Saturday 12 January 2013

సంక్రాంతిసంబరాలు



సంక్రాంతిసంబరాలు
  ధనుర్మాసమనడంతో  
 సంబరాలుప్రారంభం                                                                  
రంగురంగులతో రమణులు దిద్దే
రంగవల్లులతో ఆరంభం
తిరుప్పావై ప్రవచనాలతో  
  గోదా సేవలు ప్రారంభం     
ముద్దులొలుకు  ముగ్దలుదిద్దే  
ముత్యాల ముగ్గులు  ప్రారంభం       
  ఇంటిని ఒంటిని అలంకరించుట
ఇంతుల కెంతో ఆనందం
గొబ్బిల్లంటూ గంతులేయడం
కన్నె పిల్లలకు సంతోషం
పండుగ కోసం పిండివంటలు
చేసే గృహిణుల సందోహం
అల్లుళ్ళతో  కూతుళ్ళతో
ఇల్లిల్లు సందోహం
 కానుకలిచ్చి  పంపించుటలో
అత్తమామలకు ఆరాటం
                          

పంటల కోతలు కుప్ప నూర్పులతో
రైతుల ఇళ్ళలో సంతోషం
గంపలకొలది దానముచేయుట
ఘనమని రైతులవిశ్వాసం
 బుడబుక్కలతో కొమ్మదాసరులతో
పల్లెవీదులలో సందోహం
హరిదాసులతో మేలుకోలుపులతో   
తెల తెల్లవారే తీరంద౦  
మరదలి వెంట పరుగులు పెట్టీ
బావల తీరు ఒక చందం  ఒకఅందం
బావాబావా పన్నీరంటు
తిప్పలు పెట్టుట ఒక అందం 
బంతి  పూలతో చేమంతులతో
పౌష్య లక్ష్మికి పేరంటం
 సంప్రదాయము ప్రతిబింభించే
సంక్రా౦తి పండుగ ఆనందం  
పెద్దలకోలుచుట,                                                                                                                                                                                                                              పధ్ధతి  నీర్చుట                
పండగ జరుపుట లసలర్ధం
ఒకరిని  ఒకరు గౌరవించుట
ఈ పండుగ లోని పరమార్ధం .
 చీరలు నగలు చూపుతు చూసే  
స్త్రీలలో ఎంతో ఉత్సాహం
పది మందితో పంచుకు తినుటే
 ఈ పండగలోని  పరమార్దం .
రావణకాష్టం రగుల్చుట కోసం
పిడకల దండల  పరిహారం