మహాకవికి నివాళి .....
- కొత్తపాతలమేలుకలయిక
- కొమ్మేరుంగులు జిమ్మునంటూ
- మంచిచెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండు యంచు పట్టుబట్టి భాష భావం
- మార్చనెంచి , మార్పుజేసి మనుష్యులలో మాయామర్మపు
- మంచుతెరలు తొలగించి చూపిన మహాకవి గురజాడకివియే
- మనః పూర్వక నివాళు లందాం .
- లోకహితము సాహిత్యమనెడి
- నానుడిని నిజంచేసిన నవభావముల వృద్ధ్హ యువకుడు నవయుగ వైతాళికుడై
- అడుగుజాడను వదిలి వెళ్ళిన గురజాడకు నివాళు లందాం.
- ముదమారగాముత్యాలసరములు ఏర్చి కూర్చిజాతికిచ్చి
- కన్యాశుల్కపు కార్చిచ్చులో
- కాలిపోవు బ్రతుకులను గని
- కలం వైద్యం జేసి మూఢ మతుల
- బ్రతుకులు బైట పెట్టిన
- సంస్కర్త మనగురజాడ వారికీ
- జేజేలు పలికి నివాళు లిద్దాం.
- అందవిశ్వాసాలనేడు అగ్నికి ఆహుతయ్యేడిఅతివల బ్రతుకుల
- ఉద్ధరించగ నడుం కట్టిన
- విజయనగరపు కవికి ,రవికి నివాళు లందాం.
- సమాజంకుళ్ళె నంటూ
- చొచ్చచ్చని చొంగకార్చి
- చేతనైనది చేయువారికి చేతికికడ్డయి కాళ్ళ కడ్డయి
- అవాకులు చవాకులతో
- అవరోధము కల్పించు వారల
- నందరిని ఎదిరించినిలచి
- అభ్యుదయమార్గముల నడచిన
- మార్గదర్శి మన గురజాడ కు నివాళులందాం ఘన నివాళులందాం.
- ------------------------------------
- దామరాజు .విశాలాక్షి .
- 2011 novemberr 30 .మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా అంజలి ఘటిస్తూ దామరాజు .విశాలాక్షి .విశాఖపట్నం.
Tuesday 29 November 2011
మహాకవికి నివాళి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment