాటు బండ్లు చూపి ఆ బళ్ళు ఏ ఊరినుండి  ఏ ఊరు వెళ్తున్నాయో ?అడిగి  రాజుకు  చెప్పమన్నాడు  రాజ గురువు.. 
సరే అని వెళ్ళిన రాణీగారిమంత్రి , వెంటనే వచ్చి, బళ్ళు, ఏ ఊరినుండి  ఏ ఊరు వెళ్తున్నాయో , అడిగి వచ్చానని  ఆఊర్లపెర్లు  చెప్పాడు .
 గంటతర్వాతవచ్చిన  రాజుగారి మంత్రి , ఆ బళ్ళు ఏ ఊరినుండి  ఏ ఊరు వెళ్తున్నాయో  , ఆ బళ్ళుసరుకులు  ఎక్కడికి తిఇసుకేల్తున్నాయో, ఎంతకు అమ్ముకుంటారో , ఆదేశం నుండి   ఏ,సరుకుతెస్తారో, వ్యాపారంలో  ఎంత  లాభాలు  గడిస్తారో, ప్రభుత్వానికి  ఎంత  పన్ను కట్టాల్సి ఉంటుందో ,వాళ్ళు  పన్నుచేల్లింపక  ,ఎన్నాళ్ళయిందో, వివరాలు వ్రాసి  తెచ్చాడు  ఇలాటి వ్యాపారుల ద్వారా  ఖజానాకు ఎంత ఆదాయం  న్యాయంగా పొందొచ్చో,వివరించాడు.
=  సరేవెల్లి  రేపు  రండి  అన్నాడు రాజగురువు .                                                      మరుచటి రోజు రాజు,రాణి సమక్షంలో  రెండుపొట్లాలు  ఇద్దరికీ ఇచ్చి, రాజుగారి  మిత్ర -రాజ్యంలో  రాణిగారి  మంత్రిని,  రాజుగారి   శతృరాజ్యంలో, రాజుగారిమంత్రిని ,ఆ  పొట్లాలు ఇచ్చి రమ్మన్నారు రాజగురువు .
రాజుగారి ,మిత్ర రాజ్యంవెళ్ళిన , రాణిగారిమంత్రి ,మారాజుగారిమ్మన్నారని ఆపొట్లం ఇచ్చాడు. మిత్ర రాజుకి.  ఆ పొట్లం  చూచిన మిత్రరాజు ,  ఏమిటివి ? మీ రాజేమన్నా యజ్ఞంచేసారా?  అని,  అడిగాడు .ఆపొట్లాంవిప్పిచూసి ..అబ్బే !  అలాటిదేమిలేదే ? అయోమయంగా ఆన్నాడు రాణిగారిమంత్రి., మిత్రరాజు కోపంతో, ఇందులో బూడిద, వాడిన పువ్వులు, వెంట్రుకలు ,పంపి మీరాజు నన్నుఅవమానపరిచాడు . ఈ రోజు నుండి  మా మధ్య మిత్రత్వం పోయిందని  చెప్పమని ,తిట్టి  పంపాడు .,ఏడుస్తూ వచ్చి  రాణి గారి మంత్రి రాజుకి  చెప్పాడు.. రహస్యంగా రాజగురువుపంపినవ్యక్తి  వెళ్ళి అయ్యా!మారజుగారు  యజ్ఞం చీస్సారు.సంభావనకోసం ఈ తెలివి తక్కువ  బ్రాహ్మడు  నాచేతిలోనివి తీసుకొని  మీకిచ్చాడు  క్షమించండి అంటే మిత్రరాజు  శాంతించాడు .                               
      శత్రురాజ్యం  వచ్చిన రాజు గారి మంత్రి ,ఆ పొట్లం శత్రురాజుకి  చూపాడు  ఆ పొట్లం  చూచిన శతృరాజు ,.మండిపడుతుంటే, క్షమించండి రాజా!  మా రాజు గారు శాంతి యజ్ఞం చేసి ,మనమధ్య  శత్రుత్వం సమసి పోవాలని బలిచ్చారు. ఆబలిపశువు వెంట్రుకలు ,యాగ --నిర్మాల్యం పువ్వులు, గుండం లో బూడిద ,ప్రసాదంగా మీకు పంపారు . మన రాజ్యాలు సఖ్యం గా  ఉండాలని ఆయన  కోరిక .అన్నాడు వినయంగా .  శత్రురాజు సంతోషించి తెచ్చిన ఇతనికి కానుకలు ఇచ్చి మర్యాదచేసి , ఈ రోజునుండి మీరాజు నేను మిత్రులం అని  మీ రాజుగారికి చెప్పు   అనిచెప్పి పంపాడు .
శత్రురాజ్యం నుంచి సంతోషంగా క్షేమంగావచ్చాడు రాజు గారి మంత్రి. .సరేవెల్లి రేపు రండి అన్నాడు రాజ గురువు
 మరుచటిరోజు మామ్మూలుగా వచ్చిన వారిద్దరి  చేతుల్లో, చెరో బుట్టా పెట్టి, రాణిగారి మంత్రిని ,రాజుగారి తల్లికి , రాజు గారి మంత్రిని , రాణిగారి తల్లికి ఇచ్చిరమ్మని చెప్పారు  అంతేకాదు  దారి  బత్యాలివ్వలేదు.  మేమిచ్చినవి లెక్కసరిపోయాయో,  లేదో , లేఖ  తెమ్మన్నారు.             అలాగేనని  వెళ్లారు  వారిద్దరూ .
త్రోవలో రాణిగారి మంత్రికి   విపరీతం  ఆకలేసింది . తనకిచ్చిన బుట్టవిప్పి,గొప్పవాల్లిందులోవి  ఒక్కొక్కటీ  లెక్కపెడతారా ? ఏంటి ? అనుకొని , నాలుగు  మినపసున్ని ఉండలుతిని ,నదిలో  నీళ్ళు  త్రాగి నడకసాగించాడు. అతడు వెళ్ళివచ్చి  ఆఉత్తరము చూపడం,రాజగురువు  రాణికి  చూపడంతో , అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది..రాజు గారి మంత్రికీ  ఆకలేసింది తనకిచ్చిన  బుట్ట  విప్పి  ,  ఆలోచించి ,మొలలోన  కత్తితీసి,  పోలంలోంచి  ఒక  అరిటాకు  తెచ్చుకొని,  ఒక్కొక్క మినప సున్నుండను    కొద్దికొద్దిగా  గీకి వచ్చిపోడిని తిని , మల్లీ అలాగే  బుట్టకట్టి  రాణి గారి తల్లి   దగ్గరకెళ్ళాడు .అతడు వెళ్ళివచ్చి  ఆఉత్తరము, రాజగురువుకు  చూపడం, రాజగురువు  రాణికి  చూపడంతో రాణీ ముఖం    ఆశ్చర్యానందాలతో  వికసించింది . రాజగురువు     మీకు  పెట్టిన  పరీక్షలయి పోయాయి. రాజుగారు  రేపటి సభలో మంత్రిని ప్రకటిస్తారు వెళ్ళిరండి అన్నారు .
మరుసటిరోజు  రాజు ఎంపికచేసిన  విద్యాసాగారుడే   మంత్రిఅని  ప్రకటించారు.అని కద చెప్పి ,
రాజా! రాజు గారి మంత్రి   అనుకున్న  వ్యక్తీ రాణీ  గారికి  ఇష్టం లేదు౮ కదా ?  అతనుతెచ్చిని  ఆఉత్తరము,
చూసి రాణీ ముఖం    ఆశ్చర్యానందాలతో  వికసించింది గదా ?  ఎందుకు? అస్సలుమంత్రిగా  రాణీ  గారికి  ఇష్టం లేని  రాజు ఎంపికచేసిన  విద్యాసాగారుడే   ఎలా అయ్యాడు ?  తేసి  సమాధానం  చెప్పక పొతే
భేతాళుడంటూ ఉండగానే   ఇందులో  ఆశ్చర్యమేముంది ?
రాణికిపుట్టింటి నుండి అరణం వచ్చిన ,  విభూతి భట్టునే  మంత్రిని  చేయాలనుంది .కానీ ,ఆమె  విజ్ఞురాలే .భర్తవారసత్వంగా పదవి  ఇవ్వకూడదనుకుంది  గానీ,మంచి వాడు మేధావి మంత్రి కావాలని ఆమెమనసులో ఉంది .అందుకే పురోహితుని చేత నీవు పంపిన నలుబది  ఇదుఉండలు అందాయని రాజుగారి  తల్లివ్రాసిన ఉత్తరం ,
చూచి రాజు తల్లిదండ్రుల  దృష్ఠి లో విభూతిభట్టు   స్థానంకేవలం  పురోహితుడని గ్రహించింది              అభిమానంతో  అత్తగారు, పంపిన  కానుకలు  చూచి  , రాణి  ముఖం    ఆశ్చర్యానందాలతో వికసించింది  మంత్రిగారిచే  మీరు  పంపిన పదార్దాలు లెక్కగా అందాయని ,లేఖ వ్రాస్తూ ,, ,ప్రతిగా  తల్లి  పంపిన  కానుకలు  చూచి  , రాణి  ముఖం    ఆశ్చర్యానందాలతో  వికసించింది,  భర్త  ఎంపిక మీద  విశ్వాసమేర్పడింది  తనెంపిక తప్పని తెలిసి అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది. రాజగురువుమాత్రం   ,మొదటిపరీక్షలో , చెప్పినపని  చెప్పినట్లు  చేసే నేర్పరితనం, ఆరోగ్యసుత్రాలమలు జరపడంలో , అతని శ్రద్ధ రాజు  ఆరోగ్యంగా ఉండాలని  కోరిక  గమనించాడు.
రెండవ పరీక్షలో  విద్యాసాగారునికి గల వ్యవహారజ్ఞానం, రాజకార్యములుకూలంకుషంగాతెలుసుకోవడం ,  ఖజానా నింపే , దక్క్షత  గమనించాడు.
మూడవ పరీక్షలో విద్యాసాగారునికి గల  సమయస్పూర్తి,  రాజసభలో  మెలిగే  పధ్ధతి ,శాంతి,కాముకత్వం గమనించాడు.
ఇకనాలుగో పరీక్షలో,  ఆకలితీర్చుకొనెందుకయినా ఆలోచన ఉండాలని, ,ఒకనమ్మకముతో  పంపినవారి నమ్మకము ,వమ్ము చేయరాదని ,తనప్రాణాన్ని  జాగ్రత్తగాకాపాడుకొంటూ,  రాజు పరువు  నిలపాలని,  అనుక్షణం  నమ్మకస్తుడు,  విశ్వాస పాత్రునిగా  అప్రమత్తతతో  మెలగాలని ,మంత్రాగంతెలిసి రాజుని, రాజ్యాన్ని  రక్క్షిస్తుండాలని విద్యాసాగరునిచే, ఋజువుచేసాడు.  అతనిపై  నమ్మకముతో రాజగురువు  విద్యాసాగారునిఎంపికచేశారు .    అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది అవమానంతో  ఆమె  ముఖం   ఎర్ర బడింది రాజుతోపాటు రాణి కూడా సమర్ధించింది .అనిచెప్పాడు విక్రమార్క మహారాజు.
విక్రమార్క మహారాజు.  మేధాశక్తిని  ప్రశంసిస్తూనే  మౌన భంగమైనందున ,మళ్ళీమాయమై చెట్టెక్కిక్కిపోయాడు  భేతాళుడు .
పట్టువదలని  విక్రమార్కుడు మళ్లి   తనప్రయట్నం  మొదలు  పెట్టాడు .   

సమాప్తం.

      రచన.   దామరాజు .విశాలాక్షీ.
      గోపాలపట్నం ,విశాఖపట్నం.