Saturday 20 June 2020

బాలలకథలు


                                 ఉపాయం
ముగ్గురు వర్తకులవర్తకం కోసం వేరే ప్రాంతం  వెళ్ళి వేరేచోట
అమ్ముకోవడానికి  సరుకులు పడవల్లో తెచ్చుకుంటున్నారు .
 అకస్మాత్తుగా గాలి వానరావడం వలన దగ్గరగా ఉన్న తీరంలో గల
ఊరిలో  ఆగుదామని పడవలు  లంగరు వేద్దామనుకుంటుండగానే
పెద్ద పెనుగాలి వచ్చి పడవలు తిరగబడి పోయాయి .
 ఉప్పుమూటలు .పప్పు మూటలు. నీటిలో కరిగి కొట్టుకుపోయాయి .
ఉప్పువాడు ఏడుస్తున్నాడు , పప్పు వాడూ ఏడుస్తున్నాడు.కొబ్బరి
 బొండాల వాడు  దొర్లి దొర్లి. ఏడుస్తున్నాడు .
మిగిలినఇద్దరూ అన్నారు .మేము గోల పెట్టి ఏడ్చామంటేఅర్ధంఉంది.
నువ్వెందుకలా  గోలపెడుతున్నావ్ ? మా సరుకంతఎక్కువ ఖరీదు సరుకూకాదు
విలువైనది కాదు నీసరుకు అన్నారు అక్కసుగా .
కొబ్బరి బొండాలవాడన్నాడువిలువైనదయినా కాకపోయినా మీసరుకుపోయింది.
 అది తడిసి పాడయి కొట్టుకు పోయింది .  
నేనంతలా ఏడవబట్టే కదా త్రోవన పోయే వారందరూ
వచ్చి పోగా. మిగిలిన బొండాలు  నాకు పోగు జేసి ఇచ్చారు .
తెలివిగా అన్నాడు మిగిలిన ఇద్దరూ వాడి  తెలివికాశ్చర్య పోయారు .






No comments:

Post a Comment