Wednesday 20 June 2012

శ్రీమాతా

శ్రీ కరంబయినట్టి శ్రీ మాత నామమును
చింతన జేయు మానవుల నె పు డు
సిరి సంపదలను సౌ భాగ్యము ల నొసగి
చల్లగా తల్లియై సాకు  చు౦డు

శ్రీ మాత శ్రీ లక్ష్మీశ్రీ విద్య రూపమై
సృష్టి స్థితి లయలు జరుపు తల్లి
సన్నుతించు వారి సర్వకాలములందు
సంరక్షించు చుండి శాంతి నొసగు

శ్రీ  కంఠుని గూడి శ్రీ మేరు గిరి పైన
చిదగ్నిలో చిన్ముద్ర తోడ 
శివుని పర్యంకాన స్థిరముగా కూర్చుండి
 చల్లని తల్లిగా  కాపాడు  చుండు.

అమ్మ గా జగతిని ఆ దరించి బ్రోవ
అయ్యచే గరళాన్ని త్రా గించె  జనని
అమ్మ ప్రేమకెపుడు అవధులులేవనుచు
అమ్మచాటెను గదా అవని లోన
.
అమ్మ అయ్య లోని అర్ధ భాగము నొంది
అన్నియును తానయి ఆదరించు
అఖిల రూపములలో ఆవరించిన తల్లి
ఆద.రి౦చును జగతి నహర్నిశము   

No comments:

Post a Comment